Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించి రియాక్టర్లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఐడీఏ కూకట్పల్లి గాంధీనగర్ పారిశ్రామికవాడలో లార్వెన్ పెయింట్స్ అండ్ కెమికల్స్ పరిశ్రమలో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా రియాక్టర్ వద్ద ఉష్ణోగ్రతలు పెరిగి షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో దట్టమైన పోగలు వ్యాప్తి చెందడంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. పెయింట్స్ కలిపే టిన్నర్ డబ్బాలు సైతం పక్కనే ఉండటంతో వాటిని తీసే క్రమంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న పరిశ్రమల యజమానులు సొంత బోర్ల సహయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. వెంటనే యజమాన్యానికి సమాచారం అందించడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సనత్‌నగర్ అగ్ని మాపక శకటం సహయంతో సుమారు రెండు గంటల పాటు ఫైర్ అధికారులు హేమంత్‌కుమార్, ప్రదీప్‌కుమార్‌లు సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తేవడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదు.