Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాసరచన పోటీ తాలూకూ కాగితాలు చేతిలోకి వచ్చాక ఫలితాలు చెప్పడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి యమా ఉత్సాహంగా వున్నారు గురువుగారు.
వాల్మీకి, అరిస్టాటిల్, ఎక్వినాస్, బుద్దా, వివేకానంద, కారల్ మార్క్స్ లాంటివాళ్ళు గురువుగారు ఏం చెబుతారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
గురువుగారు ముందుగా వాల్మీకి పేపర్ తీసి ''బాబూ, నీకు తాటాకుల మీద రాసిన అలవాటు వల్ల పేపర్ మీద కన్నాలు కొంచెం లోతుగా వున్నాయి. అయినా పర్లేదు! నీ ఊహలు మరీ అతిగా ఉన్నారు! బాణం పుల్లకి మరీ అంతంత శక్తులు ఆపాదించావ్! ఎంతసేపూ రాజుల గొప్పతనాలే రాశావ్, మనుషులు గురించి అస్సలు రాయలేదు. ఎప్పుడైనా సరే తొంభై శాతం మనుషుల జీవితాల గురించి వదిలేసి నలుగురి గురించి రాయడం బాగుండదు. నీ కల్పనా చాతుర్యం యే స్ధాయిలో వుందంటే, నిజంగానే బాణంపుల్లతో సముద్రం ఇంకిపోయింది అని నమ్ముతారేమో అన్నట్టుగా రాశావ్! కొంచెం కల్పనలకు కూడా ఒకింత పరిమితి ఉండాలి కదా! అన్నారు మేష్టారు.
''అరిస్టాటిల్! నీ విశ్లేషణ అమోఘం! సర్వ శాస్త్ర విషయా లపై నీ అవగాహన అద్భుతంగా ఉంది! గురువుగారిలో కనబడని వాస్తవిక కోణం నీలో ఉంది. మానవీయ కోణం వున్నా బానిసల విషయంలో నీ ఆలోచన బాలేదు. కొన్ని శాస్త్రీయ విషయాల్లో నీ అవగాహన తప్పని చెప్పడానికి కూడా ధైర్యంగా ముందుకు రానంత ఆత్మ విశ్వాసంతో ఉన్నావ్! కానీ ఆ మేరకు అది సరైంది కాదు!
ఎక్వినాస్! ముందుకు వెళుతున్న యుగచక్రాన్ని ఆపడం సాధ్యం కాదని తెలిసీ, జీవితాంతం అదే పనిలో ఉన్న నీ అభిప్రాయాలు సైతం చాలా ఘోరంగా వున్నాయి! ఒక అబద్ధం చుట్టూ ఇంత విస్తారమైన కథలు ఎలా సాధ్యమా అనిపిస్తుంది! అసలు నీకు సత్యంతో పనిలేదా?
బుద్దా, నీ ఆలోచనలు చాలా రమణీయంగా వున్నాయి! మనిషి గురించి నీ ఆలోచనలు గొప్పగా ఉన్నాయి! నీ ప్రాపంచిక దక్పథం శ్రేష్టంగా ఉంది! ముఖ్యంగా ఎవరికీ పట్టని ప్రాణికోటి పట్ల నీ దయా హదయం గొప్పగా వుంది. మానవ జాతి పట్ల నీ ప్రేమ గొప్పగా వుంది! కానీ ధ్యానం, తపస్సులు నీ ఆలోచనా ధారకి భిన్నంగా ఉన్నారు!
''వివేకానందా! నీ శైలి అమోఘం! బాగా రాశావ్! నా నరాలు బిగుసుకున్నారు, రక్తం పొంగింది నీ పేపర్ చదువుతున్నంత సేపూ నరాలు చిట్లిపోతాయేమో నన్నంత ఉద్వేగంగా రాశావ్! కొటేషన్లు బాగా ఉన్నారు! మతాలన్నీ సమానంగా బోధించాయి అన్నావ్ మొదటి పేరాలో! రెండో పేరాలో దేవుడా, పాడా అన్నావ్! మూడో పేరాలో దేశీయ మతం, దేశం, సరిహద్దులూ గొప్పవి అన్నావ్! కుక్క ఆకలితో వున్నా తట్టుకోలేను అన్నావ్ చాలా పెద్ద మనసుతో! గాంధీ కూడా అర్ధరాత్రి ఆడబిడ్డ వంటరిగా పోయే రోజు రావాలి అన్నట్టు! కానీ ధ్యానంలో కూచుంటే ఈ పనులు కావని చెప్పలేదు యెందుకు? నువ్వు బాగా రాసి ఉత్తేజం కలిగించావ్ బావుంది! నువ్వు కాషాయంలో నిండా మునిగి కూడా ఒకోసారి పరమత సహనం అన్న మాటలు బాగానే నచ్చారు. కానీ వాస్తవికత లోపించింది కదా!
మార్క్స్! నువ్వసలు కవివేమో అనుకున్నా! ఏం శైలి అది నయాగరా జలపాతంలా! సంతోషంగా ఉంది నీ దార్శనికత! మనిషి కోసం పుట్టామని చెప్పుకున్నవాళ్ళు, రాసిన వాళ్లు ఎక్కువే వున్నారు! ఎందుకో మరి నువ్వురాసింది చూశాక నువ్వు తప్ప ఎవరూ ఇంత నిబద్ధతతో రాసినట్టు నాకనిపించలేదు! ఎక్కడా తప్పు మాట లేదు! అసత్యం లేదు! నిజాయితీ లేని మాటలు లేవు! ఎక్కడిదయ్యా ఈ సాహసం నీకు? మనిషి పట్ల ఇంత ప్రేమా నీకు? మనిషి తప్ప నీకు ఏదీ అక్కర్లేదా? మనిషి కోసం ఏదైనా రాస్తావా, ఏదైనా చేస్తావా? ఎంతకైనా తెగిస్తావా? మనిషి కావ్యం రాసినట్టుంది అది! మరీ ఇంత ఆవేశమా?
ఎందుకో నీ పేపర్ చదువుతుంటే లోకం తిరగబడ్డట్టు అయిపోయింది ఒక్కసారి! ఈ ప్రపంచమంతా ఒక్కసారిగా, సరిగ్గా కనబట్టం మొదలుపెట్టింది! ఎంత నిజాయితీ ఉంది నీ మాటల్లో!! నిజం చెప్పనా?... మొదటిసారి నాకీ ప్రపంచం ఇంత అడ్డదిడ్డంగా ఎందుకుందో తెలిసింది! ఎప్పటికైనా ఇలానే ఉండి తగలడుతుంది అని నేను పెట్టుకున్న నా నమ్మకం, నా అజ్ఞానం, నా వైరాగ్యం పటాపంచలు అయిపోయాయి! నీ పేపరు చదివాక ఏదో నమ్మకం, ఏదో ఆశాభావం నాలో చిగురించింది!
మార్క్స్!! చాలా బాగా రాశావ్! మనిషి పట్ల నీ బాధ్యత మహౌన్నతమైంది! నీ భావాలన్నీ చాలా గొప్పవి... అవునూ ఒక విషయం నిన్ను అడగాలి!! మార్క్స్!! ''స్త్ర్రీ లో నీకు నచ్చేది ఏది?'' అంటే ''బలహీనత'' అన్నానని రాశావ్? తప్పనిపించలేదా నీకు? కొంపదీసి జెన్నీ చెంపమీద కొట్టలేదు గదా?...
- వి.విజయకుమార్,
8555802596