Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాంటియాగో అనే ముసలాయన 84 రోజుల పాటు రోజూ సముద్రం మీద చేపల వేటకి వెళ్ళినా ఒక్క చేపా పడలేదు. అయినా పట్టువిడవకుండా వేటకి వెళ్తూనే ఉన్నాడు. చివరికి ఎనభై ఐదవ రోజు, తన పడవంత పొడవున్న పెద్ద మార్లిన్ చేప ఇతని గాలానికి చిక్కుతుంది. దాన్ని చేజిక్కించుకోడానికి రాత్రనకా, పగలనకా సముద్రంమీద దాదాపు రెండు రోజులు కష్టపడతాడు. చివరకు ఆ చేపను చంపి పడవకు కట్టుకుని వెనక్కి బయల్దేరతాడు. కానీ, ఓ సొరచేపల గుంపు ఇతని పడవపై దండెత్తి మార్లిన్ని తినేస్తుంటాయి. ముస లాయన వాటితో వీరోచితంగా పోరాడ తాడు. చివరికతను ఓడిపోతాడా? గెలుస్తాడా? అనేదే కథ. నిరంతర పోరాటమే జీవితం.. గెలుపోట ములు కాదని చెప్పే గొప్ప తాత్విక నవల ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ. ఈ నవలని స్వాతి కుమారి, రవి వీరెల్లి తెలుగులోకి అనువదించారు. చాలా సరళంగా ఉన్న అనువాదం వదలకుండా చదివిస్తుంది. అందరూ చదవాల్సిన నవల ఇది. గ్రామీణ విద్యార్థులకు ఇది మరింత ఉపయోగం
(అతడే ఒక సముద్రం, మూలం: ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ, ఎర్నెస్ట్ హెమింగ్వే, అనువాదం: స్వాతి కుమారి, రవి వీరెల్లి, ప్రచురణ : వాకిలి, ఛాయా, ప్రతులకు: amazon.in, +91-98480 23384)
- అనిల్ బత్తుల