Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్య చిట్కాలు
˜ ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం సమస్య బాగా పెరిగింది. వీరికి అధికంగా ఫైబర్ ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
˜ దీనిలో ఎక్కువగా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫైమిన్, రైబోఫ్లెవిన్ అధికంగా వుంటాయి.
˜ ఫాక్స్‌టెయిల్ మిల్లెట్స్ ఎల్డిఎల్ - చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి
˜ దీనిలో వుండే విటమిన్ బి1 పెద్ద వయసులో వచ్చే అల్జీమర్స్‌ని తగ్గిస్తుంది. దీని వలన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
˜ బెల్స్పాల్సీతో బాదపడేవారు దీనిని తీసుకోవడం వలన ఫలితం వుంటుంది.
˜ ఈ మధ్య కాలంలో నాడీసంబంధిత సమస్యలు చిన్నా పెద్దా తేడా లేకుండా వస్తున్నాయి. కొర్రలు తినడం వలనల నాడీ మండలం వ్యవస్థ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
˜ ఫాక్స్‌టెయిల్ మిల్లెట్లో ఐరన్, కాల్షియం పుష్కలంగా వుంటడం వలన కండరాలు సమస్యతో బాధపడేవారు కొర్రలని తింటే చక్కటి ఫలితం వుంటుంది.
˜ డయాబెటిక్ దీర్ఘకాలంగా వున్నవారు కొర్రలను తినడం ద్వారా షుగర్‌ను కంట్రోల్ పెట్టవచ్చు.
˜ కొర్రలను ఆహారంలో చేర్చడం ద్వారా హైఫైబర్ వలన కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ.
˜ కొర్రలను తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
˜ థైరాయిడ్ ఉన్నవారు దీనిని మోతాదు తక్కువగా తీసుకోవాలి. మిల్లెట్స్‌లో గాయిట్రోజన్స్ ఎక్కువగా వుంటాయి కనుక.
- పి.వాణి, 9959361180