Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 937 మంది కస్తూర్బా టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
- విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కస్తూర్బా పాఠశాలల్లో పర్మినెంట్‌గా టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని పలు జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది కస్తూర్బా పాఠశాల టీచర్లు ముట్టడించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 937 మంది కస్తూర్బా పాఠశాల టీచర్లను విధుల్లోకి తీసుకో వాలని డిమాండ్ చేశారు. రెండేండ్ల క్రితం అక్టోబర్ మాస ంలో పైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో నెం.1321 తేది:19/ 10/2021న ఆర్డర్స్ ఇస్తూ కస్తుర్బా గాంధీ పాఠశాలల్లో 937 టీచర్ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేశారని గుర్తు చేశారు. ఆ జీవోలో కాంట్రాక్టు టీచర్లుగా భర్తీ చేయా లని స్పష్టంగా ఉందన్నారు. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని దాటవేస్తున్నారన్నారు. ప్రతి ఏడాదీ వారిని మార్చిలో టర్మినేట్ చేస్తున్నారనీ, ప్రస్తుతం ఉన్న 937 మంది టీచర్లను మెరిట్ పై నియామకం చేసి కేజీబీవీలలో బోధకులుగా పని చేస్తున్నప్పటికీ వారికి పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం లేదన్నారు. వీరిని ప్రతి ఏటా మార్చిలో టర్మినేట్ చేస్తూ మళ్లీ ఆగస్టులో తీసుకుంటు న్నారని తెలిపారు. పని చేస్తున్న తాత్కాలిక పోస్టుల్లో మళ్లీ తాత్కాలిక ఉద్యోగులను నియమించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి ఏడాదీ విద్యా శాఖ అధికారులు కొత్త వారిని నియమిస్తూ వారిని బెదిరి స్తున్నారని తెలిపారు. 2021 నవంబర్ నుంచి పని చేస్తున్న 937 టీచర్లను యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీరిని ప్రతి ఏటా తొలగించి కొత్తగా నియమిస్తే సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమే అవుతుం దన్నారు. సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు తీర్పు నిబంధన ప్రకారం వీరికి కనీసం చేసిన పని దినాలకు సరైన వేతనం చెల్లించడం లేదన్నారు. కేజీవిబిలో కాంటాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న పాత ఉద్యోగులతో సమా నంగా డే అండ్ నైట్ డ్యూటీలు, పండుగలు, హాలిడేస్ డ్యూటీలను సమానంగా చేశారనీ, వీరిని వాళ్లతో సమానం గా భావించి ఆర్డర్ ఆఫ్ మెరిట్ కాపీలను ఇప్పించి, పీఆర్సీని వర్తింపచేయాలని కోరారు. రాష్ట్రంలోని పాఠశాల ల్లో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయనీ, కార్పొరేట్ స్కూళ్ల కు ప్రభుత్వం దారదత్తం చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశా లలను వెంటనే పటిష్టం చేయాలనీ, లేకపోతే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి సమాజంలో రౌడీలు, గూండాలుగా త యారవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ, బీసీ నాయకులు భూపేష్సాగర్, అంజి, అనంతయ్య, నాని, నిఖిల్, రాందేవ్, పాల్గొన్నారు.