Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ పేర్లను శిలాఫలకాలపై చేక్కిస్తాం
మీరు పోతే కంచువిగ్రహాలు పెట్టేస్తాం
అభిషేకాలు చేసేస్తాం.
హారతులు పట్టేస్తాం...
అలాంటి మేము
మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించి...
సౌకర్యవంతమైన ఇల్లిచ్చి , కార్లిచ్చి
మీ అవసరాలను మా సొమ్ముతో తీరుస్తూ
అన్ని హంగులతో అసెంబ్లీ ఏర్పరచి...
''కోరి ఎన్నుకున్న ప్రజలకోసం
దేశాభివ ద్ధి కోసం చర్చించండని''
రాజ్యాంగం చెబితే
మేం లైవ్ లో చూస్తున్నామన్న
విచక్షణ కూడా లేకుండా
చేపల సంతకు నియంతలా ఓ స్పీకరు
అసెంబ్లీలో మీ తీరు
పోడియం దగ్గర మీ పోరు...
''కుళాయి దగ్గర కొట్లాట'' అనే అంతరించిపోతున్న కళకు అసెంబ్లీలో ప్రాణం పోస్తున్న మీరు.
ఇదంతా మిమ్మల్ని ఎన్నుకున్న మా నిర్ణయాన్ని వెక్కిరిస్తున్నట్లుంది.
పార్టీ ఏదైనాకాని నాయకులెవరైనాకాని
అర్థం పర్థం లేని విమర్శల పర్వాలతో
సమయాన్ని వ ధా చేసేస్తున్న
ఓ రాజకీయ నాయకులారా మీకు మా సలాం
మీ సభ కిష్కిందకాండ ను తలపిస్తూండగా
''జంతువునుండి మనం రూపాంతరం చెందాం''
అన్నది గుర్తుచేస్తున్న మీకు మా దండాలు
ఓ నాయకులారా!!!
పది తరాలు తిన్నా తరగని ఆస్తులకోసం గడ్డికరిచేకంటే
పది కాలాలపాటు గుర్తుండేలా
బతకండయ్యా???
ఆలోచించండి
సమయాన్ని వ ధా చేయక
దయచేసి ధర్మంతో కూడిన కర్తవ్యపాలన చేయండి.
అలాచేస్తే
దేశంలో మన రాష్ట్రమే నెంబర్వన్.
అప్పుడు ప్రతీ నాయకుడు చరిత్రకారుడే.
కోట్లప్రజల గుండెల్లో స్థానము మీదే...
- జ్యోతి రాజ్.భీశెట్టి(ఆళ్ళ)
హైదరాబాద్