Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనల్ని నడిపించే ఈ ప్రపంచానికి ఎన్నిసార్లు నమస్కరించినా సరిపోదు. సమస్త జీవరాశుల్ని తన పాపలుగా భావించి, ఒడిలో నిలుపుకునే ప్రకృతి దేవతకు ఎన్నిసార్లు సాగిలపడి మొక్కినా రుణం తీరదు. అలాంటి ప్రపంచ ప్రగతికి, సమస్త ప్రకతికి తన పాటతో నమస్కరిస్తున్నాడు రామజోగయ్య శాస్త్రి. 'జనతా గ్యారేజ్'(2016) సినిమాలో ఆయన రాసిన 'ప్రణామం ప్రణామం' అనే పాట సష్టిచరితకు హారతి పట్టిన పాట.
అచ్చమైన తెలుగుపదాలతోను, స్వచ్ఛమైన ఆంగ్ల పదాల తోనూ పాటలు రాయగల నేర్పు రామజోగయ్యశాస్త్రికి పుష్కలం గా ఉంది. ఇక్కడ 'ప్రణామం', 'ప్రమోదం' అంటూ సంస్కృత పదాలను కూడా పాటలో పొదిగాడు. ఆయన రాసిన పాటల్లో ఎంతో వైవిధ్య భరితమైన పాట ఇది..
జగతికి ఆదిదైవం సూర్యుడే కదా. అందుకే ఉదయకాంతిని మనకు అందించి ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యునికి మొదటగా నమస్కరిస్తున్నాడు కవి. మనకు రక్షణ కవచంగా ఉన్న ప్రకతి దేవతకు తదుపరి నమస్కరిస్తున్నాడు. సష్టిలోని ప్రతి చిత్రం ఎంతో విచిత్రమైంది. ఎంతో ప్రమోదభరితమైంది. మొదలేదో, ముగింపు ఏదో తెలియని వింత సష్టి. సకల పరిణామాలకు కేంద్రబిందువు అది. అలాంటి సష్టికి నమస్కరిస్తున్నాడు.
మనం ఉదయం లేచినప్పటి నుంచి రోజు గడిచిపోయే దాకా మనం ప్రతీపని ప్రపంచం తో మమేకమై చేస్తాం. ప్రపంచంతోనే కలిసి నడుస్తాం. ప్రపంచంలోనే నడుస్తూ బ్రతుకుతాం. అందుకే ఈ సమస్త ప్రపంచం మన ప్రథమ దైవం. అది దశ్యాదశ్యాల సమాహారం. జాగ్రత్తగా గమనించి చూస్తే ఈ ప్రకతి అంతా మనలో ప్రతిబింబమే అంటున్నాడు కవి. ప్రకతి ఆధీనంలో బ్రతుకుతున్న మనం ప్రకతికి ప్రతిరూ పాలమే మరి. ప్రకతిలోని ప్రతీ వస్తువు, ప్రతీ దశ్యం మనలో అంతర్భాగమై, అంతర్లీనమై ఉంది. మన చిరునవ్వులే ఈ ప్రకతిలో విరబూసే పువ్వులుగా, మన నిట్టూర్పులు ఆకాశంలోని తడిమేఘాలుగా, మన హదయమే ఆకాశంగా, మన రక్తమే ఉప్పొంగుతున్న సముద్రంగా, ఎప్పుడు చిగురించే మనలోని ఆశలే ప్రకతి నిండా పరుచుకున్న పచ్చదనంగా, మారుతున్న ఆరు రుతువుల రంగులే మన మనసుల్లోని భావోద్వేగాలకు ఆనవాళ్ళుగా కవి వినూత్నంగా భావిస్తున్నాడు.
ప్రకతిని తొలి దైవంగా, తొలి గురువుగా భావించమని చెబుతున్న వైనం ఈ పాటలో తొంగిచూస్తుంది. ఈ సష్టి చరిత్ర ఎన్నో ఏళ్ళది. ఈ అనంత సష్టిలో మనమంతా పరమాణువులం. విశాల ప్రపంచం యొక్క అనుభవం కొండంతటిది. దాని అడుగుల్లో అడుగేసి జన్మంతా నడవడమే మనం చేస్తున్న పని. చేయాల్సిన పని కూడా. దాని ముందే మన జీవితాలు ప్రారంభమవుతుంటాయి. ముగుస్తుంటాయి.
ఈ జగతి నాది అనేవాడు ఎవడు? ఇది ఎవడు సొత్తు? ఇది ఒక్కడు నాటిన పంట కాదు కదా! ఒక్కడే అనుభవించడానికి. ఎవడికి వాడే తన హక్కులను, అధికారాలను చాటుకుంటే అది కుదరని పని. ఈ సమస్త విశ్వంలో హాయిగా, స్వేచ్ఛగా విహరించే హక్కు అందరికీ ఉంది. ఉంటుంది. ఇదంతా తరతరాల వారసత్వ సంపద. మనం, మన తర్వాత తరం, అలా తరతరాలు ఈ జగత్తు సంరక్షణలో బ్రతకాలి. ఈ ప్రకతిని చెరపకుండా పదికాలాలు పచ్చగా కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తుచేస్తున్నాడిక్కడ కవి.
మనందరిని ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం. అందుకే ఈ విశ్వాన్ని మనం ఎంతో ఇష్టంగా గుండెలకు హత్తుకుందామంటున్నాడు. మంచిగా మసలుకుంటే ఈ విశ్వమే మనల్ని అమ్మలా లాలిస్తుంది. హద్దులు దాటితే, కన్నెర్ర జేస్తుంది. అపుడు సమస్త మానవజగతి శూన్యమవుతుంది అంటున్నాడు కవి.
ఇలా ప్రపంచానికి తన పదాలతో నీరాజనం పట్టాడు రామజోగయ్యశాస్త్రి.
పాట :- ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతీ సష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం
మన చిరునవ్వులే పూలు/ నిట్టూర్పులే తడి మేఘాలు/
హదయమే గగనం,రుధిరమే సంద్రం/ ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం/మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకతి మొత్తం/ మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంత/ ఎన్నో ఏళ్లదీ సష్టి చరిత
అనుభవమే దాచిందీ కొండంత/ తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా..
ఎవడికి సొంతమిదంతా/ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని/ చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కథంతా/మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక /పదికాలాలిది కాపాడాలంట
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం/ ఇష్టంగా గుండెకు/ హత్తుకుందాం
కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం/ తల్లడిల్లిందో ఈ తల్లి/ఏ ఒక్కరు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకతికి ప్రణామం
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682