Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతనొక పట్టు వదలని విక్రమార్కుడు, స్వాతంత్య్రము కోసం కుటుంబాన్ని వదిలిన త్యాగ శీలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉదయించే భాస్కరుడు. అతనే అడ్లూరి అయోధ్య రామయ్య.
స్వాతంత్య్రోద్యమం ఉధతంగా సాగుతున్న సమయంలో అడ్లూరి జయరామయ్య, నర్సుబాయమ్మ దంపతులకు అడ్లూరి అయోధ్య రామయ్య 1922 సంవత్సరంలో జన్మించాడు. అయోధ్య రామయ్య పుట్టి, పెరిగిన సొంత ఊరు పేరు ఇల్లంద. ఈ గ్రామం అప్పటి ఖమ్మం జిల్లాలోని వర్ధన్నపేట తాలూకాలో ఉండేది. ఇల్లంద గ్రామం వర్ధన్నపేటకు 4 కి. మీ. ల దూరంలో ఉంటుంది. ఈయన హన్మకొండలో ఖీ.A చదువుతున్న సమయంలోనే హైదరాబాదులో నిజాం వ్యతిరేక ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఒకపక్క చదువుకుంటూనే నిరంతరం స్వాతంత్య్రం గురించే ఆలోచించేవాడు. ఇట్లా ప్రతిక్షణం స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తూ కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన చదువుకు కూడా దూరమయ్యాడు. స్వాతంత్య్రోద్యమ కాలంలో తనపై మహాత్మా గాంధీ ప్రభావం ఉండడంతో తెలుపు దుస్తులు, లాల్చీ, పైజామాను ధరించడం ఇష్టంగా మార్చుకున్నాడు. స్వాతంత్య్రో ద్యమానికి తన వంతు సహకారం అందించడానికి ఖద్దరు దుస్తులను ధరించడం అభిష్టంగా మార్చుకున్నాడు. అయోధ్య రామకవి, హాయగ్రీవా చారి, కాళోజి నారాయణరావులు నాటికి చిన్న పిల్లలయినప్పటికి 1930లో జరిగిన ఉప్పు సత్యా గ్రహంలో పాల్గొన్నారు. గాంధీ గారి నాయకత్వాన్ని ఆమోదించారు. ఉద్యమం ఎక్కడ ఉంటే అక్కడికి తమవంతు సహకారం కోసం వెళ్లారు.జాతీయోద్యమ కాలంలో విజయవాడలో కాంగ్రెసు సమావేశం ఉంటే దానికి హాజరవ్వాలనే దఢ నిశ్చయంతో సగం దూరం రైలులో వెళ్లగా, ఏదో కారణం చేత మధ్యలోనే రైలు ఆగిపోతే అక్కడి నుండి మిగతా దూరం గమ్యానికి నడుచుకుంటూ వెళ్లారు.
1947 లో భారతదేశం స్వరాజ్యాన్ని సాధించాక ''తాత మా గాంధీకి దండాలు నేతను బ్రతికించు నూరేళ్లు'' అనే గేయం రాశాడు. ఇలా కవిత్వం, గేయాలు రాయడంతో తనను తానే కవిగా భావించుకున్నాడు. స్వాతంత్య్రం రాగానే స్వాతంత్య్ర సంబరాలలో పాల్గొనడానికి తోటి దేశభక్తులతో త్రివర్ణ పతా కాన్ని పట్టుకొని ఢిల్లీ వెళ్లాడు. అక్కడ సంబరాలు అయిపోయాక టికెట్టు లేకుండానే రైలులో హైదరాబాదుకు తిరుగు ప్రయాణమయ్యాడు. అడ్లూరి అయోధ్య రామకవి అటు బ్రిటిషు వారికి, ఇటు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందున నాటి ప్రభుత్వం దష్టికి రామకవి గురించిన సమాచారం వెళ్ళింది. పైగా భారీగా ఉద్యమ గీతాలు రాసి ప్రజలను ప్రభుత్వానికి వ్యతి రేకంగా పోరాటం చేసేందుకు వారిలో జాతీయభావాలు పుట్టిస్తున్నా డని భావించి అందుకు అడ్లూరిని ప్రభుత్వ వ్యతిరేకిగా గుర్తించారు. దాంతో రామకవి నిజాం రాష్ట్రంలో కనిపిస్తే కాల్చేయ మని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదేశాలు అందుకున్న వెంటనే నిజాం పోలీసులు రామ కవిని గాలించడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తనను పట్టుకోమని ఆదేశాలు జారీ చేసిన విషయం రామకవికి కూడా తెలిసింది.
అడ్లూరి జాతీయోద్యమ కథా వస్తువుతో 'తెలంగాణ మంటల్లో' అనే కథా సంపుటిలో తల్లి ప్రేమ, బాంబుల భయం, కాలాన్ని తేవాలి, చీకటి రాజ్యం , జనానా రజాకార్, అమరలోక యాత్రికులు అనే కథల్ని రాశాడు. మరో కథా సంపుటి అయిన 'కథావాటిక' తో పాటు కవిత్వం, నాటకాలు, శతకాలు రాశాడు. నైజాం ప్రజా విజయం (బుర్రకథ), ఆంధ్రకేసరి, ఘంటారావం, దీపావళి, రుద్రమదేవి (నాటిక), స్వాతంత్య్ర గీతాలు, అన్నపూర్ణే శ్వర శతకం, సీతారామ శతకం, సంస్కరణలు (బుర్రకథ) అనే రచనలు చేశాడు. హైదరాబాద్ నుండి భాగ్యనగర్ పత్రికను నడిపాడు. అలాగే ప్రజలలో చైతన్యాన్ని లేవనెత్త డానికి గేయాలు రాశాడు. కాంగ్రెస్ వాదిగా ఉంటూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న రామకవి 1958 సం.లో కాలధర్మం చెందాడు.
- తాలజి