Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య చిట్కాలు
ప్రస్తుత జీవన శైలిలో ఉద్యోగం ప్రథమస్థానం కానీ వారి రోజువారీ పని సమయాల్లో ఉద్యోగరీత్యా సమయానికి తినకపోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు, చిన్న వయసులో డయాబెటిస్ లేదా ఇ తర హార్మోన్ సమస్యలు అధిక ఒత్తిడి వలన అధికమవుతున్నాయి.
- సరైన సమయంలో తినకపోవడం, ఆకలితో ఏదో ఒక జంక్‌ఫుడ్ తినడం వలన ఊబకాయం, ఓవర్‌వెయిట్ సమస్యలు పెరుగుతున్నాయి.
- ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా ఫుడ్ క్రేవింగ్స్ వలన జంక్ ఫుడ్ తినడం వలన ఎక్కువ ఫ్యాట్స్ శరీరాల్లో చేరుతున్నాయి.
- దీని వలన గుండె సమస్యలు, కొలెస్ట్రాల్‌లో హెచ్చుతగ్గులు, చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు.
- వీటిని అధిగమించడానికి ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు కాస్త అవగాహన అవసరం.
- ఎక్కువగా కూరగాయలు ఉదాహరణకు కీర, క్యారెట్, మొలకలు, సూప్ లాంటివి మెయిన్ మీల్స్‌కి ముందుగా తీసుకోవడం మంచిది.
- ఏదైనా పండు ఉదా : జామ, ఆపిల్, వాటర్‌మిలన్ లాంటివి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి ముందు తీసుకోవడం మంచిది.
- ఏదైనా స్నాక్స్ తీసుకోవాలి. అంటే ఆఫ్షన్‌గా వెజిటేరియన్ ఫుడ్ ఎంచుకోవాలి.
- పాప్‌కార్న్, బేల్‌పూరి, బాయిల్డ్ పల్సెస్ (పల్లీలు) శనగలు లాంటివి.
- మజ్జిగ, కొబ్బరినీళ్ళు, డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్, బాదంపాలు, క్యారెట్సూప్, డ్రైఫ్రూట్ లడ్డూలు, నువ్వులుండలు, చక్కీల్లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
- ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారం మీతో క్యారిఫుడ్ చేయడం వలన ఎక్కువగా వాటినే తినడం హెల్తీలైఫ్కి స్కోప్ వుంటుంది.
- మనం తినే ఆహారం మన రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతుంది.
- హెల్తీఫుడ్ తింటూ రోజంతా ఎనర్జిటిక్‌గా వుండడం మంచి పరిష్కారం.
- డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినడం వలన ఆరోగ్య సమస్యలతో పాటు బద్దకం కూడా ఎక్కువవుతుంది. తొందరగా ఆకలి వేయడం జరుగుతుంది.
- బయటి ఫుడ్ తినాల్సి వస్తే వెజ్ పులావ్, సాంబార్ రైస్, పెరుగన్నం, వెజ్ కిచిడి, జీరా రైస్, రోటీ లాంటివి ఆరోగ్యకరం.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, యాక్టివ్‌గా, హెల్దీగా వుండండి.
- పి.వాణి, 9959361180