Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మలా బిర్లా గారు 2010 సంవత్సరంలో జిపి (గంగాప్రసాద్ బిల్లా) బిర్లా గారు కాలం చేసిన తర్వాత వారి స్మారకార్థం 2011లో ఈ జిపి బిర్లా గ్రంధాలయాన్ని ప్రారంభించారు.
నిర్మలా బిర్లా గారు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్ను సందర్శించినప్పుడు దాదాపు 5 లక్షల గ్రంధాలు ఆ గ్రంథాలయంలో ఉన్నాయి. కనీసం దానిలో ఐదు శాతం గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని హైదరాబాద్ బిర్లా సెంటర్లో జిపి బిర్లా స్మారకార్థం ఏర్పాటు చేయాలని ఆమె కోరిక. ఈ గ్రంథాలయాన్ని యువకులు ముఖ్యంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలని వారి ఆకాంక్ష. వారు అనేక దేశాలు సందర్శించడం, ఆ సందర్శనలో భాగంగా వివిధ దేశాల నుంచి సేకరించిన అరుదైన పుస్తకాలు, కొని చదివినవి, బహుమతిగా వచ్చిన పుస్తకాలన్నింటిని ఈ బిర్లా గ్రంథాలయంలో చూడవచ్చు.
ఈ గ్రంథాలయంలో కళలు, చరిత్ర, మతసంబంధమైన, విజ్ఞాన సర్వస్వాలు, తత్వశాస్త్రం, సైన్స్, మెడికల్ సైన్స్, మోడరన్ ఆర్ట్ వంటి పుస్తకాలు హిందీ, ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉన్నాయి. దాదాపు పన్నెండు వేల పై చిలుకు పుస్తకాలు ఇక్కడున్నాయి.
ఆర్కియాలజీ: ఆర్కియాలజికల్ సర్వే రిపోర్టులు 1919 నుండి 1990 వరకు అందుబాటులో ఉన్నాయి. ఏలేశ్వరం తవ్వకాల పుస్తకాలు, నాగార్జునకొండ తవ్వకాల పుస్తకాలు, హరప్పా, సింధు ఎక్స్ కవేషన్, మగధ ఎక్స్ కవేషన్ వంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
కళలు: ఆర్ట్ ఆఫ్ ఇండియా, చవి, మొగలాయిల పెయింటింగ్స్, బుద్ధ పెయింటింగ్స్, రవీంద్రుని చిత్రావళి, భారతీయ శిల్పం, మొనేట్, మాస్టర్ ఆఫ్ ఇండియన్ డ్రాయింగ్స్, ప్రపంచ కళలు, భారత సూక్ష్మ చిత్రాలు (మినియేచర్), ద ఆర్ట్ ఆఫ్ ఇండియన్ పెయింటింగ్స్, దాలి వంటి అపురూపమైన పుస్తకాలను ఇక్కడ వీక్షించవచ్చు. వీటితోపాటు గ్రీస్, రోమ్, చైనీస్ ఒమన్, రష్యన్ దేశాల, ఇండోనేషియా, మలేషియా, బర్మా, శ్రీలంక దేశాల పెయింటింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
విజ్ఞాన సర్వస్వాలు (ఎన్సైక్లోపీడియాస్ అండ్ డిక్షనరీస్): వరల్డ్ బుక్ డిక్షనరీ, ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం, ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా ఆఫ్ అమెరికానా, ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ గార్డెస్, ఎర్ల్ ది ఎర్త్, ఇంగ్లీష్, సంస్కతం, హిందీ, తెలుగు డిక్షనరీలు అందుబాటులో ఉన్నాయి.
ఇతిహాసాలు: యజుర్వేదము, ఋగ్వేదము, అధర్వణ వేదం, సామవేదం, భాగవతం, కూర్మ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, మార్కండేయ పురాణం, శివపురాణం, బ్రహ్మపురాణం, పద్మ పురాణం, హరివంశపురాణం వంటి ఇతిహాస పుస్తకాలను ఇక్కడ చూడొచ్చు.
ఏపీగ్రఫీ: ఇండియా ఏపీగ్రఫీ, సెలెక్టెడ్ ఎపిగ్రఫీ ఇన్స్క్రిప్షన్, సౌత్ ఇండియన్ ఏపీగ్రఫీ, నార్త్ ఈస్ట్ ఏసియన్ ఏపీ గ్రఫీ, మలేషియన్ ఏపీగ్రఫీ అందుబాటులో ఉన్నాయి.
నవలలు, కథలు: దాదాపు 900 ఇంగ్లీష్ నవలలు కథలు ఎక్కువగా అంతర్జాతీయ ఆంగ్ల రచయితలకు సంబంధించిన పుస్తకాలున్నాయి.
తత్వశాస్త్రం (ఫిలాసఫీ): సాక్రేట్ ఆఫ్ ఈస్ట్, మ్యాక్స్ ముల్లర్ బుక్స్, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో, గాంధీయన్ ఫిలాసఫీ, బౌద్ధ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
మత (రిలీజియన్) సంబంధమైన పుస్తకాలు: హిందూమత పుస్తకాలు, బౌద్ధం జైనిజం, శైవం, వైష్ణవిజం, సిఖ్ ల పవిత్ర గ్రంథం గురుగ్రంధి, ఇస్లామీసం, క్రైస్తవ మతం కు సంబంధించిన పుస్తకాలు 300 కలవు.
బయోగ్రఫీస్: అబ్రహం లింకన్, గాంధీ, నెహ్రు, కారల్ మార్క్స్, ఏంజెల్, స్వామి వివేకానంద, సర్దార్ వల్లభారు పటేల్, భగత్ సింగ్, సర్ సివి రామన్, జగదీష్ చంద్రబోస్ వంటి జాతీయ అంతర్జాతీయ నాయకుల జీవిత చరిత్రలు, వారు రాసిన పుస్తకాలు (ఆటో బయోగ్రఫీ) అందుబాటులో ఉన్నాయి.
న్యుమన్ స్టిక్స్: గుప్తుల కాలం నాటి నాణేలు, కాకతీయుల కాలం నాటి నాణాలు, మొగలాయిల కాలం నాటి నాణేలు, చోళ చాళుక్యుల కాలం నాటి నాణేలకు సంభదించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఆర్కిటెక్చర్: ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్, మధ్యయుగ కాలంనాటి ఆర్కిటెక్చర్, మొగలాయిల కాలం కోటల్ నాటి ఆర్కిటెక్చర్, పల్లవుల కాలం నాటి దేవాలయాల ఆర్కిటెక్చర్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
జాతీయ సదస్సుల పుస్తకాలు: ఏపీ హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్, ఇండియన్ హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ సంబంధించిన పుస్తకాలు 1960 నుండి 2010 వరకు అందుబాటులో ఉన్నాయి. యురోపియన్ హిస్టరీ కాంగ్రెస్, సౌత్ ఏషియన్ హిస్టరీ కాంగ్రెస్ పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి.
ఐకానోగ్రఫీ: వైష్ణవ ఐకానోగ్రఫీ, బుద్ధిస్ట్ ఐకానోగ్రఫీ, దేవత మూర్తిలు, మొగలాయిలు, పల్లవులు, బౌద్ధుల ఐకానోగ్రఫీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
పిల్లల విభాగం: పిల్లలకు సంబంధించిన ప్రత్యేక విభాగం కలదు. ఆ విభాగంలో దాదాపు 500 బొమ్మల పుస్తకాలు, కథల పుస్తకాలు, మహాభారతం, రామాయణం పుస్తకాలు బొమ్మల రూపంలో అందుబాటులో ఉన్నాయి. బొమ్మలు వేసుకోవడానికి వారికి ప్రత్యేకమైన విభాగం కూడా వుంది.
Sidney Sheldon : Libraries store the energy that fuels the imagination. They open up windows to the world and inspire us to explore and achieve, and contribute to improving our quality of life. లాంటి అధునాతమైన పుస్తక సంపద హైదారాబాద్ యువతకు అందుబాటలో ఉన్నాయి.
జర్నల్స్ విభాగం: ద ఇండియన్ ఆంటిక్వరి (పురాతన వస్తువులు) 1871,73,76,75, కాలం నాటి జర్నల్స్, ద ఇండియన్ హిస్టరీ క్వార్టర్లి, ఏసియాటిక్ రీసెర్చ్, ఏపీగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆర్కియాలజీ రివ్యూ, ఇస్లామి కల్చర్, ద కల్చర్ ఆఫ్ ఇండియా, బులిటెన్ ఆఫ్ డెక్కన్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓరియంటల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ మ్యూజియం బులిటెన్, ఆనాల్స్ బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఆడయార్ లైబ్రరీ బులిటెన్, జర్నల్ ఆఫ్ ఏసియాటిక్ సొసైటీ, రీడర్ డైజెస్ట్ స్పెషల్ ఎడిషన్ పుస్తకాలు 1960 నుండి ఇప్పటివరకు, మార్గ్ 1950 నుండి 2023 వరకు, నేషనల్ జాగ్రఫీ, 1950 నుండి 2023 వరకు, సంబోధిని, ఇతిహాస జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి.
VAK(వాయిస్ ఆఫ్ టెంపుల్స్), భవాని జర్నల్ దైవ సంబంధ మాగజైన్ లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు పురాతనమైన జర్నల్స్, మ్యాగజైన్స్ను కూడా ఇక్కడ చూడొచ్చు.
ఈ గ్రంథాలయంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పాఠకులు వెళ్ళి చదువుకోవచ్చు. అదేవిధంగా మీటింగ్ హాల్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచే వుంటుంది. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నత విద్యకు తయారయ్యే విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఈ గ్రంథాలయానికి వివిధ విశ్వవిద్యాలయాల నుండి పరిశోధకులు పరిశోధనార్థం విచ్చేస్తుంటారు.
తొలుత ఈ గ్రంథాలయాన్ని సైంటిస్టులకు పరిశోధకుల కోసం మాత్రమే అనుమతించబడింది. రానురాను ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి, ఉన్నత చదువులు చదివే వారికి కూడా ఈ గ్రంథాలయంను ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
రీడింగ్ హల్లో నిత్యం 150 మంది 200 మంది, గ్రంథాలయానికి నిత్యం 60 మంది, వివిధ విభాగాలకు సంబంధించిన పరిశోధకులు పదుల సంఖ్యలో ఈ గ్రంథాలయానికి విచ్చేస్తుంటారు.
హైదరాబాద్ నడిబొడ్డున అందరికీ అందుబాటులో నామమాత్రపు రుసుముతో చదువరులకు అందుబాటులో ఉంది ఈ బిర్లా గ్రంథాలయం.
- డా||రవికుమార్ చేగొని, 9866928327