Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక ప్రపంచంలో అయోమయపు విలువల గొడవలలో మునిగి తేలుతున్న స్త్రీలది మరొక వర్గం. నా శరీరం నా ఇష్టం అన్నా, నా కిష్టమైన దుస్తులు నేను ధరిస్తాను అని నినదించినా స్త్రీ తనకే అంతుపట్టని మార్కెట్ మాయజాలంలో భాగం అయిపోతుంది. అసలు తాను ఆధునికత పేరుతో తనను తాను సరుకుగా మార్చుకుంటున్నాననే గ్రహింపు కూడా లేని, రాని వ్యవస్థలో ఆమె కూరుకుపోతుంది. మనం స్త్రీలుగా ఎప్పటికీ బలవంతుల నియంత్రణలోనే ఉంటున్నామని, స్వేచ్చ, స్వాతంత్య్రం పేరుతో జరుగుతున్నది మరో బడా వ్యాపారమని స్త్రీలుగా మనం గుర్తించగలగాలంటే ఇంకెన్ని దశాబ్దాలు పట్టాలో.
ప్రపంచంలో వ్యభిచారం అన్నది అతి పురాతన వృత్తి. పితృస్వామ్య వ్యవస్థ బలంగా పాతుకుపోయిన చోట, స్త్రీ, పురుషులు కుటుంబాలుగా ఏర్పడ్డ సమయం నుంచి ఈ వృత్తి ఉంది. సాంప్రదాయం పేరుతో, భక్తి పేరుతో, కళ పేరుతో కుటుంబం అనే వ్యవస్థలోనించే కొందరు పీడిత స్త్రీలను లోబర్చుకుని ఒక వర్గాన్ని ఏర్పరిచి పురుషుని శారీరిక అవసరాలకు సిద్దంగా సమాజం ఈ స్త్రీలను అందుబాటులో పెట్టింది. ఈ స్త్రీలకు కుటుంబాన్ని నిర్మీంచుకునే అనుమతి లేదు. వీరి సేవలు సామాజికం. వీరికి తమదైన జీవితం ఉండడానికి వీలు లేదు. పురుషులను అకర్షించడానికి సంసారం, సంప్రదాయపు స్త్రీలు ఇవ్వలేని సుఖాన్ని వీరు అందించడానికి ఎప్పుడు సిద్దంగా ఉండేలా సమాజం కొన్ని వర్గాలను నిర్మించి పెట్టింది. ఇది ప్రపంచం అంతటా కనిపిస్తుంది. మన దేశంలో దేవదాసీలు, జోగిణీలు, ఇలా తయారు చేయబడినవారే. అసలు మనుష్యులందరూ ఎదో ఒక మూసలో ఊండెలా వ్యవస్థ నిర్మించిన పనిముట్లే. పురుషున్ని యజమానిగా చేసి సమాజం కొందరు స్త్రీలను సంసారం కోసం మరి కొందరిని పురుషిని ఆనందం కోసం తీర్చిదిద్దింది. పైగా అది వారి వృత్తిగా మార్చివేసింది. కోందరు స్త్రీలు వేశ్యా వృత్తిలోకి నెట్టి వేయబడితె మరి కొందరు సంసారాలలోకి నెట్టివేయబడ్డారు. గమనిస్తే ఈ రెండు వర్గాల స్త్రీల మధ్య విపరీతమైన ద్వేషం ఉంటుంది. ఈ రెండు వర్గాలనీ సమాజమే తయారు చేస్తుంది అన్న విషయం అర్దం కాకుండా పతివ్రతలమని ఒక వర్గం, బజారు స్త్రీలని మరొక వర్గం తమ జీవన మార్గాలకు తామే కర్తలమని అను కుంటూ ఉంటారు. కాబట్టే సంసార స్త్రీలు వేశ్యలను ద్వేషిస్తారు. వారిని మర్యాదస్తులు బహిష్కరిస్తారు. మర్యాదస్తుల్లా కనపడే వారి వర్గపు పురుషులు తయారు చేసిన వ్యవస్తే వేశ్యలు అన్నది అర్ధం చేసుకునే స్థాయిలో సంసార స్త్రీలు ఉండరు.
ఆధునిక ప్రపంచంలో అయోమయపు విలువల గొడవలలో మునిగి తేలుతున్న స్త్రీలది మరొక వర్గం. నా శరీరం నా ఇష్టం అన్నా, నా కిష్టమైన దుస్తులు నేను ధరిస్తాను అని నినదించినా స్త్రీ తనకే అంతుపట్టని మార్కెట్ మాయజాలంలో భాగం అయిపోతుంది. అసలు తాను ఆధునికత పేరుతో తనను తాను సరుకుగా మార్చుకుంటున్నాననే గ్రహింపు కూడా లేని, రాని వ్యవస్థలో ఆమె కూరుకుపోతుంది. మనం స్త్రీలుగా ఎప్పటికీ బలవంతుల నియంత్రణలోనే ఉంటున్నామని, స్వేచ్చ, స్వాతంత్య్రం పేరుతో జరుగుతున్నది మరో బడా వ్యాపారమని స్త్రీలుగా మనం గుర్తించగలగాలంటే ఇంకెన్ని దశాబ్దాలు పట్టాలో.
'సాధన' సినిమా కోసం సాహిర్ లుధియాన్వి రాసిన గీతం ఇది. వేశ్యల పునరావాసం అనే పాయింట్ మీద హిందీలో వచ్చిన సినిమా 'సాధన'. 1958లో బీ. ఆర్. చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఒక మంచి సినిమా ఇది. చంపా బాయి అనే ఒక వేశ్య ఈ సినిమాలొ ప్రధాన పాత్ర. వృత్తి చేసుకుంటూ ఉండే ఆమె మీద పడి జీవించే మగవాళ్ళూ కొందరు. ఆమె దగ్గరకు వచ్చిపోయే మగవారు ఇంకెందరో. ఆ వాతావరణంలో ఆమెకు తెలిసింది డబ్బు మాత్రమే తన అవసరాలు తీరుస్తుందని. కటిక పేదరికంలో తల్లి మరణించిన తరువాత చుట్టూ ఉన్న మగవారి ఆకలికి బలి అయిపోయిన జీవితం ఆమెది. తప్పని పరిస్థితులలో వృత్తిని ఎంచుకున్నాక స్వార్ధం, మోసం, కపటం తప్ప మరో ప్రపంచం తెలియని ఆమెకు జీవించడానికి చేతనయిన మార్గం ఏ దారిలో అయినా సరే డబ్బు సంపాదించడం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బు లాగడం.
ఆమె వద్దకు ఎప్పుడూ వచ్చే ఒక విటుడు ఒక రోజు ఓ వింత కోరికతో వస్తాడు. తనకు తెలిసిన ఓ ప్రొఫెసర్ తల్లి ఆఖరి క్షణాలలో ఉందని, ఆమె కొడుకు వివాహం కోసం కలవరిస్తుందని, వివాహం పై ఆసక్తి లేని ఆమె కొడుకు మోహన్ తల్లి ప్రశాంత మరణం కోసం తాను ఓ అమ్మయిని ఇష్టపడ్డానని చెప్పాడని, కాబట్టి ఒక్క సారి మోహన్ ప్రేమించిన అమ్మాయిగా ఆ ముసలి తల్లి వద్దకు వచ్చి కాసేపు గడిపితే అడిగినంత డబ్బు మోహన్ ఇస్తాడని అతను చంపాబాయికి చెబుతాడు. ఈ పని వెనుక కూడా అతనికి కమీషణ్ ముడుతుంది కాబట్టి అతను చంపాబాయిని మోహన్ ఇంటికి వెళ్ళడానికి ఒప్పిస్తాడు. డబ్బు కోసం ఏమైనా చేసే స్థితిలో ఉన్న చంప అతనితో మోహన్ ఇంటికి వెళుతుంది. మంచంపై ఉన్న పెద్దామెకు తాను రజనిని అని పరిచయం చేసుకుంటుంది. అయితే కాబోయే కోడలి మొహం చూసిన అమె ఉత్సహంతో లేచి కూర్చుంటుంది. భవిషత్తు పై కోరికతో జీవించాలనే కోరిక ఆమెలో పెరుగుతుంది.
ఇక తప్పని పరిస్థితులలో ఆమెను ఎక్కువ సార్లు రజనిగా చంప కలవలసి ఉంటుంది. మోహన్‌కు రజని గతం తెలియదు. ఆమెను అతను ఇష్టపడతాడు. ఒక సారి మోహన్ తల్లి తాను కోడలి కోసం దాచిన నగలను రజనికి చూపిస్తుంది. రజనికి ఆ నగలపై ఆశ పుడుతుంది. పెద్దామె అవి ధరించమని అనడాన్ని, మోహన్‌కి తనపై క్రమంగా ఇష్టం పెరగడాన్ని సాకుగా తీసుకుని ఆ నగలను తనతో తీసుకెళ్ళిపోతుంది. అయితే రాత్రి ఆమె చేసే నృత్యాన్ని చూడడానికి వచ్చిన విటుల ముందు ఆ నగలు, సాంప్రదాయపు చీరతో అమె కనపడగానే వారంతా ఆమెను ఆశ్చర్యంతో చూస్తారు. నువ్వెప్పుడు సంసారివయ్యావు అని గేలి చేస్తారు. అయినా ఇలా కూడా బావున్నావు వచ్చి నాట్యం చేయి అన్న వారి ఆకలి చూపులు చూసిన తరువాత చంపకు తన జీవితంపై విరక్తి పుడుతుంది. తన జీవితం తనది కాకుండా పోవడం, మర్యాద మన్ననలకు తాను దూరం అవడం, కేవలం సరుకుగా మిగిలిపోవడం ఆమెను భాధిస్తుంది. తాను జీవిస్తున్న బ్రతుకు ఆమెకు రోత పుడుతుంది. వృత్తి మానేస్తుంది.
ఈ లోపు మోహన్ రజని అసలు జీవితం గురించి తెలుసుకుంటాడు. తాను మోసపోయానని బాధపడతాడు. కాని రజనిని మర్చిపోలేకపోతాడు. చివరకు మరోసారి తల్లి వద్దకు రజనిని తీసుకువచ్చినప్పుడు ఆమెకి కూడా నిజం తెలిస ిపోతుంది. ఆమెను మోహన్‌కి పరిచయం చేసిన లల్లు ఆమె మర్యాదస్తుల ఇంట ఉండదగనిదని, బజారులో నిలబడడమే ఆమే జీవితం అని చెప్పి ఆమెని అవమానిస్తాడు. మోహన్‌పై ఆరాధన పెంచుకున్న చంప అతనికి క్షమాపణ చెప్పుకుని బజారులోకి వెళ్ళిపోతున్నప్పుడు మోహన్ తల్లి ఆమెను అడ్డగించి ఆ ఇంటికి కోడలిగా వచ్చిన తరువాత ఆమెకు బజారులో నిలబడవలసిన అవసరం లేదని ఆమె ఆ ఇంటి కోడలని చెప్పి తన కొడుకుకి భార్యగా ఆమెను స్వీకరిస్తుంది.
వేశ్యలను ఇంటి కోడళ్ళుగా మార్చుకోగల గొప్ప హృదయాలు ఉండగలవా లేవా అన్నది కాదు ఈ సినిమాతో చర్చకు రావల్సింది. సమాజమే వేశ్యలను, సంసార స్త్రీలను తయారు చేయగలదని. మర్యాదస్తులు చేతులు చాపి చంపా లాంటి స్త్రీలకు సహాయం చేయాలని. ఆర్ధిక సంబంధాల మధ్య మనిషి నలిగిపోతున్నాడని, అవే స్త్రీ సామాజిక స్థాయికి కారణం అవుతున్నాయని చెప్పిన సినిమా ఇది. సంసారమనే రక్షణ కవచం క్రింద కొందరు స్త్రీలను ఉంచి, మరి కొందరిని బజారులో నిలబెట్టే వ్యవస్థలోని దుర్మార్గాన్ని ఎదిరించాలనే అలోచనను నింపడానికి తీసిన సినిమా 'సాధన'. ఈ సినిమాకు సాహిర్ రాసిన ప్రతి పాట కూడా వ్యవ్యస్థపై సంధించిన బాణం. బ్రతకడానికి శరీరాన్నిపణంగా పెట్టడం తప్పని పరిస్థితులను సమాజం స్త్రీలకు కల్పించి ఆ తరువాత అ స్త్రీలను బహిష్కృతులుగా ఎంచడం ఎంత వరకు న్యాయం అన్న పాయింట్ మీద వచ్చిన మంచి సినిమా ఇది.
ఎవరు ఎన్ని చెప్పినా ఈ వృత్తి రూపం మారుతుందేమో కాని స్త్రీ ని బజారులో నిలబెట్టడం ఆగే సూచనలు కన్పించవు. సమజంలో ఎన్నో విషయాలలో మార్పు వస్తుందని మనం అనుకుంటున్నాం అంతే. ఒకప్పుడు ఇంటికి పరిమితమైన స్త్రీ ఇప్పుడు ఆర్ధికంగా ఎదుగుతుందని మురిసిపోతున్నాం, కాని స్త్రీ విలువ సమాజంలో పెద్దగా పెరిగింది లేదు. కాస్త ఆర్ధిక స్వాతంత్య్రం సంపాదించుకుని, తెలివితేటలను ప్రదర్శిస్తున్న స్త్రీల సామాజిక విలువ ఇప్పటికీ పెద్దగా మారింది లేదు. ఆశ్చర్యంగా ఆ నాటి ఆధారపడే స్త్రీలను దోపిడి చేసేవారు బాహాటంగా మార్కెట్లో సరుకుగా, అవసరాలు తీర్చే వస్తువుగా మారిస్తే, స్వాతంత్య్రం స్వేచ్చ మాయాజాలంలో పడి స్త్రీ ఇప్పుడు స్వచ్చందంగా మార్కెటీకరణకు సంసిద్దత చూపుతుంది. మార్కెటీకరణలో వస్తువుగా తాను రూపం మారుతున్నాను తప్ప మానవిగా తన విలువను తాను సంపాదించుకోలేకపోతున్నానని స్త్రీ అర్ధం చేసుకోలేని గందరగోళంలో సమాజ పరిస్థితులు ఉన్నాయి. నగత్వం, కుదించుకుపోతున్న విలువలు ఇవన్నీ అప్రస్తుత అంశాలుగా స్త్రీ మనసులో ముద్రించబడుతున్నయి. కాని ఇవి పురుషుని దాహార్తి తీర్చడానికే అన్నది ఆమెకే అర్ధం కావట్లేదు. స్వేచ్చ, స్వాతంత్య్రాలను ఎరగా వేసి తనను బంధిస్తున్నారని తెలుసుకోలేని ఆధునిక స్త్రీ మార్కెట్‌ను ప్రేమించడం మొదలుపెట్టింది. అందులో తన అస్థిత్వాన్ని నిర్మించుకోవాలని, వెతుక్కోవాలని తాపత్రయపడుతుంది. తాను మరో కుట్రకు బలి పశువుగా మారుతున్నానని అర్ధం చేసుకోలేకపోతుంది.
పై వాక్యాలు ఈ సినిమాలో చంపా తన విటుల వద్ద పాడే పాటలో వస్తాయి. వేశ్యగా మారిన స్త్రీ పైన చెప్పినవన్ని అమ్మగలదు. ఆమె దగ్గర అవి దొరుకుతాయనే పురుషుడు ఆమెను చేరతాడు. వాటి కోసమే ఆమెను కోరుకుంటాడు. ఆ ఆనందాలను పొందడానికి ఆమెను తనకు కావల్సిన విధంగా ఉపయోగించుకుంటాడు. లోతుగా ఆలొచిస్తే తనకు కావలసినది అందుబాటులో ఉంచుకోవడనికి బలవంతుడు దోపిడిని నిశబ్దంగా చేసుకూంటూ పోవడమే ఆధునీకరణ. వేశ్యలకు తాను దోపిడికి గురు అవుతున్నానని ఎప్పుడొ ఒకప్పుడన్నా అర్ధం అవుతుంది. కాని ఎంత మంది స్త్రీలకు వారి జీవిత కాలంలో ఈ విషయం అర్దం అవుతుంది? అసలు వారి మనసులు అటువైపుకు వెళ్ళకుండా ఉంచడానికి వ్యవస్థ ఎన్నో కుట్రలు పన్నుతుంది. చంపాకు ఒక మరాదస్తుని ఇంట స్త్రీ ధరించే నగలు దుస్తులను తాను ధరించేదాకా, అవి ధరించిన తరువత హేళన గా చూసే వారిని ఎదుర్కునే దాకా తనకు జరిగిన అన్యాయం అర్ధం కాలేదు.
ఈ సినిమాకు ముగింపు ఆదర్శవంతంగా ఇచ్చినా, సినిమ కథ కన్నా, సాహిర్ తన పాటలలో లేపిన ప్రశ్నలు ఆలోచించే మెదళ్ళను కదిలిస్తాయి. ఇది ఒక్క వేశ్యా వృత్తి మీద వచ్చిన సినిమాగా అనిపించదు. దోపిడికి గురవుతున్న స్త్రీ సమాజం పట్ల ఆలోచన రేకెత్తించే సినిమా. ఈ సినిమా ముగింపుని పరిశీలిస్తే, ఒక స్త్రీకి రక్షణ తోటి స్త్రీ సానుభూతి, అర్ధం చేసుకునే గుణం నుంచి మాత్రమే లభిస్తుందనేది స్పష్టం అవుతుంది. అందుకే వేశ్యా వృత్తి గురించి ఎన్నో సినిమాలు వచ్చినా 'సాధన' ఎప్పటీకీ ప్రధమ స్థానంలో ఉంటుంది. స్త్రీకి చేయూత ఇవ్వవల్సింది సాటి స్త్రీ యే. ఇదే 'సాధన' చెప్పిన నిజం. చంప/రజనీ గా నటించిన వైజయంతిమాల ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. తరువాత ఇంచుమించు ఇదే కథావస్తువుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. నిత్యం దోపిడికి గురు అవుతున్న 'ఆమె' కు బీ ఆర్ చోప్రా ఇచ్చిన నివాళి ఈ 'సాధన'. సినిమా లో కథ వేశ్యా వృత్తి గురించి మాత్రమే అయినా సాహిర్ పాటలోని సాహిత్యం సమాజంలో స్త్రీ స్త్రితిగతుల గురించి చాలా విషయాలు తెలుపుతుంది. వారు రాసిన ఆ రెండు పాటల్లో వేశ్యలు కనపడరు, దోపిడికి గురి అవుతున్న ప్రతి స్త్రీ కనిపిస్తుంది. సినీ గీతాలకు అంతటి లోతుని, గాంభీర్యన్ని ఇచ్చిన సాహిర్ లుధియాన్వి రాసిన ''ఔరత్ నే జనం దియా మర్దో కో'', ''కహోజి తుమ్ క్యా క్యా ఖరీదోగే'' అన్న పాటలు ఈ సినిమా స్థాయిని పెంచాయి.
- పి.జ్యోతి, 9885384740