Authorization
Thu April 03, 2025 07:47:04 am
పాల ప్యాకెట్ కవర్లను సేకరించడం చాలా ఇండ్లలో అలవాటు తగ్గిపోయింది. అయితే, వాటిని రీసైకిల్ చేసి, పర్యావరణ అనుకూల పద్ధతిలో తయారు చేస్తారు. అవి ఏంటో తెలుసుకుందామా...
పాల ప్యాకెట్ కవర్లో పాలు తీసేసిన తర్వాత వాటిని వేడి నీటిలో ఆరబెట్టి మడిచి పెట్టుకోవాలి. ఇలా చేస్తే వాసన రాదు. మిల్క్ ప్యాకెట్లు మందపాటి నాణ్యతతో తయారు చేస్తారు. కాబట్టి, మీరు అందులో ఆహార పదార్థాలను దాపెట్టుకోవచ్చు. ఆహారాన్ని ఫ్రిజ్లో నిల్వ చేయవచ్చు.
గ్రీన్ పీస్, బఠానీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వేయించిన కొబ్బరి వంటి కూరగాయలను కూడా వేసుకుని పెట్టుకోవచ్చు.
గడ్డకట్టి ఉంచాల్సిన ఆహార పదార్థాలకు కూడా ఈ ప్యాకెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి ఐస్ నిరోధకతను కలిగి ఉంటుంది. కానీ, ఇందులో ఆహార పదార్థాలు వేసినప్పుడు గట్టిగా మూత మూయాలి.
తోటపని చేస్తున్నప్పుడు చేతులు మురికిగా మారతాయి. అప్పుడు మీ వద్ద చేతి తోడుగులు లేకపోతే ఖాళీ పాల ప్యాకెట్ కవర్లను వినియోగించి తోటపని చేసుకోవచ్చు.
ఇది మీ చంటి బిడ్డ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్లినప్పుడు బిడ్డకు వేసిన డైపర్, టిష్యూ లేదా బట్టలకు దీన్ని ఉపయోగించవచ్చు. మహిళలు నాప్కిన్లను కూడా ఇందులో వేసి పారవేయడానికి ఉపయోగించుకోవచ్చు.
ఈ పాల ప్యాకెట్ కవర్లను వాటర్ ప్రూఫ్, సెల్ఫోన్లు, హెడ్ సెట్స్ వంటి చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను భద్రపరచుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.