Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవ్ గానన్నా.. మొన్న నువ్ బోయిన పంచాది ముచ్చటేందే..
ఏమున్నదిరా.. గా పోరడు కాపురం జేత్తడంట గానీ ఇంట్లకి బత్తెం ఇయ్యడంట.. మంచిసెడు పట్టిచ్చుకోడంట..
బలేగుంది కత.. మార్కొట్లుంటరు గానీ మద్దతు కొనుగోళ్లుండయి అన్నట్టుంది..
సెల్లమల్లు..
ఏందివా.. ఈరమల్లు..
గీ యాపీ న్యూ ఇయర్ ఎంత పాతదంటావ్..
అంటే..
అంటే.. ఎన్నివందలేండ్లమునుపు గా పదాన్ని కనిపెట్టిండ్లంటావ్..
అవ్ మల్ల..
మల్ల అంతపాత పదాన్ని పెతేడు కొత్తగా అచ్చేటి కొత్తఏడాది తగిలిచ్చుకుంటాందేందిరా ఇష్యూ యాపీన్యూ ఇయర్ అని....
కొత్త ఏడాది గదన్నా.. దానికెరకలే పాతఏడాది ముంగట్నే వాడేసుకున్న పదమే గిదని..
సరె తిరు గానీ..కొత్త యాడాది కొత్తగా ఏదన్న సెప్పరా ఈరమల్లు..
కొత్తగా ఏముందన్నా అంత పాతదే.. ఇష్యూ యాప్పీ న్యూ ఇయరు..
సాల్ తిరు వయా నయా సాలొచ్చి గియ్యాల్టికి మూడు దినాల్ గానీ.. ఇంగ కొత్తగ ఏముందో సెప్పు..
ఏమున్నదే జెప్పనీకి అన్ని పాత ముచ్చట్లేనాయె ఒడిసిన కతలేనాయె..
అవ్ గానీ అన్నా.. ముందుగాల ముందుగాల నువ్వెవళికి జెప్పినవే యాప్పీ న్యూఇయరు గీటింగు..
నేనా.. దర్న జేస్తన్న రైతులకి జెప్పిన గీ ఏడాదన్న మంచిగుండాలె ఎవుసం అని..
దొర ఎవళికి జెప్పుంటడే..
ఎవుళకేంది డిల్లికి జెప్పుండాలె.. దొరంటె యాదికచ్చింది.. దొర మంచి డైబర్ రా..
ఎట్లంటవ్ అన్నా..
ఎట్లేందిరా.. సడెన్ గ ఎట్ల యూ టర్న్ లు తీసుకుంటండొ సూస్తన్నంగదా..
అవ్ నన్నా.. ఒకపూట అవునంటడు ఒకపూట కాదంటడు.. ఒకరోజు పంట నియంత్రణ అంటడు ఇంకో రోజు మీ ఇష్టం ఏదన్న ఏసుకోరి ఎట్తన్న జేసుకోరి అంటడు.. ఒకరోజు మద్దతు అంటడు ఇంకోరోజు లే..లే.. అంటడు.. నై..నై అంటడు అంతలనే జై జై అంటడు..
దొర యువరాజుకు జెప్పలేదంటావుర యాప్పీ న్యూఇయరు..
యువరాజు గా మాటకోసమే ఎదురు సూస్తాండే అయితదయితది యాప్పీ న్యూ ఇయరే అయితది గా మోకా గానొస్తాంది..
ఇంక ఇద్దరు గూడ కాయిష్ బడతండ్రంటగదరా..
దేనికన్నా..
యాప్పీ న్యూ ఇయర్ కోసం..
గట్లనా..
అయినగనీ ఎవుళ్లకు జెప్పడురా..
ఏమన్నా.. ఎందుకే..
ఎందుకేందివా.. రిటైర్మెంట్ ఏజ్ పెంచిండుగా దొరా..
మరిగట్లైతె.. మనమే జెబుదాం ఆయినకు.. యాప్పీ న్యూ ఇయర్
- కంచర్ల శ్రీనివాస్
9346611455