Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాటి నిరంకుశ ప్రభుత్వంలో సభా నిర్వహణ, వాక్ స్వాతంత్య్రం కరువు కావడంతో ప్రజలను చైతన్యం చేసే మార్గం ఒక్కటే ఉండేది. అది కూడా స్వల్ప ఆంక్షలతో ఉండేది. అదే పత్రికా నిర్వహణ. ఈ పత్రికలు అక్షర సువాసననెరిగిన ప్రతి ఒక్కరిని కొంత మేరకైన జాగృతం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పత్రికా నిర్వహణలో ఎలాంటి అనుభవం లేకపోయినా స్వంతంగా పలువురి పెద్దల ప్రోత్సాహంతో మందుముల 1927లో 'రయ్యత్' అనే ఉర్దూ వార పత్రికను స్థాపించారు. కానీ అనతి కాలంలోనే పత్రికా లక్ష్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1929లో పత్రికను నిషేధించింది. నిషేధం విధించినా కొన్ని షరతులతో మళ్ళీ 1932 జూలైలో పత్రిక పునఃప్రారంభమైంది.
సాధించాల్సిన సంకల్పానికి ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా, రాచరిక వ్యవస్థ ఎన్ని ఆంక్షలు విధించినా, ప్రజా జాగృతమే పరమావధిగా భావించి పత్రికను స్థాపించి ప్రజాక్షేత్రంలో చైతన్యపు బీజాలు చల్లిన హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ నాయకులు, పత్రికా స్థాపక సంపాదకులు, గొప్ప దేశభక్తుడైన మందుముల జీవితం భావి పౌరులకు ఒక సరికొత్త ఆదర్శ అధ్యాయం.
జననం
మందుముల నరసింగరావు 1897 సం|| మార్చి17న తన మాతామహుల ఊరైన ఇప్పటి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జన్మించారు. కాని మందుముల స్వంత గ్రామం తలకొండపల్లి. ఇది అప్పటి మహబూబునగర్ జిల్లా కల్వకుర్తి తాలూకాలోని గ్రామం. రామబాయమ్మ, వెంకట నరసింహారావు దంపతులకు పుట్టిన రెండో కొడుకే నరసింగరావు. ఇతని తమ్ముడైన మందుముల రామచంద్రరావు కూడా స్వాతంత్య్రం కొరకు ఉద్యమంలో పాల్గొన్నారు.
విద్యాభ్యాసం
తలకొండపల్లి గ్రామంలో చదువుకోవడానికి పాఠశాల లేకపోవడం మూలాన నరసింగరావుకు చదువు నేర్పించుటకు తన తండ్రి, లక్ష్మారాజు అనే బడి పంతులును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మహమ్మద్ హుసేన్ అనే మహమ్మదీయ పంతులును నియమించారు. తెలుగులో ఆ రోజుల్లో గుణింతాలు, యెరుసులు నేర్చుకుంటే ఒక తరగతి చదివినట్టే. ఇలా తెలుగు నేర్చుకున్నాక ఆయన తండ్రి అన్య భాషల (ఉర్దూ, పారశీ) విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేసి రజా అలీ, షరీపుద్దీన్లను నియమించారు. ఆ రోజుల్లో ఉర్దూ, పారశీ చదవడం నాటి సాంఘిక పరిస్థితుల దృష్ట్యా పరిపాటిగా ఉండేది. ఆ పిదప కొంత కాలానికి హైదరాబాదు వచ్చి చార్మినార్ సమీపంలోని కాల్ కమాన్ దారుల్ ఉలుం హైస్కూలులో చేరారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నిర్వహించే 'మునిషీ' పరీక్ష రాయడానికి 1915లో లాహోర్ వెళ్ళారు.
ఉద్యమం
హైదరాబాదులో జాతీయోద్యమ బీజాలు నాటడంలో కృషి చేసిన మహనీయులు మందుముల. 1916 సం|| లో వామన్ నాయక్ అధ్యక్షతన స్థాపించబడిన ానyసవతీabaస yశీబఅస్త్ర ఎవఅ్ణర బఅఱశీఅ్ణకు బూర్గుల రామకృష్ణారావు తర్వాత కార్యదర్శిగా పనిచేశారు. 1920 సం|| డిసెంబర్ నాగపూర్లో 'విజయ రాఘవచారి' అధ్యక్షతన కాంగ్రెసు మహాసభలు జరిగాయి. ఈ మహాసభలకు వెళ్లుటకు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ తరపున ఎన్నుకోబడిన ప్రతినిధుల్లో మందుముల నరసింగరావు కూడా ఉన్నారు. ఇలా ఎన్నుకోబడ్డ వారంతా వామన్ నాయక్ నాయకత్వంలో నాగపూర్ వెళ్లారు. హైదరాబాదు రాజకీయ ఉద్యమంలో ముఖ్యంగా ఆంధ్ర మహాసభ చరిత్రలో మైలురాయి అనదగ్గ సమావేశం నిజామాబాదులో జరిగిన ఆరవ ఆంధ్రమహాసభ. ఈ సభకు మందుముల నరసింగరావు అధ్యక్షుడిగా వ్యహరించారు. తొలిసారి బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన కావాలని ఈ సభలో తీర్మానించడం విశేషం.
నాటి నిరంకుశ ప్రభుత్వంలో సభా నిర్వహణ, వాక్ స్వాతంత్య్రం కరువు కావడంతో ప్రజలను చైతన్యం చేసే మార్గం ఒక్కటే ఉండేది. అది కూడా స్వల్ప ఆంక్షలతో ఉండేది. అదే పత్రికా నిర్వహణ. ఈ పత్రికలు అక్షర సువాసననెరిగిన ప్రతి ఒక్కరిని కొంత మేరకైన జాగృతం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పత్రికా నిర్వహణలో ఎలాంటి అనుభవం లేకపోయినా స్వంతంగా పలువురి పెద్దల ప్రోత్సాహంతో మందుముల 1927లో 'రయ్యత్' అనే ఉర్దూ వార పత్రికను స్థాపించారు. కానీ అనతి కాలంలోనే పత్రికా లక్ష్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1929లో పత్రికను నిషేధించింది. నిషేధం విధించినా కొన్ని షరతులతో మళ్ళీ 1932 జూలైలో పత్రిక పునఃప్రారంభమైంది. అనంతరం నాటి ప్రముఖుల సహకారంతో ఈ పత్రిక 1941 జూన్ 26న దినపత్రికగా మారింది. ఈ పత్రిక ప్రభుత్వ విధానాలను, ప్రజా పాలనలో అమలుపరిచే విపరీత పోకడలను నిర్భయంగా రాసి ప్రజలను జాగ్రత్త పరిచి జాగరూకుల్ని చేసేది. 1921 నవంబర్12న జరిగిన సంఘ సంస్కరణ మహాసభ ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర జనసంఘంనకు అధ్యక్షులుగా బారిష్టర్ ఆర్. రాజగోపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా మందుముల నరసింగరావు ఎన్నుకోబడ్డారు.
పదవులు
ల్యాండ్ కమీషన్ చైర్మన్గా, యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానం బోర్డు అధ్యక్షుడిగా, హైదరాబాదు రాష్ట్ర పత్రికా రచయితల సంఘం ప్రథమ అధ్యక్షుడిగా, భారత సేవక సమాజ అధ్యక్షుడిగా పలు హోదాల్లో పని చేశారు. నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్యల మంత్రి వర్గంలో 1950-62 వరకు హోం మంత్రిగా, రోడ్లు భవనాల శాఖామాత్యులుగా ఉన్నారు. ఈ విధంగా రాజకీయంగా, సామాజికంగా, చట్టసభల సభ్యుడిగా, పలు సంఘాలకు అధ్యక్షుడిగా గౌరవాన్ని పొందిన మందుముల తన జీవితంలోని అనుభవాల సారాంశాన్ని '50 సం||రాల హైదరాబాదు' అనే ఆత్మకథగా హైదరాబాదు రాష్ట్ర వైశిష్ట్యాన్ని లిఖిస్తున్న క్రమంలో మార్చి 12, 1976న అమరులయ్యారు.
- ఘనపురం సుదర్శన్, 9000470542