Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షర అస్త్రాన్ని ఒకచేత, హలాయుధాన్ని మరోచేత పట్టి తన 'అమతధార'తో నిజాంను వణికించేలా ప్రజలకు చైతన్య వ్మాయాన్ని వడ్డించిన వ్యవసాయదారుడు, తెలుగు భాషకు, బానిస ఘోషకు, అస్వతంత్ర శ్వాసకు కలం పట్టిన అక్షర సంగ్రామ వీరుడు, నిత్యం చలించి స్పందించిన ధన్యుడు ధవళా శ్రీనివాసరావు. ఇతను పద్య కవి, వచన కవి, మహౌన్నత దేశభక్తుడు, మనసును కదిలించేట్టు రాసే గేయకుడు, రాసిన దాన్ని వినసొంపుగా వినిపించే గాయకుడు, జాతీయ భావాలు గల వ్యక్తి, నటుడు, పాటల రచయిత, స్వాతంత్య్ర సమరవీరుడు.
ధవళా శ్రీనివాసరావు 1918 సం.లో నల్గొండ జిల్లాలోని చండూరుకు సమీపంలో గల 'కస్తాల' అనే గ్రామంలో జన్మించాడు. ఇతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీమతి కీసర లక్ష్మీనరసమ్మ, శ్రీ కీసర నరసింహరావు గారలు.. అయితే శ్రీనివాసరావు తన పన్నెండవ ఏటా ధవళా కిషన్‌రావు, మహాలక్ష్మమ్మ గారి కుటుంబంలోకి దత్త కుమారునిగా వెళ్లడం వల్ల కీసర శ్రీనివాసరావు నుండి ధవళా శ్రీనివాసరావుగా మారాడు. దత్తకుమారునిగా వెళ్లి కోటయ్యగూడెంలో నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఇతను దేవరకొండ, నల్గొండలలో తన ప్రాథమిక విద్యను గడించాడు. ఆ తర్వాత తొమ్మిదో తరగతి వరకే చదివినా, అనారోగ్య సమస్యల కారణంగా విద్యాభ్యాసం ఆగిపోయింది. తన పెంపుడు తల్లి మహాలక్ష్మమ్మ ప్రోత్సాహంతో రామాయణం, భారతం వంటి ఇతిహాసాలను అధ్యయనం చేసి చక్కని సంస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. వత్తి వ్యవసాయం. ఈయన ఆంధ్ర సారస్వత పరిషత్తు, 'సాహితీ మేఖల'లో సభ్యుడిగా సారస్వత సేవ చేశాడు.. విశిష్ట ఆధ్యాత్మిక వాది. సాహితీ మేఖల అనే సాహిత్య సంస్థను స్థాపించిన ప్రసిద్ధ సాహితీవేత్త అయిన అంబటిపూడి వెంకట రత్నం గారి శిష్యుడు. ఇతను పెద్దయ్యాక కస్తాల గ్రామానికి అధికారిగా ఉంటూనే నిజాం సాగిస్తున్న క్రూరమైన పాలనను చూసి సహించలేక, ప్రశ్నించకుండా ఉండలేక నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. నాటి కాలానికి ఈ చర్య ఒక గొప్ప సాహసం. కానీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లారా చూస్తూ ఆగలేక దేశభక్తితో ఊగిపోయి గ్రామాధికారినన్న విషయాన్ని మరిచి ప్రభుత్వ ఆగడాలను విరిచాడు. నిజాం సంస్థానంలో జరిగిన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. 1946లో తెలంగాణలో ఉద్భవించిన నిజాం సైనికుల దాడుల నుండి ప్రాణాలు కాపాడుకోవడం కోసం కుటుంబంతో తరలి గుంటూరు ప్రాంతాన్ని చేరుకున్నాడు. కానీ అక్కడ గుంటూరు ప్రాంతం వారి నిరాదరణకు గురయ్యారు.
శ్రీనివాసరావు 'ధవళ శ్రీ' అని తన ఇంటి పేరనే కావ్యాన్ని రచించాడు. ఇది 28 ఖండికల సమూహం. ఇతని గురువు అంబటిపూడి వెంకటరత్నం రాసిన 'దక్షిణ' అనే నాటకంలో శ్రీనివాసరావు 'ఉదంకుని' పాత్రను ధరించాడు. హైదరాబాద్ సంస్థానంలో తెలుగు భాషకు, సంస్కతికి, తెలుగు వారికి నిజాం చేస్తున్న అన్యాయాలను చూస్తూ సహించలేని కవి సంహాలైన కాళోజికి, దాశరథికి శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు. ధవళా, తన కలం చేత నిజాం ప్రభుత్వాన్ని నిరసిస్తూ పద్యాన్ని రాసి గర్జించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన ఉంటూ సమాజంలోని అసమానతల గురించి, తాడిత, పీడిత ప్రజలను చేస్తున్న దోపిడీకి కారణమైన నిజాం నవాబును, తన ప్రధానమంత్రి అయిన మీర్ లాయఖలీని ప్రశ్నించాడు. నైజాం సంస్థానంలో జరుగుతున్న హింసాత్మక చర్యల గురించి, నవాబు పాల్పడుతున్న క్రూర విధానాల గురించి షాయబుల్లాఖాన్ ప్రజలకు పత్రికా ద్వారా నిస్సం దేహంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా తెలుపుతున్నాడన్న ఆగ్రహంతో నడిరోడ్డుపై చేతులు నరికేసి హత్యకు గురిచేశారు. అటువంటి షాయబుల్లాఖాన్ హత్యకు సానుభూతిగా వాక్యా లను రాసి ప్రజలను జాగతం చేశాడు. హైదరాబాద్, భారత దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులలో ఉద్యమానికి సానుభూతిగా స్వాతంత్య్ర కాంక్షను తెలుపుతూ ప్రకతిలో జరిగే మార్పులను స్వాతంత్య్రోద్యమం వలన లభించే ఫలితాలతో పోల్చి విజయదశమి పేర ఖండిక రాశాడు. ఆనాడు జాతీయోద్యమ ప్రభావంతో రచనలు చేసిన ప్రముఖులలో శ్రీనివాసరావు ఒకరు. సాహిత్య క్షేత్రంలో, వ్యవసాయ సేద్యంలో తిక్కన వారసత్వాన్ని కొనసాగించిన అభ్యుదయ కవితావాది ఇతను.
దేవులపల్లి రామానుజ రావు, గడియారం రామకష్ణ శర్మ, మాడపాటి హనుమంతరావు, అడ్లూరి అయోధ్యరామకవి, కాళోజీ నారాయణ రావు వంటి వారితో సత్సంబంధాలను నెలకొల్పాడు. తన కంటే ముందు సాహిత్యంలో, ఉద్యమ సాంగత్యంలో ఉన్న పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడింది. వద్ధుడి వయసుకు రాగానే పిచ్చికుక్క కాటుకు గురై భరించలేని బాధను అనుభవించాడు. అయినా చరమ దశ వరకు నిరంతరం భగవద్గీతనే అధ్యయనం చేస్తూ తన బావి దగ్గర ఉన్న ఇంట్లోనే 7.5.1980 లో కన్నుమూశాడు.
- ఘనపురం సుదర్శన్