Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1946లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నిరూపరారు 'రనక్దేవి'అనే గుజరాతీ సినిమాలో నటిగా తన సినీ ప్రస్థానాన్ని ఆరంభించింది. అదే సంవత్సరం ఆమె 'అమర్ రాజ్' హిందీ చిత్రంలో నటించింది. ఇది నిరూపకు మొదటి హిందీ చిత్రం. 1948 లో వచ్చిన 'గన్సుందరి' సినిమాలో తన భర్తను గెలిపించిన గహిణిగా నిరూపరారు నటన తన కెరీర్ ప్రారంభంలో స్టార్‌గా నిలబెట్టింది.
''క్వీన్ ఆఫ్ మిజరీ'', ''బాలీవుడ్ ఐకానిక్ మదర్'' అని పిలవబడే నిరూప రారు 1946 నుంచి 1999 వరకు బాలీవుడ్లో 250కి పైగా చిత్రాలలో నటించారు. విషాదవంతమైన పాత్రలలో, కరుణ రసం ఒలికించే పాత్రలలో ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తల్లి పాత్రలు పోషించడం ద్వారా ప్రసిద్ధి చెందిన నిరూప రారు 'దీవార్', 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'ఖూన్ పసినా' వంటి అనేక చిత్రాలలో అమితాబ్ బచ్చన్‌కు తల్లిగా నటించి ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్లో ఐదు దశాబ్దాలు సినీ పరిశ్రమలో వెలుగొందిన నిరూప రారు మూడుసార్లు 'ఉత్తమ సహాయనటి'గా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలని, 1986లో ఫిల్మ్‌ఫేర్ 'జీవన సాఫల్య అవార్డు' ని అందుకున్నారు.
కోకిల కిశోర్‌చంద్ర బాలసారా (నిరూప రారు) జనవరి 4, 1931 న గుజరాతీలోని వల్సాద్‌లో గుజరాతీ మాట్లాడే బల్సారా కుటుంబంలో జన్మించారు. కోకిల 15 సంవత్సరాల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగి కమల్ రారుని వివాహం చేసుకున్నారు. తర్వాత భార్యా భర్తలిద్దరూ 1946లో వెండితెరపై తమ అదష్టాన్ని పరిరక్షించు కోవాలని నిర్ణయించుకుని బొంబాయికి వెళ్లారు. అదే సమయంలో గుజరాతీ నుంచి వెలువడే ఒక పత్రికలో నటీనటులు కావాలి అన్న ప్రకటన చూసి, ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు, అయితే కోకిల మాత్రమే గుజరాతీ సినిమాలో నటించడానికి ఎంపికయ్యారు. గుజరాతీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత, ఆమె తన 'కోకిల కిశోర్‌చంద్ర బాలసారా' అన్న పేరుని 'నిరూప రారు'గా మార్చుకున్నారు. నిరూపా రారు, కమల్ రారు దంపతులకు యోగేష్ రారు, కిరణ్ రారు అనే ఇద్దరు పిల్లలున్నారు.
చిత్ర పరిశ్రమలోకి
1946లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నిరూప రారు 'రనక్దేవి' అనే గుజరాతీ సినిమాలో నటిగా తన సినీ ప్రస్థానాన్ని ఆరంభించింది. అదే సంవత్సరం ఆమె 'అమర్ రాజ్' హిందీ చిత్రంలో నటించింది. ఇది నిరూపకు మొదటి హిందీ చిత్రం. 1948లో వచ్చిన 'గన్సుందరి' సినిమాలో తన భర్తను గెలిపించిన గహిణిగా నిరూప రారు నటన తన కెరీర్ ప్రారంభంలో స్టార్‌గా నిలబెట్టింది. కాగా, నిరూప రారు 1940, 50ల మద్య ఎక్కువగా పౌరాణిక, దేవతల పాత్రలను పోషిం చింది. 1950లో జయంత్ దేశారు రూపొందించిన 'హర హర మహాదేవ్' సినిమాలో త్రిలోక్ కపూర్ శివునిగా, నిరూప పార్వతిగా వేసిన పాత్రలు విశేష ప్రాచుర్యం పొందాయి. అప్పటి నుంచి నిరూపరారుని నిజమైన దేవతగా భావించారు. దీంతో ప్రజలు ఆమె ఇంటికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందడం ప్రారంభించారు, తర్వాత నిరూప సీతా, లక్ష్మి వంటి అనేక హిందూ దేవతల పాత్రలతో పాటు, మీరా బాయి వంటి చారిత్రక వ్యక్తుల పాత్రలను పోషించారు. ఇదే సమయంలో ఆమె నటించిన 'దేవత' చిత్రం ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. 1953లో ప్రముఖ దర్శకుడు బిమల్ రారు రూపొందించిన 'దో బిగా జమిన్' ఆమె ప్రసిద్ధ చిత్రాలలో ఒకటి కాగా, అనంతరం తంగేవాలి, గరం కోట్ వంటి పాపులర్ సినిమాలలో నటించింది. 1958లో 'సామ్రాట్ చంద్రగుప్త', 1959లో 'రాణి రూపమతి' చిత్రాలలో సహా నటుడు భరత్ భూషణ్‌తో కలిసి నటించారు. నిరూప రారు త్రిలోక్ కపూర్‌తో పద్దెనిమిది సినిమాల్లో నటించారు. భరత్ భూషణ్, బలరాజ్ సాహ్ని, పైడి జైరాజ్, అశోక్ కుమార్‌లతో కూడా పలు విజయవంతమైన సినిమాలలో నటించారు. 1967లో దిలీప్ కుమార్‌తో కలసి 'డబుల్ రోల్' లో నటించిన 'రామ్ ఔర్ శ్యామ్' సినిమా బాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో ఒకటి. దిలీప్ కుమార్ ఆ సమయంలో పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఉద్ధార్, రామ్ జన్మ, చక్రధారి, దుర్గా పూజ, గరమ్ కోట్, మునీమ్ జీ, మోహినీ, ముసాఫిర్, చాల్బాజ్, దుల్హన్, ఆంచల్, కౌన్ అప్నా కౌన్ పరాయా, షెహనాయి, షహీద్, రామ్ ఔర్ శ్యామ్, ప్యార్ కా మౌసమ్, ఘర్ ఘర్ కీ కహానీ, జవానీ దివానీ, దీవార్, సుహాగ్, బేతాబ్, సర్ఫరోష్, గిరఫ్తార్, అంగారే, గంగా జమునా సరస్వతి, జహాఉ తుమ్ లే ఛలో తదితర చిత్రాలు నిరూప రారుకి విశేష గుర్తింపుని తీసుకు వచ్చాయి.
బాలీవుడ్ మదర్ గా..
నిరూప రారు కెరీర్ పురోగ మిస్తున్నప్పుడు 1955లో దేవ్ ఆనంద్ కంటే ఎనిమిది సంవత్సరాలు చిన్నది అయినప్పటికీ, తొలిసారి దేవ్ ఆనంద్‌కు తల్లిగా 'మునిమ్జీ' చిత్రంలో నటించింది. అనంతరం 1980 తర్వాత ఆమె అనేక వాణిజ్య చిత్రాలలో తల్లి పాత్రలలో నటించి మెప్పించింది. 'దీవార్', 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'ఖూన్ పసినా', 'మర్ధ్' చిత్రాలలో అమితాబ్ కు తల్లిగా నటించింది. అమితాబ్ బచ్చన్ యాంటీ హీరోగా నటించిన 'దీవార్' సినిమాలో ఆమె పాత్ర కలకాలం గుర్తుండిపోయే పాత్ర అని చెప్పవచ్చు. ఈ సినిమాలో క్రిమినల్ అయిన ఆమె పెద్ద కొడుకు విజరు(అమితాబ్), పోలీసు అధికారి అయిన అతని తమ్ముడు రవి (శశి కపూర్) మధ్య నలిగిపోయిన తల్లిగా ఆమె మెలోడ్రామాటిక్ నటన చిరస్మరణీయ మైనది. నిరూప రారుకు కొన్నాళ్ళ తర్వాత అవకాశాలు సన్నగిల్లిన 1999లో 'లాల్ బాద్ షా' చిత్రంలో అమితాబ్ బచ్చన్‌కు తిరిగి తల్లిగా నటించే అవకాశం వచ్చింది. బచ్చన్‌తో ఆమెకున్న అనుబంధం అలాంటిది. నిరూప రారు 'ధర్మేంద్ర' అతని కుమారుడు 'సన్నీ డియోల్'లకు తల్లి పాత్రలో నటించారు. తండ్రి కొడుకులకు తల్లిగా పాత్ర వేసిన ఏకైక నటీమణి నిరూప రారు. షోలే వంటి సినిమాలకు సంబంధించిన ఆమె డైలాగ్‌లు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. నిరూప నటనతో పాటుగా, ఆమె పోషించిన ప్రదాన పాత్రలు, విజయవంతమైన హిందీ చిత్రాలు స్థిరస్థాయిగా నిలిచిపోయాయి.
జైరాజ్‌తో విజయవంతమైన సినిమాలు
తెలంగాణకు చెందిన బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్‌తో కలసి నిరూప రారు పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. 'అమర్ సింగ్ రాథోడ్', 'రజియా సుల్తానా', 'చంద్రశేఖర్ ఆజాద్', 'వీర్ దుర్గాదాస్', 'లాల్ ఖిల్లా', 'జై చిత్తోడ్', 'రాజ్ రతన్', 'సూపర్ మెన్', 'గరీబీ' చిత్రాలతో పాటు అనేక సినిమాలలో జై రాజ్ సరసన హీరోయిన్ గా నటించింది. జైరాజ్‌తో నటించిన సినిమాలు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. 1958లో వచ్చిన 'నాగ్ చంపా' చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు.
ఫిలింఫేర్ అవార్డులు
మూడు చిత్రాల్లో సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు పొందిన తొలినటి నిరూప రారు. 1956 లో 'మునిమ్ జీ', 1962 లో 'చాయా', 1965లో 'షెహనాయి' చిత్రాలలోని నటనకు గాను 'ఉత్తమ సహాయనటి'గా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలని అందుకున్నారు. 1986లో ఫిల్మ్‌ఫేర్ 'జీవన సాఫల్య అవార్డు'ని సైతం అందుకున్నారు.
నిజ జీవితంలో బాధలు
బాలీవుడ్లో ఎమోషనల్, విషాదభరిత తల్లిగా నటించిన నిరూప రారు నిజ జీవితంలో సైతం చాలా బాధలను అనుభవించింది. తెరపైనే కాదు నిజజీవితంలోనూ ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె తన ఇద్దరు కొడుకుల ప్రేమని అందుకోలేదు. నిరూపపై ఆమె కొడుకులు, కోడళ్ళు చేసిన వేదింపులు, బాధలు తెరమీద కన్న చాలా లోతైనవి. చివరలో తన కొడుకులు, కోడళ్ళ ఆరోపణలు ఆమెని వేదనకు గురిచేశాయి. సుదీర్ఘ, విజయవంతమైన చలనచిత్ర జీవితం తరువాత, ఈ వేదనలతో క్రుంగిపోయిన నిరూప రారు 2004, అక్టోబర్ 13న తన 73వ యేట గుండెపోటుతో ముంబైలో మరణించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకే భర్త కమల్ రారు మరణించడంతో ఆస్తి విషయమై ఆమె కుమారులిద్దరి మధ్య వివాదం తలెత్తగా, ఈ విషయం వార్తా పత్రికలకెక్కింది.
(అక్టోబర్ 13 న నిరూప రారు వర్దంతి సందర్భంగా)
- పొన్నం రవిచంద్ర, 9440077499
సీనియర్ జర్నలిస్టు, సినీ విమర్శకులు