Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబ్బ ఏం సలిర నాయన. ఇగం సంపక తింటాంది.. మాపటిజాం సంది పొద్దుగాల పదిగొట్టేదాంక ముడుసుకున్న శేతులు ముడుసుకున్నట్టే ఉండబట్టే.. ఈ యాళ్లల్ల ఎవుడన్న హ్యాండ్సప్ అన్న గానీ ఎవళూ పాటించరు సలి సంకలెత్తనీయటంలేదు.. పొలంల గూడు కావిలి పండటానికి భయమైతాండె కుప్ప గొట్టటానికి శేతులాడటం లేదాయె.. సలి మంటలకాడ, పొయ్యిసెగలకాడ కూకోనికూకోని రగతం మరిగిపోతండె..
చస్ ఊకో ఓదేలా సలెక్కడిది.. ఓ దిక్కు సెంటిగ్రేడ్స్ హీటైతాంటె సెల్సియస్ సలంటవ్..
గదేందివయా రాయమల్లు ఒక్కపాలే ఏమో గట్లంటివి.. ఇంతకి నువ్వు మాట్లాడేటిది సలికాలం సంగతేనా..
లేకుంటె.. ఒడిసిపోయిన వానాకాలం గుర్నాయించను కుంటన్నవా..
ఏమోనయా.. నీ మాటల్ల ఏమో మర్మముంటది.. దేనిమీదోబెట్టి ఇంకేదో జెప్తవ్.. అర్థమైనోడికర్థమైతది తగిలెటోళ్లకి తగుల్తది.. గా బూలచ్చిమి సుత గింతే కోడిమీదనో కుక్క మీదనో బెట్టి తిడ్తాంటది.. అట్ల నన్నెన్ని మాట్ల తిట్తిందో రేషానికి బోతె నీ పేరుదీశిన్న నె ఊరుదీశిన్న అని ఉల్ట లొల్లికి దిగుతది.. గామె నోట్లె నోరుబెట్టుడే తప్పైతది.. పెండలరాయేసినట్టే అయితది..
ఇదింక బాగుంది.. నా మాటల్ల మర్మం గాదు నువ్వే నన్ను మర్మంగ మాటలంటన్నవ్ లే.. సూశినావ్ పెండతోబోల్చినవ్.. బయటబడతలేవు గానీ ఓదేలా నువ్వు సిన్నోనివి గాదువయా.. ఎప్పటిసందో నామీద గుస్స ఉన్నట్టుంది నీకు..
పరాశ్కెం సాలు తియ్గానీ ఇంతకి అటాత్తుగ సలికాలం సలిగాక గరం ఎట్లైతాందో జెప్పరాదు..
ఎట్లంటవేందివయా.. సూత్తలే టీవీలు.. సదువుతలే ఆట్సాప్ల ఆర్తలు.. ఇంటలే సంగతులు.. డిల్లి నుంచి గల్లిదాక కాలం మారిపాయె.. అటు కేంద్ర సర్కారుకు ఇటు రాష్ట్రంలోని కారు సర్కారు శెమటలు దీస్తన్నది గాన్తలేవా..
ఏమైతాందివయా ఏడెట్ల బుడతాందో జెర ఇవరంగ జెప్పరాదు.. ఇంత జెప్తాన్నా ఇంక ఎట్లెంటవేందశా.. ఎనకటికెవుడొ అన్నమంత దిని మన కూరేందే అన్నడంట గట్లుంది నీకత.. అరె.. ఆళ్లకి శెమటలు బడ్తాండె, ఉక్కబోతకు గురైతాండె.. గాలాడక అల్లాడ్తాండె.. ఎక్కికూకున్న కుర్సీ గద్దెలు ఇడిసిపోతమా అన్నంత ఏడైతాంటె..
ఔ గానీ ఎప్పటిసంది పటేలా గీ యాష్టంత.. పల్లెల్ల పొలాల్ల ఉండాల్సిన రైతులు రోడ్దెక్కిన్నాటినుంచి.. తలదాసుకోనీకి జానెడు జాగ అడిగినా ఎన్ని తాపల అర్జీలు బెట్టుకున్నా దయజూపని సర్కారు.. ఇలాసవంతమైన పార్లమెంటుకు శంకుస్తాపం జేస్కున్నప్పటి సంది బీద బిక్కిల అసహనం పెరుగుతాన్నప్పటి సంది.. ఐద్రావాద్ల ఈదికొక్క శెరువు పతకం తీర్గ ఇల్లసుట్టు వరద నిలిసినప్పటి సంది ఐద్రావాదీల్లో రగులుతన్న కాక ఎక్కడొ తగులుతాంది.. గీతీర్గ్గ రాష్ట్రంల సుత ఏలెటోళ్లకు ఏడికాక తక్కువేంగాది..
అవునా ఈళ్లకెట్లైతాంది గర్మీ..
ఎట్లేమున్నది.. ఎవుళకెరుకలేనిదిబరు.. దుబ్బాకలొ దుక్కం, బల్దియాలో బలి గియ్యన్ని కాక బుట్టిస్తండటం కాక ఇంకేమైతది..
గిప్పుదు పూరాగ సమజైంది గానీ నీతాన అంగార్ డబ్బి ఉన్నదా సుట్ట ఎలిగించుకోవాలె అట్లన్నా ఏడి బుడతదేమో ఒంట్లె..
సలికి సుట్టెలిగిచ్చుడుగాదు.. ఒక పాట పాడాలె, ఒక కవిత్తం సదవాలే లేకుంటె ఇంత ఏడేడి పెసంగం జెయ్యాలే..
గట్లజేత్తే..
గట్లజేత్తన్నందున్నే సలిగిలి మా దరిదాపుల్లకి అస్తలేదని రైతుల్ జెప్తలేరా..జెరింత అప్డేట్ గా ఓదేలా ...
- కంచర్ల శ్రీనివాస్