Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్క క్షణం...
బ్రతుక్కి చావుకి నడుమ
ఆగి ఆలోచించ గలిగితే
నూరేళ్ళ జీవితాన్ని నిలుపుకోగలం
జీవితం మనిషికి మాత్రమే
దొరికిన అపురూప వరం
ఆవేశంలో, అనాలోచితంగా
బాధల గుప్పిట నలిగిపోతూ
నిండు జీవితాన్ని అర్ధాంతరంగా
ముగించాలనుకోవటం అవివేకం
కరువు కోరలకు చిక్కి
పండిన పంటకు పెట్టుబడే రాక
దళారీ దగాకు తల్లడిల్లి
విలువైన బ్రతుకును
బలి తీసుకుంటున్న రైతన్నలు
క్షణికావేశంలో అనాలోచితంగా
అల్ప సమస్యలకు ఆయువు వదిలే
అమాయకులు మరచిపోరానిది
సష్టిలో మానవజన్మ మనకు మాత్రమే
దొరికిన గొప్పఅవకాశమని
చిరు అపజయాలకే కంగిపోయి
నిన్ను నీవే వంచించుకునిఎందరికో
గుండెకోతను మిగులుస్తున్నావో ?
విజయాలన్నీ అపజయాల పునాదుల
మీదనే రెప రెపలాడతాయి
శోకాన మరుగున దాగి
అనంత మైన సుఖమున్నట్టే
ధీరులై సాధించటమే సార్థకత
జీవితం అందరికీ
వడ్డించిన విస్తరికాదు
అవకాశాలను వెతుక్కుంటూ
సాగితేనే చేరువవుతాయి
పోరాడితేనే విజయాన్ని సాధిస్తాం
రాంక్ ల పంటను ఎరవేసి
కోట్లు పండించే కార్పొరేట్ బడుల్లో
జీవన నైపుణ్యాలను
బ్రతుకు విలువలను నేర్పరు
తాము సాధించని
విజయాల కోసం
అధిరోహించని శిఖరాలకు
చేర్చాలనే అత్యాశతో
పిల్లల్ని బలిపశువుల్ని చేస్తున్న
అజ్ఞాన అమ్మా నాన్నలు ఎన్నడైనా
ఆ అమాయకపు గుండె వత్తిడిని
పసికట్టి ప్రేమగా అక్కున
చేర్చుకొని చల్లార్చకుంటే
అన్యాయంగా వారిని
చేతులారామనమేపోగొట్టుకుంటాం
వత్తిడితో దిక్కుతోచని
అభాగ్యులకు ఓదార్పును
స్నేహ హస్తాన్ని అందించి
వారి మనో వ్యధను పంచుకుని
జీవితమంటే ఆశను మళ్లీ
వారిలో చిగురింప చేద్దాం
పిల్లల్ని మన తీరని కోర్కెలకోసం
సమిధలుగా మార్చక సహజంగా
వారినిపువ్వులుగా వికసించనిద్దాం
మనిషిగా మానవత్వపు
పరిమళాలను పులుముదాం
(ఆత్మ హత్యలతో అన్యాయంగా
బలై పోయిన వారిని తలచుకుని)
సెప్టెంబర్ 10 అంతర్జాతీయ
ఆత్మ హత్యల నివారణ దినం
- డా. కె. దివాకరాచారి
9391018972