Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుద్ధం నాకు కొత్త కాదంటూ ఇంకొంచెం యుద్ధాన్ని ప్రేమించమని ఆహ్వానం పలికే అతడో నిశ్శబ్ధ దైవన్యం. కన్నీటి చుక్కను కొత్త కవిత్వం చేసి బతుకు పాటకు కొత్త చరణాన్ని పరిచయం చేస్తాడు. యుద్ధ శిబిరంలోనూ పసి నవ్వుల వానతో జ్ఞాపకాల్ని పూసే కొమ్మ అతడు.
మాటల వంతెనొకటి నిర్మించి ''సంక్రాంతి''కి ఆహ్వానం పంపుతాడు. మనిషి కథే కాదు భూమి కథా తెలిసినొడు. స్వరూపాల్ని మోసే కనురెప్పలు మూతబడేంత వరకూ అక్షిర నక్షత్రమై వెలిగిపోతాడు.
ముసురువాన వెలిసి పోయిందని శాంతి గీతం ఆలపిస్తూ చిరునవ్వు 'దేశాలు' వెలిసే... ఒక రోజొస్తుందని ఆశగా ఎదురుచూసీ కవిత్వ సముద్రాల్ని దాచుకున్న నగరం ''సాంబమూర్తి లండ''.
అతడి కవితా సంపుటి ''గాజు రెక్కల తూనీగ''లో కవిత్వమంతా కష్టజీవుల వేదనలు, కష్టాలు, కన్నీళ్ళే. అందుకే అతడు ''యుద్ధం నాకు కొత్తకాద''ంటాడు. ఇంకొంచెం యుద్ధాన్ని ప్రేమించమంటాడు. కన్నీటి చుక్కను కవిత్వం చేసే బతుకు పాటకు కొత్త చరణాలని పరిచయం చేస్తాడు.
''సౌఖ్యాలూ సౌకర్యాలూ / విరగకాసిన మహా నగరంలో అంతెత్తుగ నిలబడి / ఆకాశ హార్మ్యాల నీడల మధ్య / జీవితం మాత్రం / ఎప్పటికీ గాజు రెక్కల తూనీగే!''
''యుద్ధం నాకు కొత్త కాదు!'' కవితలో
నాకప్పుడొక మహాత్ముడిని కనాలని లేదు / ఒక చేగువేరానో / ఒక రుద్రమనో కనాలనుంది / నా యుద్ధ విద్యలన్నీ రేపటి పొద్దుకు అద్దాలనుంది!
ముసురు కవితలో
''అమ్మ కనబడక పసిపాప / గుక్క పట్టి ఏడ్చినట్టు / అప్పగింతలప్పుడు / కన్నీరు ఆపుకోలేనట్టు / ఎడతెరిపి లేకుండా / కురుస్తోంది వాన!''
(గాజు రెక్కల తూనీగ (కవిత్వం), రచయిత : సాంబమూర్తి లరడ, పేజీలు : 136, వెల : రూ.120/-, ప్రతులకు : సాంబమూర్తి లరడ, 1-557, ఇందిరా స్ట్రీట్, వంకులూరు, శ్రీకాకుళం జిల్లా - 532219. సెల్ : 9642732008)
- అనంతోజు మోహనకృష్ణ