Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్‌పేట
మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు మలక్‌పేట తిరుమ లహిల్స్లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆర్.కే.పురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి తీగలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామాచారి, పగిళ్ల భూపాల్‌రెడ్డి, గొడుగు శ్రీనివాస్, యాదవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పెంబర్తి శ్రీను, శ్రీమన్నారాయణ, మహిళా నాయకులు సునిత, చామల శైలజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బడంగ్‌పేట
మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి ఆయన జన్మదినం సందర్భంగా బడంగ్‌పేట మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించి పేద ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొర్ర జగన్‌రెడ్డి, నాయకులు సమరసింహారెడ్డి, పవన్‌యాదవ్, వెంకటేష్, విష్ణువర్థన్‌రెడ్డి, రాంరెడ్డి, నాగేందర్‌గౌడ్, తుఫాన్రెడ్డి, జంగారెడ్డి, సంతోష్, రాజ్‌కుమార్, నవీన్‌గౌడ్, సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు
ఎల్బీనగర్
మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీగల కృష్ణారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మీర్పేట్
తీగల కష్ణారెడ్డి జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగాయి. తీగల కష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనితరెడ్డి, తీగల రంజిత్ రెడ్డి, రాజేష్, యాదయ్య, లలిత జగన్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.