Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు నవలా సాహిత్యంలో నవలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 'మాలపల్లి' లాంటి నవలలు ఆ రోజుల్లో జాతీయోద్యమానికి ప్రేరణనిచ్చాయి. క్రొవ్వలి వారు వెయ్యికిపైగా నవలలు రాసారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని - ఎందరో రచయితలు నవలీకరించారు. పోరాటంలో పాల్గొన్న వారు వున్నారు. స్త్రీలు ఉత్పత్తి కులాల్లో ఎంతో శ్రమ చేస్తారు. శ్రమజీవన సౌందర్యం చాలా గొప్పది. శ్రమ సాంస్కృతికి శ్రామికులకు - వారి శ్రమకు గుర్తింపు గౌరవం శ్రమకు తగ్గ ఫలం రావాలంటే ఈ సమాజాన్ని మార్చడం పోరాటాలు చేయడం అనివార్యం. ఆ దశగా సాహిత్య సృష్టి - చేస్తే సమాజానికి ఎంతో ప్రయోజనకరం. చలం నవల చదువుతున్నట్టు అనిపిస్తుంది. ''వక్రగీత'' చదువుతుంటే- ఎక్కువ పాత్రల్ని నవలలో రాయడం వల్ల కొంత పాఠకునికి ఇబ్బందే కదా!! జాండ్రపేట-కుమ్మరోళ్ళు, మేదరోళ ్ళ, వెంకటస్వామి అనే స్వాతంత్య్రయోధుని, వడ్డొళ్ళు మొదలైన వారి జీవితాలు చక్కగా దృశ్యమానం చేశారు.
వెంకటస్వామి కూతురి అక్రమసంబంధం - రాజమ్మ అనే మరో స్త్రీ తనకు పుట్టిన కొడుకును వదిలి అమె చెల్లెలి భర్తతో అక్రమసబంధం పెట్టుకొని వూరు వదిలి వెళ్ళిపోవడం-మేదరోళ్ళలో కూడా ఒక స్త్రీ ''గెద్దె'' పేరుతో పల్లెల్లో తిరుగుతూ... ఎవరితోనో వెళ్ళిపోవడం... ఇలా స్త్రీ యొక్క మానసిక స్థితిని అక్రమ సంబంధాన్ని నవలీకరించారు. మైదానంలో చలంరాజేశ్వరి పాత్ర, ముగ్గురు పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న తీరు పాఠకులకు గుర్తుకొస్తుంది. ఈ నవలలో తిమ్మక్క పాత్ర.
నవల రత్తమ్మ - ధనలక్ష్మి పాత్రలతో ప్రారంభమై ఆసుపత్రిలో అవసాన దశలో తిమ్మక్క వున్నదన్న వార్త తెలిసి భర్త మునస్వామి (ఆర్టీసీ కండెక్టర్)తో తిరుపతి ప్రయాణానికి సిద్ధం అవ్వడం- కరోనా- వార్తలు టీవీలో రావడం అయినా తనను చిన్నతనంలోనే వదిలేసి మరొకరితో లేచిపోయిన తన తల్లిని చూడాలనే ఆశతో రత్తమ్మ తొందరపడి భర్తతో బయలుదేరడంతో నవల ముగుస్తుంది.
మగవాడి చేతిలో స్త్రీ మోసపోయే విధానాలు ఇంకా బలంగానే చెప్పిన బాగుండేది. - పేదవాళ్ళు తప్పు చేస్తే వేలెత్తి చూపే సమాజం... ధనికులు చేస్తే ఎంజారుమెంటి... సహజీవనం-డేటింగ్ లాంటి గౌరవప్రదమైన పదాలతో గొప్పగా మాట్లాడుతారు. అంటూ మునుస్వామి భార్య రత్తమ్మకు చెప్పడం చివర్లో.... సమాధాన పరిచే ధోరణితో వుంది. తిమ్మక్క ఒక విధివంచిత... మంచిది కాదు అని తెలిసినా చివరి క్షణంలో ఆమెను చూడాలనే విశాల హృదయంగల కూతురు రత్తమ్మ ఆమె భర్త మునుస్వామి పాత్రలపై పాఠకుల్లో సానుభూతి కలుగుతుంది. కానీ ఎక్కడో జాండ్రపేటలో ఎరికలకులంలో పుట్టి.... భర్తను వదిలి... సాలెవాడితో లేచిపోయి... వడ్డి బోయిడితో సంసారం చేసి బిడ్డను కని.... కదిరప్ప అనేవాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం. గర్భవతి కావడం.... బిడ్డను మునెమ్మ పెంచే టైమ్లో కదిరప్ప. తిమ్మక్క బిడ్డను పిల్లలు లేని దంపతులకు అమ్మివేయడం... తిమ్మక్క తన బిడ్డను దక్కించుకుని కదిరప్పతో గొడవపడటం.... అతని భార్య మంగమ్మ అతన్ని తిట్టడం చాలా నాటకీయత ప్లాష్బాక్గా చెప్పిన తీరు ఉత్కంఠ కలిగిస్తుంది. 'వ్యథార్థ యధార్థ గాథను బాగా రాసా(ర)ని చెప్పాలి.
''వక్రగీత'' (నవల)
రచయిత: డా|| వి.ఆర్. రాసాని
పేజీలు :130, వెల: రూ.100/-
ప్రతులకు : రచయిత పేరుతో,
ఇ.నెం. 2-525, ఫ్లాట్ నెం 16, సాయివెంకటనగర్, తాటితోపు, చంద్రగిరి రోడ్, వెంకటపతి నగర్ తిరుపతి-517505
9848443610
- తంగిరాల చక్రవర్తి , 9393804472