Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ కొత్తదుర్గమ్మ
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ పరిధిలోని 15వ డివిజన్లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని 15వ డివిజన్ కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని సూరారంనగర్లో పర్యటించి కాలనీలో నెలకొన్న సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు.పలు సమస్యలపై కార్పొరేటర్‌కు కాలనీ వాసులు వినతి పత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..త్వరలోనే అధికారులతో మాట్లాడి కాలనీ సమస్యల పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత కొత్తకిషోర్గౌడ్, సోమనర్సింహ్మచారి, కిషోర్‌యాదవ్, బోడ్డుపల్లి శ్రీనివాస్, సుదర్శర్ రెడ్డి, గణేష్ పాల్గొన్నారు.