Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
టీఎస్పీఎస్సీ వ్యవహారంపై గవర్నర్, సీఎం మౌనం వీడాలనీ, నిరుద్యోగులకు న్యాయం చేయాలని గవర్నర్కు వినతిపత్రం అందజేయడానికి వెళ్తున్న బహుజన్ స్టూడెం ట్ జాక్ ఓయూ జాక్ విద్యార్థి సంఘాల నాయకుల్ని ఓయూలో అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యో గులకు గుండెకాయ అయిన టీఎస్పీఎస్సీలోని ఉద్యోగులు, బోర్డు సభ్యుల బంధువులు పేపర్ల లీకేజీకి పాల్పడి నిరుద్యోగుల జీవితాలతో ఆడుతున్నారన్నారు. ఈ పేపర్ల లేకేజీకి బాధ్యత వహించి చైర్మన్, బోర్డు సభ్యులు ఇప్పటికీ రాజీనామా చేయకుండా మీనావేషాలు లెక్కిస్తున్నారన్నారు. పరీక్షలను సరిగా నిర్వహించడం చేతగాని ఈ ఛైర్మన్, సభ్యులకు ప్రభుత్వం ఇంకా వంతపాడటం విడ్డురంగా ఉందన్నారు. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో ఆటలా డిన పేపర్ల లీకేజీకి బాధ్యయులైన చైర్మన్, సభ్యులను బర్తరఫ్ చేయకకుండా మళ్ళీ వారి ఆధ్వర్యంలోనే తిరిగి పరీక్షలు నిర్వహించడం అంటే నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుందన్నారు. ఈ విషయంపై ముఖ్య మంత్రి కేసీఆర్, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని టీఎస్పీ ఎస్సీ చైర్మన్, బోర్డు మెంబర్లను వెంటనే తొలగించాలనీ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్ష లను అడ్డుకుంటామని ఓయూ జేఏసీ, బహుజన విద్యార్థి సంఘాలుగా హెచ్చరించారు. ఈ విషయం పై గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసేవరకు ఈ నెల 8వ తేదీ నుంచి రీ షెడ్యూల్ ప్రకటించిన ఎగ్జామ్స్ అన్నింటినీ అడ్డుకుంటామని బహుజన్ స్టూడెంట్ జాక్ చైర్మన్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజరు, పులిగంటి వేణుగోపాల్ అంబేద్కర్, నవీన్, అంజి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు తగరపు ప్రవీణ్ చంద్రశేఖర్, రాకేష్, ఆనంద్, సత్యం, వినోద్, అన్సర్, హర్షద్, తదితరులు పాల్గొన్నారు.