Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని నీరు తాగుతుంటారు. మరికొందరు కాఫీ, టీ అంత వేడిగా వున్న నీరు తాగుతుంటారు. ఇలా వేడినీళ్ళు తాగేవారు అనుకోని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు అంటున్నారు. వేడి నీటిని తాగడం వల్ల కలిగే నష్టాలలో కణజాలం దెబ్బతినడం, దాహం సంకేతాలు తగ్గడం వంటివి వుంటాయట. వ్యాయామం చేసేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ హైడ్రేషన్, చెమట పట్టడం ఎక్కువగా వుంటుంది. కొన్నిసార్లు వేడి నీటిని తీసుకోవడం వల్ల పెదవులు, నోటి లైనింగ్‌ను దెబ్బతీయవచ్చు. వేడి నీటిని తాగడం వల్ల రోజువారీ తాగాల్సినంత ఎక్కువ నీరు తాగలేకపోవచ్చు కూడా. వేడి నీరు తాగడం వల్ల నోటిలో బొబ్బలు ఏర్పడితే, అది అన్నవాహిక- జీర్ణవ్యవస్థ యొక్క సున్నితమైన లైనింగ్‌ను కూడా దెబ్బతీస్తుంది. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది కనుక ఇది అంతర్గత అవయవాలపై చాలా ప్రభావం చూపుతుంది.