Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీ అంజనీకుమార్
- ఎంతటి వారినైనా వదలొద్దు..
- కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న పలువురు పోలీసులు
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారహిల్స్ పీఎస్ పరిధిలో పాత నేరస్థునికి కఠిన శిక్ష పడేలా కషి చేసిన పలువురు పోలీసులకు హైదరాబాద్ సీపీ అభినందనలు తెలిపారు. బుధవారం సీపీ చేతులమీదుగా బంజారహిల్స్ పీఎస్ పోలీసులు ప్రశంసపత్రాలు అందకున్నారు. వివరాల్లోకెళ్తె..క్రైమ్ డీఏ కె.రవికుమార్ 2018లో సయ్యద్ నగర్‌కు చెందిన గోల్కొండ రౌడీషీటర్ ఫిరోజ్ అలియాస్ (అబ్దుల్లా భక్తియార్), ఒమర్ అతని సోదరుడు అజీజ్ తాగి కిరాణా షాపుకు వచ్చిన వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నంలో చాకుతో దాడి చేశాడు. ఈ ఘటనలో నేరస్థులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వారికి శిక్ష పడేలా ఖచ్చితమైన సాక్ష్యా దారాలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 2018లో నిందితుడిపై మొత్తం 13 కేసులను నమో దు చేశారు.
ఈ కేసులు గోల్కొండ పోలీస్‌స్టేషన్ హుమాయున్‌నగర్, ఆసిఫ్‌నగర్ పీఎస్‌ల పరిధిలో ఈ కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. ఆ నిందితులకు చివరగా ఐపీసీ 532 సెక్షన్ కింద ఫాస్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరునెలల శిక్ష విధించింది. ఈ కేసును చాకచక్యంగా పరిష్కరించిన డిఐ రవికుమార్, ఎస్సై రవిరాజ్, క్రైమ్ టీం సభ్యులు, సీఐ రవీందర్‌రెడ్డి, కానిస్టేబుల్ శాంతకుమార్, కోర్టు కానిస్టేబుల్ రవికిరణ్‌ను సీపీ ప్రశంసించి, సర్టిఫికెట్స్‌ను ప్రదానం చేశారు.