Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రిస్మస్... క్రైస్తవులకు ఆరాధ్యుడైన యేసుక్రీస్తు జన్మదినంగా పరిగణించబడుతున్న రోజు. పేరుకు క్రైస్తవుల పర్వదినమే అయినా ప్రపంచవ్యాప్తంగా సర్వ మానవాళీ ఉత్సాహంగా పాటించే రోజు. మతాలకతీతంగా అందరూ ఆనందంగా పాల్గొనే పండగగా క్రిస్మస్ పేరొందింది. పరస్పరం అభినందించుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, క్రైస్తవుల ఇండ్లను సందర్శించి
శుభాకాంక్షలు తెలుపుకోవడం... ఒక సోదరభావం వెల్లివిరిసే పండగ క్రిస్మస్. పైగా శీతాకాలంలో రావడం వల్ల అనుకూల వాతావరణం కూడా ... అనుభూతులకు ఆలవాలంగా ఉంటుంది. భౌగోళిక ప్రాంతాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు అన్వయించుకుంటూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఒకే రకంగా జరుపుకునే పండగ ఇది.
ఈ క్రిస్మస్ సాంప్రదాయాల వైవిధ్యాల కలబోతే ఈ వారం ప్రత్యేక వ్యాసం...
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25ను క్రీస్తు జన్మదినంగా క్రిస్మస్ పేరుతో వేడుక జరుపుకోవడం మనకి తెలుసు. క్రీస్తు జననానికి సంబంధించిన ఘట్టాలను ఆవిష్కరిస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం, కథలు వినడం పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఓ మెర్రీ టైమే. మతపరమైన విశిష్టత కాసేపు పక్కన పెడితే క్రిస్మస్ అంటే ఇవ్వడం, కుటుంబ, బంధు, మిత్రుల కలయిక, అందమైన అలంకరణలు, ఆహ్లాదమైన సంగీతం, ఆనందమైన ఆహారం. ఈ క్రమంలో ఇంటి ముందు కాంతులీనే నక్షత్రం, ఇంటి లోపల అలంకరించిన క్రిస్మస్ చెట్టు, ఘుమఘుమలాడే క్రిస్మస్ ్ కేక్ మామూలే. ఈ మధ్యలో 'శాంటా క్లాస్' అనే ఒక క్రిస్మస్ తాత. దుప్పులు పూనిన మంచు రథం ఎక్కి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ, ఇండ్ల పొగ గొట్టాల గుండా లోపలి జారి, అక్కడి క్రిస్మస్ చెట్టుకి వేలాడదీసిన సాక్స్ (మేజోళ్ళ)లో కోరుకున్న బహుమతులు పెట్టి వెళ్లి పోతాడని ఒకప్పటి నమ్మకం. ఎరుపు దుస్తులు వేసుకుని తెల్లగడ్డం పెట్టుకున్న శాంటా క్లాస్‌లు ఇప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గర కూర్చుని పిల్లలకు చాక్లెట్లు అవీ ఇస్తూ సంతోష పరుస్తుంటారు. ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ చాలా చోట్ల దర్శనం ఇస్తున్నారు.
ఈ పండగలో భాగంగా ఒక రెండు వారాల ముందు నుండే బందాలుగా ఇంటింటికీ వెళ్లి పాటలు (కేరల్స్) పాడటం కూడా ఒక సందడే. విశేషమేమంటే, ఈ పండగకు 'మా ఇంటికి రండీ' అని పిలవక్కరలేదు. క్రైస్తవులు తమ మిత్రుల ఇండ్లకు వెళ్లి, కేక్ ఇచ్చి, వారు ఇచ్చిన కేక్ తిని, బహుమతులు ఇచ్చి పుచ్చుకుని, శభాకాంక్షలు తెలిపి రావడం ఒక అందమైన మైత్రీ బంధ వ్యక్తీకరణ. అందరినీ ప్రేమించడం, అందరితోనూ ఆనందంగా ఉండటం వేడుకల్లో కనిపిస్తుంది. అమెరికాలో అయితే నవంబర్ మూడవ గురువారం ప్రాంతంలో వచ్చే కతజ్ఞతా దినం (థ్యాంక్స్ గివింగ్ డే) తరువాత మొదలయ్యే క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా కొత్త సంవత్సరం వరకూ కొనసాగుతాయి.
సుద్దులు నేర్పి...
ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలు సెయింట్ నికోలస్ దినంగా భావించే డిసెంబర్ 6 నుంచి ప్రారంభ మౌతాయి. మొత్తం నగరాలన్నీ శోభా యమానంగా దీపాలతో అలం కరిస్తారు. పిల్లలకు స్వీట్లు, బహుమతులు అందిస్తారు. పిల్లలు తమ బూట్లను పాలిష్ చేసి మరీ తమ ఇంట్లోని చిమ్నీల దగ్గర ఉంచుతారు. ఇలాగైనా శుచీ శుభ్రత పిల్లలకు ముందు నుంచే అలవడతాయనేమో. పిల్లల సరదా మాత్రం వేరు. క్రిస్మస్ తాత వాటి నిండా స్వీట్లు నింపుతాడని వారి నమ్మకం. క్రిస్టమస్ రోజు కుటుం బాలన్నీ ఒకచోట చేరి విందు చేసుకుం టాయి, బహు మతులు ఇచ్చి పుచ్చుకుంటాయి.
తప్పుకు బొగ్గు ముక్క
ఇటలీలో శాంటా క్లాస్ బదులు 'లా బెఫానా' అనే మంచి మంత్రగత్తె పిల్లలకి బహుమతులు పంచి పెడుతుందని నమ్మకం. ఆమె పొడవాటి చీపురు కర్రపై వస్తుందని చెడ్డ పనులు చేసిన పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తుందని నమ్మకం. చిన్నారుల్ని గాడిలో పెట్టేందుకు ఇదో మంచి సందర్భం కావడం మంచిదే కదా. మరో మాట.. ఈ సంబరమంతా ఇటలీలో జనవరి 6వ తేదీన జరుగుతుంది.
ఇచ్చిపుచ్చుకుంటేనే బావుంటుంది
నెదర్లాం (శాంటాక్లాస్‌ని సిమ్లర్క్లాస్ అంటారు. ఆతను వారికి ఎక్కడో ఉత్తరధవంపై కాక స్పెయిన్‌లో నివసిస్తాడని, అక్కడి నుంచి మర పడవలో, బ్లాక్ పీటర్ అనే సహాయకుడిని తీసుకుని వస్తాడని ప్రజలు భావిస్తారు. వారి సంస్కతిలోని కొన్ని లోపాలు, చారిత్రకంగా అందివచ్చిన భావజాలాల వల్ల బ్లాక్ పీటర్ బానిసపాత్ర వచ్చినా ప్రస్తుతం మాత్రం క్రిస్మస్ వేడుకల్లో అంతా సంతోషమే కనిపిస్తోంది. తమకు గిఫ్ట్‌లిచ్చే పాత్రల పుట్టుపూర్వోత్తరాల కన్నా కూడా ఇచ్చిపుచ్చుకోవడంలోని ఆనందాన్నే ఎక్కువ వెతుక్కుంటున్నారు.
ప్రత్యేక పానీయంతో...
జర్మనీలో కూడా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఎక్కడ బడితే అక్కడ ప్రత్యేకంగా దుకాణాలు తెరుస్తారు. వాటిలో క్రిస్మస్కి సంబంధించిన వస్తువులు అమ్ముతారు. ఈ సీజన్లో ప్రత్యేకంగా గ్లూవైన్ అనే పానీయం అందుబాటులోకి తెస్తారు. దట్టంగా మంచు పట్టి వున్న సమయంలో ఈ పానీయం తాగి సంబరం చేసుకుంటారు. ఈ పానీయం కేవలం క్రిస్మస్ రోజుల్లో మాత్రమే తయారు చేస్తారు.
రోజు కాదు నెలంతా...
లండన్‌లో క్రిస్మస్ ఒక నెల రోజుల ముందే వేడుకలు మొదలవుతాయి, జనవరి మొదటి తారీఖు వరకూ కొనసాగుతాయి. ఆ రోజులలో నగరమంతా విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. త్వరగా చీకటి పడటంతో వేడుకలు తెల్లవారు ఝాము వరకూ జరుగుతాయి. దాదాపు ప్రతి కూడలిలోనూ క్రిస్మస్ చెట్లు ఆకర్షణీయంగా అలంకరించబడి అలరారుతుంటాయి.
మన దేశంలో ఎన్నో...!
భారత దేశంలోను తాహతు మేరకు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవులు అధికం. అందుకే అక్కడ ఈ పండగ హడావుడి ఎక్కువ. చర్చిలకు, ఇండ్లకు కొత్తగా రంగులు వేసి, దీపాలతో అలంకరించడం ఇక్కడి అలవాటు. చర్చిలలో పండగకు కొద్ది రోజుల ముందు నుంచే 'ఆడ్వెంట్ సీజన్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రిస్మస్కి సరిగ్గా ఒక నెల ముందు 'సపోస్డ్ క్రిస్మస్' లేదా 'సెమీ క్రిస్మస్' పేరుతో ముందస్తు వేడుకలు జరుపుతారు. క్రీస్తు జననం ఇతి వత్తంగా నాటికలు, పాటలతో కోలాహలం ఉంటుంది. ఆ తరువాత చర్చి సభ్యులు బందాలుగా విడిపోయి ఒక్కో ప్రాంతంలోని కుటుంబాల ఇళ్ళకు వెళ్లి క్రిస్మస్ పాటలు (కారల్స్) పాడతారు. కొన్ని చర్చిలలో క్రిస్మస్ ఈవ్ (క్రిస్మస్ ముందు రోజు సా యంత్రం) ప్రత్యేక వేడుకలు వుంటాయి. కొన్ని చోట్ల రాత్రి ప్రార్ధనలు వుంటాయి. యధావిధిగా క్రిస్మస్ రోజు ప్రార్థనలూ వుంటాయి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం సందడిగా వుంటుంది. క్రైస్తవేతరులు తమ క్రైస్తవ స్నేహితుల ఇండ్లకు వెళ్లి మరీ వారిని అభినందించడం విశేషం.
ఇతర పండగల లాగే కొత్త బట్టలు వగైరా మామూలే. చాలా మంది ఇండ్లకు స్టార్ లైట్లను అలంకరిస్తారు. ఇంటి లోపల క్రిస్మస్ చెట్టు కూడా అలంకరిస్తారు. ఇప్పుడు చాలా వరకూ కత్రిమ క్రిస్మస్ చెట్లను అలంకరించుకుంటారు. గానీ, కొన్ని ప్రదేశాలలో స్థానికంగా లభించే అరటి, మామిడి చెట్లను అలంకరిస్తారు. కొందరు మామిడి ఆకుల తోరణాలు కూడా కడతారు. కొందరు విద్యుత్ దీపాలు పెడితే కొంతమంది దీపావళిలాగా ప్రమిదలతో అలంకరించుకుంటారు. సాధారణంగా క్రిస్మస్ చెట్టు, ఇంటి ముందు క్రిస్మస్ నక్షత్రం వంటి అలంకరణలు మరో వారం వరకూ, అంటే కొత్త సంవత్సరం ఆరంభం వరకూ ఉంచుతారు.
దేవాలయాలకి వెళ్ళడం, కొత్త దుస్తులు ధరించడం చుట్టపక్కాలు వచ్చి శుభాకాంక్షలు తెలపడం, కేక్, ఇతర పిండి వంటలు ఇరుగు పొరుగు వారికి పంచడం వంటి సంబరాలతో క్రిస్మస్ రోజు కోలాహలంగా వుంటుంది. పండగ రోజుకి నెల ముందు నుండే కొన్ని బందాలు ఇంటింటికీ రాత్రి వేళల్లో వెళ్లి క్రిస్మస్ గీతాలను పాడటం (కారల్స్), ఆ ఇంటి వారు వాళ్లని సాదరంగా ఆహ్వానించి ఆదరించడం ఒక వేడుక. ఇక అన్ని పండగల లాగే, క్రిస్మస్ పండగ రోజు రాత్రి స్నేహితులతో, చుట్టాలతో విందు భోజనం సాధారణంగా జరిగేదే. మొత్తానికి ఒక నెల పాటు క్రైస్తవులకూ, క్రైస్తవేతరులకూ కూడా క్రిస్మస్ సందడి వుంటుంది.
క్రిస్టమస్ చెట్టు
క్రీస్తు జన్మించక ముందు నుండే పచ్చని మొక్కలు ప్రజల జీవనంలో భాగంగా ఉండేవి. క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ చెట్టుని అందంగా అలంకరించి ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడైతే అనేక రకాల కత్రిమ క్రిస్మస్ చెట్లు అందుబాటులో వున్నాయి గానీ, తొలుత, నిత్యం పచ్చగా వుండే పైన్ చెట్లను మాత్రమే అలంకరించే వాళ్ళు. యూరప్, ప్రాచీన ఐగుపులు, చైనీయులు, హెబ్రీయులు పచ్చని చెట్లను అలంకరించి, వాటిని పూజించే వాళ్ళు. దుష్ట శక్తులను నిరోధించే శక్తి పచ్చని చెట్లకు వుందని వాళ్ళు విశ్వసించే వాళ్ళు. వాళ్ళు క్రైస్తవులుగా మారిన తరువాత కూడా క్రిస్మస్ పండగ సంబరాలలో అదే అలవాటుని కొనసాగించారు.
అసలు క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకోవడం అనేది జర్మన్ల నుంచి పుట్టింది. మధ్యయుగంలో జర్మన్లు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఈడెన్ తోటలో ఆడం, ఈవ్‌కి గుర్తుగా ఫర్ చెట్టుకి ఆపిల్ పండ్లని కట్టేవారు. ఆ చెట్టుని వాళ్ళు పారడైస్ చెట్టుగా పిలుచుకునే వాళ్ళు. ఆ తరువాత క్రమేపీ క్రిస్మస్ చెట్టు ఆచారం బ్రిటన్‌లోకి పాకింది. అక్కడ ఆ చెట్టుకి రకరకాల కొవ్వొత్తులు, మిఠాయిలు, ఇతర వస్తువులతో అలంకరించడం ఆరంభమయ్యింది. అయితే అందరూ పచ్చని చెట్లనే క్రిస్టమస్ చెట్లుగా వాడరు. జార్జియాలో చిచిలాకీ అనే చెట్టుని రూపొందిస్తారు. చెట్ల కొమ్మలను చెక్కి, ఆ వచ్చిన చెక్క పొట్టుతో ఒక ఫర్ చెట్టులాగా తయారు చేస్తారు. విశేషం ఏమిటంటే, జార్జియన్లు క్రిస్మస్ను జనవరి ఏడున జరుపుకుంటారు!
క్రిస్మస్ చెట్టు ఆచారం కెనడాలో 1781లో ప్రవేశించింది. ఆ తరువాతి శతాబ్దంలో ఆ ఆచారం అమెరికాలోకి అడుగుపెట్టింది. సాధారణంగా ఇండ్లలో అలంకరించుకునే క్రిస్మస్ చెట్లు ఇరవయ్యో శతాబ్దంతో పాటు ఇండ్ల బయటకు ప్రవేశించాయి. అమెరికాలో అనేక బహిరంగ ప్రదేశాలలో, కూడళ్ళలో భారీ క్రిస్మస్ చెట్లను అమర్చడం మొదలు పెట్టారు. 1923 నుంచి అమెరికా శ్వేత భవనం దక్షిణ పచ్చికలో వారి జాతీయ క్రిస్మస్ చెట్టు అమర్చడం ఆరంభమయ్యింది. ప్రతి ఏడాది, ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్మస్ వేడుకలు ఆరంభమౌతాయి.
ఒకప్పుడు క్రిస్మస్ చెట్లు పూర్తిగా అడవుల నుంచే సేకరించే వారు. ఇప్పుడు క్రిస్మస్ కోసం ఏకంగా లక్షల ఎకరాలలో ఫర్, పైన్ చెట్లను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, యుకేలలో సాగుచేస్తున్నారు. ప్రతి ఏడూ అమెరికాలో 330 నుంచి 360 లక్షల క్రిస్మస్ చెట్లు ఉత్పత్తి అవుతున్నాయి. యూరప్‌లో అంతకు రెట్టింపు ఉత్పత్తి జరుగుతోంది. దాదాపు పాతిక రకాల ఫర్, పైన్ చెట్ల జాతులను డిసెంబర్ కొరకు సాగుచేస్తారు. విత్తనం నుంచి సుమారు ఏడు అడుగుల ఎత్తు పెరగడానికి ఒక్కో చెట్టు ఎనిమిది నుంచి పుష్కరం (పన్నెండు ఏండ్ల) సమయం తీసుకుంటుంది!
కత్రిమ క్రిస్మస్ చెట్లు ఇప్పుడైతే ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతున్నా, ముందుగా రూపొందింది మాత్రం క్రిస్మస్ చెట్టు ఆచారం మొదలైన జర్మనీలోనే. అడవుల నరికివేతకు అడ్డు చెప్పే క్రమంలో, పందొమ్మిదో శతాబ్దంలో, జర్మనీలో ఈకలకి పచ్చ రంగు వేసి చెట్లలా చేసేవాళ్ళు. ఇంకా ఇతర పదార్థాలతో తయారు చేస్తున్నారు. తొలి క్రిస్మస్ చెట్టు అమ్మకాలు అమెరికాలో 1850 ప్రారంభమయ్యాయి. అమెరికాలో రాక్ ఫెల్లర్ సెంటర్లో క్రిస్మస్ చెట్టు పెట్టడం 1988 నుాంచి ఆనవాయితీగా వస్తోంది.
హొక్రిస్మస్ కారల్స్
క్రీస్తు శకం 129లో మొట్ట మొదటి కారల్, 'ఏంజెల్ హిమ్'ని ఒక రోమన్ బిషప్ క్రిస్మస్ రోజున పాడాలని ఆదేశించాడు. 'హార్క్! ది హేరా ఎంజెల్స్ సింగ్' అనే పాట 1739 కంటే ముందు రాసిందని అంటారు. బాగా ప్రాచుర్యం పొందిన 'సైలెంట్ నైట్ పాటని జోసెఫ్ మోర్ అనే జర్మన్ రాసాడు, జేవియర్ గరూబర్గ్ సంగీతం కూర్చాడు. దాన్ని డిసెంబర్ 24, 1818న ఆస్ట్రియాలో మొదటిసారి ఆలపిం చారు. ఇప్పటికి ఆ పాట 44 భాషలలో తర్జుమా చేయబడింది. ప్రస్తుతం పాడుతున్న కారలు చాలా వరకూ 1843-1883 మధ్య ప్రాంతంలో రాసినవి.
శాంటా క్లాస్
క్రిస్మస్ ముడిపడి వున్న మరో అంశం శాంటాక్లాస్. ఎరుపు, తెలుపు దుస్తులతో, పొడవాటి తెల్లని గడ్డం, తలపై యెర్ర టోపీ, భుజాన పెద్ద సంచి, అందులో అనేక బహుమతులు... ఈ ఆహార్యంతో ఉండే శాంటా క్లాస్లా ఇప్పుడు మన దేశంలో కూడా క్రిస్మస్ సమయంలో చాలామంది కనిపిస్తుంటారు. క్రిస్మస్ తాతగా ప్రసిద్ది చెందిన శాంటాక్లాస్ రూపురేఖలు, హావ భావాలు కైమెంట్ మూర్ అనే కవి 1823లో రాసిన పద్యం 'ఎ విజిట్ ఫ్రం శాంటా క్లాస్'లో వివరించాడు. ''లావుగా, బొద్దుగా, ఆనందంగా వుండీ'', ఎగిరే అడవి దుప్పులు లాగే వాహనం పై తిరుగుతూ, ఇండ్ల పొగ గొట్టాల గుండా దిగి, పిల్లలు వేలాడ దీసిన మేజోళ్ళలో బహుమతులు పెట్టి వెళ్ళిపోతాడు.
క్రిస్టమస్ పేరు ముందు నుంచి ఉందా?
క్రిస్మస్ అనే మాట క్రీస్తు-మాస్ అనే ఒక ఆచారం నుంచి వచ్చింది. యేసు తమ కొరకు మరణించి, పునరుద్దాను డయ్యాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. అందుకు గుర్తుగా అందరూ కలిసి ద్రాక్షా రసం, రొట్టె తీసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని సమభోక్తం (కమ్మ్యూనియన్) అనే పేరుతో నిర్వహిస్తారు. సమభోక్తం సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయం ముందు తీసుకోవచ్చు. అందువల్ల దానిని అర్ధరాత్రి తీసుకునే వాళ్ళు. క్రైస్తుమాస్ క్రమంగా క్రిస్మస్‌గా మారింది.
క్రిస్మస్ అనాలా, ఎమస్ అనాలా?
1100వ సంవత్సర ప్రాంతంలో క్రిస్టియానిటీ అనే పదాన్ని క్సియానిటీ అని పలికేవారు. ఆ పదం ఆంగ్ల అక్షరం ఎక్స్ మొదలౌతుంది. గ్రీక్ భాషలో ఎక్స్ అనే అక్షరాన్ని కై అని పలుకుతారు. దాంతో గ్రీకు భాషలో క్రైస్తు పదంలో మొదటి అక్షరం ఎక్స్ ఉండేది. 1551లో క్రిస్టమస్‌ని ఎక్స్ టేమాస్ అనే వారు. క్రమేపీ అదే ఎక్సగా రూపాంతరం చెందింది.
డిసెంబర్ 25నే ఎందుకు?
వాస్తవానికి డిసెంబర్ 25నే యేసుక్రీస్తు జన్మించాడు అనటానికి చారిత్రక ఆధారాలు లేవంటారు. ఆ మాటకొస్తే అసలు ఆ రోజునే యేసు జన్మించాడని ఎవరికీ తెలీదు. బైబిల్ లో కూడా ఆ తేదీ ప్రస్తావన లేదు. బహుశ క్రీస్తు పుట్టుక క్రీస్తు శకం ఒకటవ సంవత్సరంలో కాక కాస్త ముందుగానే అంటే క్రీస్తు పూర్వం 2-7వ సంవత్సరాల మధ్య జరిగి ఉండవచ్చని కొందరి అంచనా. మన కాలమానంలో క్రీస్తు శకం '0' సంవత్సరం లేదు, నేరుగా క్రీ. పూ. 1 నుండి క్రీ. శ.1కి వెళుతుంది. మొట్టమొదటి క్రిస్టమస్ క్రీ.శ. 336వ సంవత్సరంలో, మొట్టమొదటి క్రైస్తవ రోమన్ చక్రవర్తి కాన్స్టాంటిన్ ఆధ్వర్యంలో జరిగింది అనడానికి నిదర్శనాలు వున్నాయి. కొన్నేళ్ల తరువాత, క్రీ.శ. 350లో మొదటి పోప్ జూలియస్ అప్పటి రోమ్ బిషన్గా ఉండేవాడు. డిసెంబర్ 25న జరుపుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది ఆయనే. అసలు క్రీస్తు పుట్టిన రెండు వందల ఏండ్ల తరువాతే మొట్టమొదటిసారి డిసెంబర్ 25 ప్రస్తావన కనిపిస్తుంది. అదీ, అప్పటి రోమన్ల 'సాటర్నేలియా' అనే ఒక కోత పండగకు దీటుగా తొలి క్రిస్మస్ పండుగ జరుపుకున్నారని చెబుతారు. క్రైస్తవం రోమా సామ్రాజ్యంలో అధికారిక జాతీయ మతంగా ఎదిగిన తరువాత, క్రీస్తు శకం 529 ప్రాంతంలో, జస్టినియన్ చక్రవర్తి క్రిస్టమస్‌ని సెలవు దినంగా ప్రకటించాడు అని ఒక వివరణ వుంది. మన దక్షిణ భారతంలో పంట కోతకు వచ్చిన సమయంలో పండగ చేసుకునే సాంప్రదాయం వంటిదే ప్రపంచ వ్యాప్తంగా వుంది. అటువంటి ఒక సంతోషకరమైన సందర్భమే క్రిస్టమస్‌కి మూలం అంటారు కొందరు. యూదులకు హనుక్కా అనే పండుగ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఘనంగా జరుపుకుంటారు. క్రీస్తు కూడా యూదుడే. అందువల్ల కూడా డిసెంబర్ 25ని ఎంచుకుని ఉండవచ్చు. అయితే ఈ సంక్లిష్ట మూలాల జోలికి పోకుండా వుంటే, క్రిస్టమస్ అనగానే ఒక ప్రపంచ వ్యాప్త వేడుక అనిపిస్తుంది.
ఏసుక్రీస్తు జననం
జనాభా లెక్కల కోసం తన సాంమ్రాజ్యంలోని ప్రజలంతా రోమ్‌లోని బెత్లేహేమ్‌కు రావలసిందిగా రోమ్ చక్రవర్తి పీజర్ అగస్టీన్ ఆదేశిస్తాడు. జనాభా లెక్కల కోసం తమ పేరును నమోదు చేసుకోవటానికి మేరి, జోసప్లు బెత్లేహేమ్‌కు చేరుకుంటారు. అప్పటికే మేరి నిండు గర్భవతి. అప్పటికీ ప్రజలంతా బెత్లెహేమ్కు రావటంతో మేరి జోసప్లకు ఉండటానికి ఎక్కడా స్థలం దొరకదు. ఇంతలో మేరీకి నొప్పులు ప్రారంభం అవడంతో ప్రక్కనే ఉన్న పశువుల పాకలోకి మేరీ జోసప్లు వెలతారు. అక్కడ పశువుల మధ్యలో కొంత స్థలం చూసుకొని అక్కడే మేరి కొడుకు డిసెంబర్ 24న అర్థ రాత్రి దాటిని తరువాత జన్మనిస్తుంది. డిసెంబర్ నెలంతా చలికాలం కావటంతో అప్పుడే పుట్టిన బిడ్డకు పక్కనే ఉన్న పశువుల శ్వాసద్వారా వెచ్చదనాన్ని కలిగిస్తాయి. బాల ఏసుని ముందుగా దర్శించుకున్నది గొర్ల కాపర్లు ఏసు క్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో వెలుగులు జిమ్ముతాయి. ఒక పెద్ద నక్షత్రం గొర్ల కాపర్లకు కనిపించింది. అంతలోనే కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో ఒక దేవదూత వారి ముందు ప్రత్యక్షమై లోకరక్షకుడైన ఏసు జన్మించాడు మీరు వెళ్ళి దర్శించికోండని చెబుతుంది. అయితే ఇంత పెద్ద పట్టణంలో ఏసు ఎక్కడ జన్మిండాలో ఎలా తెలుసుకోవటం అని అడగ్గా అదిగో ఆకాశంలోని ఆ పెద్ద నక్షత్రమే మిమ్ములను అక్కడికి చేర్చుతుంది. అని దేవదూత చెబుతుంది. వెంటనే గొర్ల కాపర్లు కొన్ని రగ్గులు (గొంగళ్ళు) పండ్లు, పాలు తీసుకొని నక్షత్రం చూపిన చోటకు వచ్చి బాల ఏసుని దర్శించుకొంటారు. అదే విధంగా తూర్పు దేశాల నుంచి మరి కొంత మంది రాజులు కూడా నక్షత్రం చూపిన ,ఓటకు వచ్చి బాల ఏసుని దర్శించుకొంటారు. అదే విధంగా తూర్పు దేశాల నుంచి మరి కొంత మంది రాజులు కూడా నక్షత్రం ఆనవాలుతో ఏసుక్రీస్తును దర్శించుకొంటారని బైబుల్లో చెబుతుంది.
అందుకే లోకరక్షకుడు జన్మించడాని తెలియచేసే నక్షత్రం (స్టార్) ప్రతిక్రైస్తవ కుటుంబం తమ ఇంటి మీద స్టార్‌ని అమర్చుతుంది. ఏసు 24న అర్థరాత్రి దాటిన తరువాత జన్మించడంతో 25న క్రైస్తవులంతా పెద్ద ఎత్తున పండగ జరుపుకుంటారు.
- చెన్నయ్య