Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు
మేలు వచ్చేనేని మెచ్చుదన్ను
చేటు మేలు తలప జేసిన కర్మముల్
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం : ఏదైనా కష్టం వచ్చినపుడు దైవాన్ని తిడతారు. తమకు మేలు జరిగినప్పుడు తమ ప్రతిభను మెచ్చుకుంటారు. ఏమైనా జరగడం, జరగక పోవడం మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన ప్రయత్నంలోనే లోపం ఉందని తెలుసుకోలేక దేవుడిని తిడుతుంటారు. చెడిపోయిన పనికి బాధ్యత మనదేనని గ్రహిస్తే మనలో ఆలోచన పెరుగుతుందని వేమన భావం.