Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూసీ నది ఒడ్డున నాటి ప్రజలకు ఒక పక్క వైద్యం (ఉస్మానియా దావకాన), ఒకపక్క న్యాయవ్యవస్థ (హై కోర్ట్) మరోపక్క విద్య కొరకు (సిటీ కళాశాల) పురానాపూల్ నయాపుల్ మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏడవ నిజాంమీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో మూసీనది పక్కనే ఉన్న 16 ఎకరాల స్థలంలో ఇండో సార్సెనిక్ పద్ధతుల్లో 16 ఎకరాల స్థలంలో, 64 గదులను 32 లక్షల రూపాయలు వెచ్చించి కళాశాల నిర్మాణం చేపట్టడం జరిగింది. పాఠశాలగా, జూనియర్ కళాశాలగా, డిగ్రీ కళాశాల రూపాంతరం చెందింది.
హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు ఉన్నత విద్యను చదువుకోవాలంటే విదేశాలకు వెళ్ళవలసిన రోజులలో, విద్య ఉన్నతలకే కాకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందించాలనే తపనతో ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ హైదరాబాద్ పట్టణ కేంద్రంలో 1865 ప్రాంతంలో మదరసా-దారుల్- ఉలూమ్ అనే పాఠశాలని స్థాపించడం. తొలుత ఈ పాఠశాలలు నాడు రాజ భాషగా ఉన్న ఉర్దూను భాషలో విద్యాభ్యాసం నడిచింది.
మూసీ నది ఒడ్డున నాటి ప్రజలకు ఒక పక్క వైద్యం (ఉస్మానియా దావకాన), ఒకపక్క న్యాయవ్యవస్థ (హై కోర్ట్) మరోపక్క విద్య కొరకు (సిటీ కళాశాల) పురానాపూల్ నయాపుల్ మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో మూసీనది పక్కనే ఉన్న 16 ఎకరాల స్థలంలో ఇండో సార్సెనిక్ పద్ధతుల్లో 16 ఎకరాల స్థలంలో, 64 గదులను 32 లక్షల రూపాయలు వెచ్చించి కళాశాల నిర్మాణం చేపట్టడం జరిగింది.
పాఠశాలగా, జూనియర్ కళాశాలగా, డిగ్రీ కళాశాల రూపాంతరం చెందింది. 1929 సంవత్సరంలో సిటీ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల మారడం జరిగింది. 1962 లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్‌ను ఏర్పాటు చేసి దాన్ని సైన్స్ కళాశాలగా, 1967లో బీఏ బీకాం కోర్సును స్టార్ట్ చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తర్వాత ప్రస్తుతం పీజీ విభాగంలో ఫిజికల్ సైన్స్, టూరిజం మేనేజ్మెంట్, ఇంగ్లీష్, బయోటెక్నాలజీ, కామర్స్ విభాగాలను 500 పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
సరిగ్గా వంద సంవత్సరాల క్రితం 30 మంది విద్యార్థులతో ప్రారంభించబడి దాదాపు 5000 మంది అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తు రాష్ట్రంలోనే అగ్రగామిగా విద్యాసంస్థగా వెలుగొందుతుంది.
ఈ కళాశాల తరగతి గదులలో మగ్దూం మొహియుద్దీన్ చైతన్య స్ఫూర్తి తెర ముందు కదలాడుతుంది, కవి యాకుబు కవిత్వం, ఎస్వీ సాహిత్యం ఏ గోడ నడిగిన, ఎ మెట్లని అడిగిన విద్యార్థుల్ని సాహిత్యలోకంలో విహరింప చేస్తాయి.
వివేకానందుడు సందర్శించిన ఆధ్యాత్మిక నేల, నిజాం రాష్ట్రంలో, స్వాతంత్రోద్యమ అనంతరం రాష్ట్రంలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ పోరాటాలకు కేంద్రస్థానమీ చైతన్య శిఖరం. ప్రశ్నించే తత్వాన్ని, చైతన్య శీలతను, పోరాటపటిమను సబ్బండ వర్గాలకు అందించిన జ్ఞాన సంద్రమీది.
విలియం బట్లర్ యేట్స్ చెప్పినట్టు “Education is not filling a pail but the lighting of a fire” తొలి తెలంగాణ ఉద్యమ పోరాటానికి నాంది పలికి ఈ పోరాటంలో అసువులు బాసిన విద్యార్థుల త్యాగాలద్వనులు, పోరాట పటిమ ఇప్పటికీ ఈ కళాశాల ఉద్యమ స్ఫూర్తి స్పురింపచేస్తుంది.
“Maulana Abul Kalam Azad” చెప్పినట్టు “Education imported by heart can bring revolution in the society” ఒక నాడు సామాజిక పాఠాలు, రాజకీయం పాఠాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌సార్ యొక్క మృతులు ఇప్పటికీ ఈ కళాశాలలో దర్శనమిస్తుంటాయి.
దాదాపు యాభై పైచిలుకు కోర్సులతో అత్యుత్తమైన సేవలు దేశవ్యాప్తంగా అందిస్తున్నది. బహుశా దేశంలోనే ఇలాంటి కళాశాల అరుదు.
ఆడిటోరియం (అజమ్ హాల్)
ఎన్నో పుస్తక పరిచయ కార్యక్రమాలకు, సాహితీ ఘోష్టీలకు, సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలపై అర్థవంతమైన చర్చలకు కేంద్ర స్థానం. ఈ కళాశాలను చక్కటి ఆడిటోరియం దాదాపు 500 మంది ఒకేసారి విద్యార్థులు కూర్చుని వీక్షించేందుకు అవకాశం కలదు.
ఆటస్థలం
విజ్ఞాన ఉల్లాసంతో పాటు శారీరక వికాసం కొరకు ఈ కళాశాలలో చక్కని క్రికెట్ మైదానం, ఫుట్‌బాల్ మైదానం ఇండోర్ స్టేడియం, వ్యాయామశాల వసతులు కలవు.
గ్రంథాలయం
ఎస్ ఆర్ రాధాకష్ణన్ చెప్పినట్టు “Books are the means by which we build bridges between cultures” ఈ కళాశాలలో చదువుతోపాటు అద్భుతమైన మానసికోల్లాసం, విజ్ఞానం అందించే చక్కటి గ్రంధాలయం కలదు. ఈ కళాశాలలో దాదాపు లక్ష పైచిలుకు ప్రాచీన తెలుగు సాహిత్యం, ఉర్దూ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యంపై పుస్తకాలు కలవు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా ఆఫ్ అమెరికా నా, ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ సైన్సెస్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇలాంటి చాలా అరుదైన గ్రంథాలు ఈ గ్రంథాలయంలో కొలువుదీరాయి. వీటితో పాటు ఈ గ్రంథాలయంలో పదిహేను వందల పైచిలుకు రెండు వందల ఏండ్ల కాలం నాటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
మారుతున్న కాలంతో పాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్‌తో విన్నుత్నమైన శైలిలో విద్యను అందిస్తూ కార్పొరేట్, ప్రైవేట్ విద్యాలయాలకు సవాల్ విసురుతుంది.
ల్యాబ్‌లు
దాదాపు లైఫ్ సైన్సెస్‌కు సంబంధించి, ఫిజికల్ సైన్స్‌కు సంబంధించి, వాణిజ్య శాస్త్ర విభాగంకు సంబంధించి, కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన ప్రయోగశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది రసాయన శాస్త్ర విభాగానికి సంబంధించిన ల్యాబ్ భాగంలో అడుగుపెడితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నటువంటి ఆ విభాగం చూడచక్కని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది విద్యార్థులను వినూత్నంగా ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తుంది.
జాతీయ సేవా పథకం
ఈ కళాశాలలో జాతీయ సేవా పథకం రెండు యూనిట్లు 1 మహిళా విభాగం, రెండవది పురుషుల విభాగం ఈ జాతీయ సేవా పథకం కింద ప్రతి సంవత్సరం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జాతీయ సేవా పథకం లో నిర్వహిస్తున్నారు.
యన్‌సీసీ
విజ్ఞాన పోషణతో పాటు శారీరక సామర్ధ్యం, ఉల్లాసం కొరకు ఈ కళాశాలలో రెండు యన్‌సీసీ విభాగాలు (మహిళలు పురుషులు) కలవు. ఇక్కడ తర్ఫీదు పొందిన ఇటువంటి విద్యార్థులు జాతీయ స్థాయిలో అనేక పేరెడ్ నిర్వహించి కళాశాలకు ఘనకీర్తి వహించారు. అనేకమంది యన్‌సీసీ ద్వారా వివిధ ఉద్యోగాలు సంపాదించారు.
మిస్టర్ సయ్యద్ ముహమ్మద్ అజమ్ 1920 నుంచి 1941 రెండు దశాబ్దాల కాలం పాటు విస్తతమైన సేవలు అందించారు. నాటి నుంచి (అహ్మద్ హుసేన్ ఖాన్, సయ్యద్ హుస్సేన్ జహీర్, ramlal రీ టూర్‌కి, సీతారామారావు, మాధవరెడ్డి, గోపాలకష్ణ, శారదా బారు వెంకటస్వామి, లక్ష్మణ్ రావు, టీవీ నారాయణ, రోశయ్య, వెల్చాల కొండలరావు, నటేషన్ కష్ణమూర్తి, అబ్దుల్ రజాక్, వెంకటస్వామి, నారాయణరావు, సరోజమ్మ సీతారామన్, రామ్మోహన్, శర్మ విజయప్రసాద, రేణుక, మంజులత, విజయలక్ష్మి, బాల భాస్కర్) ఇప్పటివరకు 42 మంది సమర్థవంతమైన ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలో సిటీ కళాశాల వినూత్నమైన సేవలు అందిస్తున్నది.
కళాశాలలో నూతనమైన అద్భుతమైన ప్రతిభ కనబరిచిన, విద్యార్థులకు 45 విషయ విభాగాలలో గోల్డ్ మెడల్స్ అందిస్తున్నారు.
ఈ కళాశాల అందించే సేవలు విద్యార్థులు, ఉపాధ్యాయులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా చేసుకొని భారత జాతీయ సంస్థ NAAC మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ఈ కళాశాలకు మూడు సార్లు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఈ కళాశాలకు NAAC B++ గ్రేడ్ లభించింది. కళాశాల అందించే సేవలను ఆధారంగా చేసుకొని తెలంగాణ కళాశాల విద్యాశాఖ వారు ఈ కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభిం చడం జరిగింది.
పూర్వ విద్యార్థులు
ఈ కళాశాలలో విద్యనభ్యసించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఘనులు అనేకులు. మర్రి చెన్నారెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఇంద్రా రెడ్డి మాజీ హౌంమంత్రి, నల్లు ఇంద్రసేనా రెడ్డి భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ నాగేశ్వర్, అర్షద్ అయూబ్ ఆటగాడు, పాశం యాదగిరి,
కేంద్ర మంత్రులుగా శివశంకర్ గారు, శివరాజ్ పాటిల్ గారు, ఉపకులపతులు మల్లారెడ్డి గారు, ఎస్ వి సత్యనారాయణ గారు తెలుగు సినీ వినీలాకాశంలో అద్భుత మాటల రచయితగా పేరుగాంచిన పరుచూరి బ్రదర్స్, భారవి ఈ కళాశాలలో విద్యనభ్యసించిన వారే వీరేకాక క్రీడారంగంలో వ్యాపార రంగాలలో రాజకీయ రంగాలలో అనేక ఉన్నత స్థానాల్లో ఉన్న వారందరూ కూడా ఈ కళాశాల విజ్ఞాన కుసుమాలే.
శతవసంతాల ఈ ఉత్సవాలను కళాశాల కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్గారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఆచార్య గంటా చక్రపాణి గారు ప్రారంభించడం జరిగింది.
ఈ సంవత్సరం శత వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా కళాశాలలు కమిషనర్ నవీన్‌మిట్టల్ గారి సూచనల మేరకు ప్రిన్సిపల్ బాల భాస్కర్ గారికి ఆధ్వర్యంలో ఏడాది పొడవునా కళాశాల ఆవరణలో జాతీయ,అంతర్జాతీయ సదస్సులు సెమినార్లు, అతిధి ఉపన్యాసాలు, బుక్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
- డాక్టర్ రవి కుమార్ చేగొని, 9866928327