Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
మేడే వారోత్సవాల సందర్భంగా గోషామహల్ జోన్ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ గోషామహల్ జోన్ కన్వినర్ కె.జంగయ్య హాజరై ఆటల పోటీలు ప్రారంభించి సీఐటీ యూ జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 8 గంటల పని విధానం అమలు కోసం పెద్ద పోరా టం చేసిన రోజు ఈ మేడే అనీ, మేడే స్పూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడాలని కార్మికులకు పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధా నాలఫై పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్మికులను కోరారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీ యూ గోషామహల్ జోన్ కో-కన్వీనర్ నెమ్మది కిరణ్, సీఐటీయూ నాయకులు షకిల్ మైహ్మద్, మున్సిపల్ కార్మి కులు శాంతమ్మ, లక్ష్మి, బుజ్జి, లలిత, సుకన్య, ఉల్యమ్మ, సైద మ్మ, అమృత, మంజు, దోలి, ఈశ్వరమ్మ, యాదమ్మ, జంగ మ్మ, సుశీల, తదితరులు పాల్గొన్నారు.