Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జస్ట్ షటప్..
గిదేందిరో ఇవర్దాంక కూకున్నోనివేమో జస్ట్ నేను జస్ట్ షటప్ అనంగనే ఒక్కపాలే లేశి నిలవడితివి..
అక్కా.. నువ్వేగా. షట్ - అప్ అంటివి..
సర్లే కూకోర వారీ.. నువ్వూ నీ ఆటో పంచు..
ఇంతకి షటప్ అని ఎందుకంటివి..
ఆ.. ఎందుకా.. మా ఆయన్ని తాగుబోతు అన్నందుకు..
ఔ గదక్కా.. ఏ బార్లో జూడు మీ ఆయనే లాక్డవునప్పుడు ఏ వైన్స్ బారుల్లో జూసినా మీ ఆయనలేడా ఆంద్రబాడ్డర్ దాంకగూడ బోయెటోడు గదా....
ఊకో.. నా పెనిమిటేమి వాళ్ల సోపతి గాళ్లలెక్క హండ్రెడ్ పర్సెంట్ తాగుబోతు కాదు..
మల్ల..
ఏదో జస్ట్ నైంటీ దాగుతడు.. హండ్రెడ్ దాగినప్పుడు అందూర్లే అందరు గామాట....
ఎట్లెట్ల... ఒట్టి నైంటీ తాగుతాడా.. అంటేమల్ల. దినాంకో పాలా..
ఉహూ..
ఒహౌ.. పొద్దటి సంది పొద్దుగూకిందాంకనా..
ఏ.. అట్ల గాదు..
మల్ల
దినాంకెన్ని తాపలు దాగుతాడో లెక్కేలేదు గానీ వారీ.. తాగినప్పుడల్లా నైంటీ లెక్క తప్పడు..
అట్టనా..
అట్టనే..
ఇంతకి ఏం పనిజేస్తడమ్మ మీ ఆయినె
పని జేసుడవసరం ఆయనెకేంది.. నేను బోయస్తలేనా ఇండ్లల్ల పనులకు.. అయిన్న బెల్టు దుక్నాలకాడికిబోవుడు అచ్చుడు గిదే సరిపోతాండె ఇంగెక్కడబోతడు పనికి..
గట్లైతే గాసర్వే లెక్కలు సుత కరెక్టే తిరు..
ఏం సర్వేరా..
మొన్న గాలెక్కలు సదవలేదా..
ఏం లెక్కలు దేల్శిన్లు గా సర్వేల..
తెలంగాణల పెతి ఇద్దరిల ఒకడు తాగుబోతేనంట..
గట్లనా.. శెవ్వ.. జెనాల్ తాగుబోతులా.. గట్లైతె ఆళ్ల మీద ఆదాయం నూకే సరకారు ఒకటోడిలో ఉందా రొండోడిలో ఉందా.. అయినా బస్తీలల్ల మందు దుక్నాల్ బందుజేస్తే రాష్ట్రానికి గీ అపవాదు రాకపోనుగా.. గల్లాపైశలొకనికి శెడ్డపేరొకనికా మంచిగుందికత....
అవ్ గానీ.. బావెందుకు దాగుతన్నడక్క అంతగనం.. గీ సూద్దరపుటకెందుకు బుడితినిరా బగమంతుడా అనా..
ఏమాయే సూద్దరోళ్లకు..
ఓ అక్క నువ్వినలేదా మొన్నొకామె ఏమన్నదో..
ఏమన్నది..
సూద్దరోళ్ళు అగ్గ్యానులు పెద్ద కులపోల్లకి ఆళ్ల కులంపేరుతో బిలిస్తే కోపం రాదుగానీ సూద్దరోళ్లకి బుస్సుమనస్తదని అన్నది..
గట్లన్నదా.. ధనమంతుడ్ని కుబేరుడనటానికి పేదోడిని దరిద్రుడు అని అనటానికి శానతేడా ఉందని జెప్పుర్రి గా పెజ్ఞామంతురాలికి..
- కంచర్ల శ్రీనివాస్
9346611455