Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సినీ సంగీత సామ్రాజ్యాగ్రగణ్యం
భారతీయ సంగీత 'మణి'మాన్యం
భాషోచ్చారణా ప్రాణ ప్రామాణ్యం
ఆ గళపు మెళుకువలు అన్ని భాషలకూ అనుగుణ్యం
ఆ సద్యఃస్ఫోరక సజనలు అసామాన్యం
వారి పురిటి కేక విన్న తెలుగునేల ధన్యం
ఈ శ్రీపతి సంగీతాలయ ప్రధాన స్థపతి
బాలల్లో బాలుడై పాడించాడు తీయగా
వయసును, యశసును మరచి
స్నేహం పంచాడు హాయిగా
'పండితాం 'శ పండిన మన 'సు(శు)బ్రహ్మణి'
వేనవేల పా(ల)టపుంతల సినీ వినీలాభ్రమణి
స్ఫురద్స్వరద్రూపమై, భా(ష)సమాన దీపమై
తనకు తాను పుంభావమైంది బ్రహ్మరమణి
సప్తస్వర సంద్రపు అలలపై అలవోకగ పడగెత్తిన ఫణి
వారి గళపాతం పారీపారీ సింధువైనది
వినగలిగిన ప్రతి హదయం వారి బంధువైనది!
- మడిపల్లి దక్షిణామూర్తి,
9866277107