Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభ్యుదయోధ్యమ పాట
ఒక విశ్లేషణ
రచణ: వేల్పుల నారాయణ
పేజీ 58 వెల 50/- రూ.
ప్రతులకు: నవ చేతన పబ్లిషింగ్ హౌస్12-1-493/విఎ: గిరి ప్రసాద్ భవన్
బండ్లగూడ- (నాగోలు)- హైదరాబాద్- 500068
కంది మళ్ళ ప్రతాప్‌రెడ్డి గారికి ఈ పాటల విశ్లేషణ పుస్తకాన్ని కవి అంకితం చేశారు. డా|| ఏటకూరి ప్రసాద్, డా|| ఎస్వీ సత్యనారాయణ అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణగారలు ముందు మాటలు రాసారు. సంగీత సాహిత్యాల సమ్మేలనం పాట. అనేక ఉద్యమాలను అంతర్లీనంగా ఆలింగనం చేసుకుంటూ వాటికి చైతన్య దీప్తి నందిస్తూ ప్రవహిస్తుంది. పాట అభ్యుదయోద్యమ పాట గొప్పది.పాటకు ఆశులక్షణం ఉండడం వలన సమయానుకూలుగా రూపంలో వస్తువును చొప్పించి పాటలు అల్లుకునే వెసులు బాటు ఎక్కువగా ఉంటుంది. ప్రాచీన జానపద కళారూపం పాట... పాటలో అనుపల్లవి. పల్లవి. చరణాలుంటయి. పని నుంచి పాట పుట్టింది. శ్రమ జీవనసౌందర్యం పాట గరిమెళ్ళ, గురజాడ, శ్రీశ్రీ, ముక్దూమ్, ఆరుద్ర: సుద్దాల హన్మంతు: దాశరథి నార్ల తుమ్మల, సి.నా.రె. కొండేపూడి, గబ్బెల మల్లారెడ్డి , అందెశ్రీ, గద్దల జయవాజ్, వంగపండు మాష్టర్జీ, కలేకూని ప్రసాద్, నిస్సార్ బాబ్జీ కె..వి.వెల్ లాంటి వారి పాటల్ని అభ్యదయ గీతాల రచనల్ని విశ్లేషిస్తూ ఈ పుస్తకం వేల్పుల నారాయణ చక్కగా రాశారు. పోరాటాలు, త్యాగాలు- ఉద్యమాల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది అంటూ, అరవై ఏళ్ళకిందటే అవంత్యసోమసుందర్ రాసిన 'అగ్నిగుండంలో పడి నడిచి వచ్చింది- ఎన్నో ఏడుల చరితకు మన పార్టీ అమర వీరుల సాక్షిగా'' అంటూ ఈ పాట సాగుతుంద. కదిలిందీ అరుణ సన్యం చెదిరింది చీకటి రాజ్యం'' అంటూ సి.నా.రరె. పాటలపై విశ్లేషణ బాగుంది. ''సూడు మల్లేషా -సూడు మల్లేషా -దేశమెట్టా పోతుందో కనరా మల్లేషా''అన్న పాటను కన్నం లక్ష్మీనారాయణ'' రాసారు. దాని విశ్లేషణ బాగుంది. నాటి తెలంగాణా పోరాటంలో పేరు లేకుండా అజ్ఞాత కవుల పాటలు, జానపద పాటు, మహిళా కవయిత్రుల పాటలూ ఈ విశ్లేషనలో రాస్తే ఇంకా సమగ్రత సంతరించుకొనేది ''ఎర్రపూల వనంలో పువ్వు రాలిందో'' అన్న మల్లు స్వరాజ్యం, విమలక్క మొ|| వారి పాటలు... ప్రజాన్యామండలిలోని కవుల పాటలు ఉటంకిస్తే బాగుండేది. అరసం వారి ప్రయత్నం అభినందనీయం
- తంగిరాల చక్రవర్తి , 9393804472