Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్కో దేశం ఒక్కో ప్రత్యేకతతో యాత్రికులని ఆకట్టుకుంటే అబుదాభి
అణువణువూ ఓ కొత్త ప్రపంచాన్ని తలపిస్తూ కోట్లాది మంది యాత్రికుల్ని
తన అందంలో కట్టిపడేస్తోంది. ఆకాశహర్యాలు, వొరిగిన టవర్లు బేజల్ పాపిత్
కొండలు, వేల అడుగుల ఎత్తైన కొండలపై వంపులు తీరిన రహదారులు,
రాజ మందిరాలు, సూర్యాస్తమయాలు, యునెస్కో ప్రపంచ హెరిటేజ్ గుర్తింపు
కలిగిన ప్రదేశాలు, ఎడారి ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల మేర ఎగసి పడే
జలధారలు ఇలా ఒకటేమిటి అన్నీ విశేషాలే. అబ్బుర పరిచే ఈ దశ్యమాలికల్ని
వీక్షించాలంటే అబుదాభిలోకి అడుగేయాల్సిందే.....
అబుదాబి ఒమన్ దేశాలకు సరిహద్దుగా అలైన్ పట్టణానికి దగ్గరగా జబేల్ పాపిల్లలున్నాయి. జబేల్పాపీత్ అంటే ఖాళీకొండ అని అర్థం. ఇవి 26కిలో మీటర్ల పొడవు నాలుగు కిలో మీటర్లు వెడల్పు నాలుగు వేల అడుగుల ఎత్తున ఉన్నాయి. ఈ ఖాళీ కొండలు అబుదాబి దేశానికి చెందినవి. వీటిల్లో దాదాపు 500 అడుగులలోతు గుహలున్నాయి. కొండలు సున్నపు రాయి రంగులో ఉండి రాళ్లు పెలుసుగా పలకలు పలకలుగా ఉంటాయి. దీన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆకర్షణీయ యాత్రా స్థలంగా మార్చింది. కొండపైకి 12 కిలోమీటర్ల 3 లైన్ల రహదారి నిర్మించబడింది. ప్రయాణించడానికి అరగంట పడుతుంది. మధ్యలో వీక్షించడానికి అక్కడక్కడా దశ్య కేంద్రాలు నిర్మించారు. దారిలో ఖరీదైన హౌటళ్ళు ఉన్నాయి. రహదారికి 60 వంపులున్నాయి. రెండు పక్కల పటిష్టమైన సిమెంటు గోడ ఉంది. ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో నిర్మించబడిన ఈ మూడు లైన్ల రహదారి 1980లో జర్మనీ కంపెనీ పూర్తి చేసింది.
కొండ శిఖరాన ఒక పక్క - అడిగోపుల వెంకటరత్నమ్ అటు రాజుగారి రాజమందిరం ఉంది. పక్కనే విశాలమైన స్థలంలో వందల కార్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. సూర్యా స్తమయం చూడ్డానికి వేలాదిమంది యాత్రికులు గుమిగూడుతారు. కోలాహలంగా ఉంటుంది. సూర్యుడు యాత్రికులకు వీడ్కోలు ఇచ్చిన వెళ్లటం మరపురాని దశ్యం. కొండ ఉత్తర దిశ పాదాల వద్ద 2700 బిసి నాటి 500 సమాధుల నిర్మాణానికి అడ్డుగా ఉండటం వల్ల తవ్వటం జరిగింది. అక్కడ అస్తిపంజరాలు ఇత్తడి ముత్యాలు పింగాణి తదితర అలంకరణలు దొరికాయి. ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ స్థలంగా గుర్తించింది.
జీవకాలువలు
కొండకు ముందుగా ఉన్న దాదాపు 400 ఎకరాల ఎడారిని పచ్చని గరికగా మార్చారు. దీని పేరు గ్రీసుబాజరా పార్కు. భూగర్భజలం రెండు కిలోమీటర్లు దూరంలోంచి భూమిపైకి ఎగిసిపడుతున్న నీటి బుగ్గల్ని గమనించి బోర్లు దించి
నీటిని తోడుతున్నారు. కాలువలు సిమెంటు ఫ్లోరింగుతో నిర్మించి నీటికాలువలు ద్వారా పారిస్తున్నారు. కాలువలకు ఆనకట్టలు కట్టి అన్ని ప్రాంతాలకు నీరు మళ్లిస్తున్నారు. పారేనీరు చూడని ఈ ఎడారి ప్రాంతంలో ఈ జీవ కాలువల్ని చూసి జీవనదులనుకుంటాం. రెండు కిలోమీటర్లు దూరంలోంచి వస్తున్న నీటిని పవిత్రంగా భావించి.
యాత్రికులు నెత్తిపై చల్లుకోవటం గమనిస్తాం. నీరు పైకి వచ్చేసరికి వేడిగి ఉంటుంది. ఒక కిలో మీటరు భూ గర్భం నుంచి నీరు పైకొస్తే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అలా రెండు కిలో మీటర్ల దూరం పైకొచ్చేసరికి వేడి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. కాలువల్లో పారేసరికి వేడి చల్లబడుతుంది.
ఈ గ్రీన్ ముబాజరా పార్క్ 2004లో ప్రారంభించబడింది. ఎటుచూసినా పచ్చని కార్పెట్లు పరిచినట్లు ఉంటుంది. బల్లలు. కుటీరాలతో పాటు మరుగుదొడ్లు ఉన్నాయి. ఇక ఖర్జూర చెట్లు క్రబోస్ మొక్కలు సరేసరి. శుక్ర శని సెలవు దినాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వస్తువులన్నీ తెచ్చుకొని వంటలు అక్కడే చేసుకుంటారు. పండుగ దినాల్లో దాదాపు 4000 మంది వచ్చి సంతోషంగా రోజంతా గడుపుతారు.
సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లాగా అబుదాభి దేశంలో ఆకాశాన్ని అంటే భవనాలు ఉన్నాయి. అడినెట్ సెంటర్ అనగా అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇటలీలోని పీసాగోపురం లాగ వొరిగి ఉంటుంది. 100 అడుగుల లోతు పునాదితో 490 సౌత్ ఫౌండేషన్‌తో నిర్మించబడిన ఈ భవనం ఎత్తు 520 అడుగులు. ఇందులో చుట్టూను 5 స్టార్ హౌటళ్లు అనేక ఆఫీసులున్నాయి. 2007లో ప్రారంభించ బడి 2011లో పూర్తైంది. దీన్ని మానవ ప నిర్మిత వొరిగిన టవర్ గా గిన్నీస్ రికార్డు నిర్వాహకులు గుర్తించారు. ఒక సూత్రం ఉంది గరి నుంచి గీచిన లంబరేఖ ఆధార పీఠంలో పడుతున్నంతవరకు కట్టడం పడిపోదని, దీన్ని ప్రేక్షకులు అమితాశ్చర్యంతో వీక్షిస్తూ చాలాసేపు చూపును తిప్పుకోవడానికి ఇష్టపడరు.
గ్రీన్ ముబారా పార్క్:
అబుధాబిలో మరో ముఖ్యమైన ఆల్బర్ టవర్స్. 2 అంతస్తులు 40 అడుగుల ఎత్తు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్‌తో 2012లో నిర్మించబడిన ఈ భవనాన్ని పైనాపిల్ టవర్స్ అని కూడా అంటారు. ఇందులో బ్యాంకులు గవర్నమెంటు ఆఫీసులు ఉన్నాయి. భవనం చుట్టూ కింద నుంచి పైదాకా అద్దాలతో నిర్మితమైన గొడుగుల్లాంటివి బిగించబడ్డాయి. వీటి వల్ల ఈ భవనం పైనాఫిల్ పండులాగా కనిపిస్తుంది. పొద్దుపొడువు పువ్వులాగా సూర్యకాంతి ఏ వైపున పడుతుందో. అక్కడ ఈ భవనాన్ని స్వచ్ఛందంగా మూసేస్తాయి. ఇది ప్రాంతం కాబట్టి ఎక్కువ వేడి లోపలకు తగలకుండా పనిచేస్తాయి. సూర్యకాంతి పడనిచోట విచ్చుకుని ఉంటాయి. కాంతికి అడ్డులేకుండా ఇలా రోజంతా సూర్యుడితో యుద్ధం చేస్తుంటాయి. సూర్యుడు ఓడిపోతుంటాడు. వీటిని అవగాహన చేసుకుని చూసిన చూపులు సాంకేతిక నైపుణ్యానికి విస్మయం చెందుతాయి.
సన్ బీచ్
అరేబియా సముద్రం ఒక పాయ అబుధాబి పడమర అంచును తాకుతూ ఉంది. అక్కడ బీచు అత్యంత అందంగా తీర్చి దిద్దారు. రాత్రి పూట వెలుగుజిలుగులు వెదజల్లుతుంది. అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఈ బీచ్పేరు కార్మీష్చ్ కార్నిష్ అనే పదం ఫ్రెంచి భాష నుంచి వచ్చింది.. విదేశీయాత్రికులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. సనత్ ఇక్కడ ప్రత్యేకత. సముద్రపు పాయకాబట్టి అలలుండవు, పెద్ద సరోవరంలా ఉంటుంది. రక్షణ ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయి. మంచెలపై గజ ఈతగాళ్లు పర్యవేక్షిస్తుంటారు. బోటు వాహ్యళి ఉంది. యాత్రికులు గంటల తరబడి సూర్యాస్తమయం కోసం ఎదురు చూసి సూర్యుడు భూమిలోకి దిగిపోయే దశ్యాన్ని చూసి ఆ మధురానుభూతిని మనస్సుల్లో ముద్రించుకొని వెళ్తుంటారు. కోట్ల మైళ్ల దూరాన ఉన్న సూర్యుడు దిగివచ్చి వందల అడుగుల దూరంలో ఉన్నట్టు, పరుగడితే పట్టుబడున్నట్టు బీచ్‌లో అస్తమయాన్ని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది.