Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుండలోని మంచినీళ్ళు అనగానే... అబ్బ... ఎంత బాగుంటాయో! అనుకుంటాం. ఫ్రిజ్లో పెట్టిన ఎంతటి చల్లని నీళ్ళయినా, ఎన్ని రకాల కూల్డ్రింక్స్ కళ్ళముందు పెట్టినా కుండలో నీళ్ళు తాగగానే మలయమారుతం మేనును తాకినట్టు అనిపిస్తుంది. ఆ సహజత్వమే వేరు. ఎలక్రికల్ పరికరాల ద్వారా కాకుండా సహజంగా చల్లగా మారిన నీటి మహత్యం అది. మట్టి కుండ నీటిలో ఖనిజాలు, పోషకాలను చెక్కుచెదరకుండా ఉంచుతుంది కనుక త్వరగా రీహైడ్రేట్ అవుతుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు కనుక ప్రతిరోజూ కుండ నీటిని తాగితే జీవక్రియ పనితీరు మెరుగవుతుంది. అంతేకాదు, గొంతు సంబంధిత సమస్యలు కూడా వుండవు. బంకమట్టి ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉండటంతో ఈ మట్టి ఆమ్ల ఆహారాలతో సంకర్షణ చెందుతుంది. బంకమట్టి నీటి పిహెచ్ సమతుల్యతను అందించడమే కాక, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది.