Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పి.వాణి, 9959361180
ఆరోగ్య చిట్కాలు
డీ హైడ్రేషన్, సన్‌స్ట్రోక్ అనేవి రెండు ఉష్ణ సంబంధిత సమస్యలు. వీటినితగిన జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేస్తే ప్రాణాంతకం అవుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వడదెబ్బనుంచి రక్షణ పొందవచ్చు.
డీ హైడ్రేషన్ / వడదెబ్బ లక్షణాలు :
- వాంతులు, విరేచనాలు, జ్వరం, అలసట, అతిసారం లాంటివి, తల తిరగడం, దాహం, పొడిబారిన చర్మం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ముఖ్యంగా చిన్న పిల్లలు, 60 ఏళ్ళు పై బడిన వ్యక్తులు ఎండదెబ్బకి గురవుతారు.
- మన శరీరంలో నీటిని చెమట, కన్నీళ్ళు, శ్వాస, విసర్జన ద్వారా కోల్పోతాం.
- సాధారణంగా ఆరోగ్యవంతులు నీటిని తాగడం, నీటి శాతం ఎక్కువగా వున్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా డీ హైడ్రేషన్ అయిన నీటిని భర్తీ చేయబడుతుంది.
నీరు ఎక్కువగా వుండే ఆహార పదార్థాలు :
నీరు ఎక్కువగా తాగలేని వారు నీటి శాతం ఎక్కువగా వున్న పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి.
పుచ్చకాయ : నీటిశాతం అధికంగా వుండే ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇది తక్కువ క్యాలరీలు గల ఆహారం అవడం వల్ల డైట్లో ఉన్నవారు నిరభ్యంతరంగా తినొచ్చు.
ఐస్ ఆపిల్ : తాటి ముంజలు వేసవిలో మాత్రమే విరివిగా లభిస్తాయి. దీనిలో క్యాలరీలు తక్కువ. కానీ కాల్షియం పైటో న్యూట్రియెంట్లు, విటమిన్లు పుష్కలంగా వుంటాయి. అందుకే దీన్ని పోషకాలు వుండే అమృత ఫలం అంటారు. దీన్ని ఎక్కువ తినడం వల్ల ఉదర సంబంధ సమస్యలకు చక్కని పరిష్కారం.
కొబ్బరి నీళ్ళు : ఇది అద్భుతమైన పానియం. వేసవి తాపం నుంచి బయటపడడానికి కొబ్బరి నీళ్ళు మంచి ఎంపిక. వేసవిలో వీటిని తరచూ తీసుకుంటుండాలి. కొబ్బరి నీళ్ళలో వుండే ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి.
నిమ్మరసం : ఇది కూడా వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం. దీనిలో విటమిన్ సి వుండడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ఇది శరీరాన్ని చల్లబరిచి బరువు తగ్గించడంలో సాయపడుతుంది.
కీరా : కూరగాయల్లో కీరాలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. కీరాని సలాడ్ రూపంలో తీసుకోవడం మంచిది.
స్ట్రాబెర్రీస్ : ఇవి అత్యధిక న్యూట్రిషియన్స్ కలిగినటువంటి పండ్లు. వాటర్ కంటెంట్ ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల వేసవి సీజన్లో శరీరాన్ని హైడ్రేట్ చేయొచ్చు.