Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖ రరావుకు తెలం గాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ హార్థిక శుభాకాంక్షలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసింది. చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజు గౌడ్ కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ మాట్లాడారు. ఎన్నో కష్టాల్లో ఉన్న కల్లుగీత కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకుని రక్షించాలని గీత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించాలని నిరుపేద గీత కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. గౌడ్ల తరపున ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం అవుతామని వారు తెలిపారు.