Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుట్టు కొడలు.. స్వచ్ఛమైన నీరు.. తెల్లని దారి.. చూడగానే మనసుకు హత్తుకునే ఉండే ఈ ప్లేస్ ఎక్కడిదో గుర్తు పట్టారా... త్రీ ఇడియట్స్ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ రెస్ శారీలో స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ హీరో దగ్గరకు వస్తుంది కదా... అదే ఈ ప్లేస్.. ఇంతకీ దీని పేరేంటో తెలుసా... పాంగాంగ్ లేక్.. ఇది మన దేశానికి, టిబెట్‌కు మధ్యలో ఉంటుంది. ఈ సరస్సు దాదాపు 135 కిలోమీటర్ల మేర విస్తరించి ఉటుంది. సముద్ర మట్టానికి 14,270 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ సరస్సులో నీరు స్వచ్ఛంగా కనిపిస్తాయి. హిమాలయాలకు దగ్గరగా ఉండే ఈ సరస్సును చూడాలంటే మాత్రం కాస్త శ్రమించాల్సిందే.