Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధూల్‌పేట్
రంజాన్ పండుగ సందర్భంగా పాతబస్తీ మార్కెట్లలో క్రయ విక్రయాల జోరు ఊపందుకు ంది. చార్మినార్ పరిసరాలలోని దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళ కళలాడుతున్నాయి. విద్యుత్ కాంతులతో షాపింగ్ మహాల్.. మొగు లారు వంటకాల ఘుమఘుమలు పర్యాటకుల ను, సందర్శకులను నోరురిస్తున్నాయి..
రంజాన్ రోజున కచ్చితంగా నూతన వస్త్రాలను ధరించడం ముస్లిము కుటుంబాలకు సాంప్రదాయం. అందుకే పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కొత్త దుస్తువులను పండుగ సందర్భంగా ముందే కొనుగోలు చేస్తారు. తమకు నచ్చిన, మెచ్చిన వివిధ రకాల వస్త్రాలు కొనుగోలు చేసి షేర్వానీ, సూట్లను కుట్టించుకుంటారు. సాధారణంగా నిరుపేద ముస్లిములు రెడీమేడ్ దుస్తుల పైనే ఎక్కువగా ఆధారపడుతారు. ఇప్తార్ సమయంలో మక్కామసీద్ చార్మినార్ నుంచి మదీన సెంటర్ వరకు వినియోగదారులతో రహదారులన్నీ జనంతో కిక్కిరిసి పోతున్నాయి.
ప్యాషన్ మెరుపులు.. మొగలాయి రుచులు..
పాతబస్తీలో అంతర్జాతీయ స్థాయిలో అందమైన గాజులు, ముత్యాల గాజులకు ప్రసిద్ధి గాంచింది లాడ్ బజార్. చార్మినార్ సమీపంలో గల ఈ లాడ్ బజార్ రంగు రంగుల గాజులతో ముత్యాల హారాలతో తళ తళ మెరుస్తూ మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళల అభిరుచికి అనుగుణంగా ఈ సారి ప్యాషన్ గాజులు మార్కెట్లోకి ప్రవేశ పెట్టినట్టు లాడ్ బజార్‌లోని వ్యాపారులు తెలిపారు. రంజాన్ కొనుగోలు చేస్తున్న వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తూనే అర్ధరాత్రి సమయంలో హోటళ్లలో వివిధ రుచులను ఆస్వాదిస్తున్నారు. పాతబస్తీ ప్రముఖ హోటళ్లలో ప్రత్యేక మొగులాయి వంటకాలు సిద్ధంగా ఉంటున్నాయి. హలీం, షేక్ కబాబ్ వంటి రుచులను ఆస్వాదిస్తున్నారు.
రుచకరమైనవి ఈ వంటకాలు..
మొగలాయి వంటకాలకు ప్రత్యేకంగా రంజాన్‌లో ఎక్కువగా అస్వాదిస్తారు. ఈ వంటకాలు అన్ని రకాల పోషకాల దినుసులతో వివిధ రుచులను కల్గి ఉంటాయి.
- ఎస్కె జాఫర్ నిజాం
ఇఫ్లార్‌లో ప్రత్యేకం..
సోదర భావాన్ని పెంపోందించేందకు ఇఫ్తార్ విం దుకు అందరిని ఆహ్వానిస్తాం. అందులో కొందరు నాన ్వెజ్ తినరు. కాబట్టి కుర్బానీ, సేమియా, కుల్ఫీ, బాదమ్ సలాడ్ వంటి వంటకాలతో కుర్బానీలా చేస్తార.
- అస్రఫ్ ఖాన్