Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవదాసిల చెర, ఓ మహంతి ఆధీనంలో ఉంటుంది. ఆ మహంతి ఎప్పుడు ఎవరి పొందు కావాలంటే అందుకు మౌనంగా దేవదాసీలు అంగీకరించాలి. ఓ సారి ఓ చిన్నారి బాలికను మహంతి కోరడంతో రూసి దానిని అడ్టుకుంటుంది. మహంతి ఆగ్రహోద్యగుడై గొడ్డును బాదినట్టు రూసీని కొడ్తడు. కోపం చల్లారక ఆమెపై అందరూ చూస్తుండగానే మూత్రం పోస్తాడు.ఇది తెలుసుకున్న శ్యామ్ మహంతిని అందరి సమక్షంలో శిక్షిస్తాడు. ఆడది ఎవరికీ బానిసకాదు. ఆ దేవునికి కూడా అంటూ అతని ఆయువుపట్టును దెబ్బతీస్తాడు.
అరవైయవ దశకంలో వచ్చిన మూగమనసులు చిత్రం (నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఆదుర్తి, ఆత్రేయ) పునర్జన్మ అంశంపైనే నిర్మించబడి భారీ విజయాన్ని సాధించింది.
ఎప్పటికైనా నేను నీ చేతిలోనే చస్తా' అన్న చిలిపిమాటల గౌరి (జమున) పండుముసలై మరుజన్మలో పుట్టిన హీరో అక్కినేని ఒడిలో మరణిస్తుంది. ఇక్కడ కూడా వృద్ధురాలైన రూసీ (సాయిపల్లవి) మరు జన్మ హీరో నాని చేతిలో మరణిస్తుంది. శాస్త్రం తెలియని సెంటిమెంటల్ వారిని ఈ దృశ్యాలు గుండెలు బరువెక్కిస్తాయి.
ఇక కథ విషయానికి వస్తే.... శ్యామ్‌సింగరారు ఓ బెంగాలీ అభ్యుదయ రచయిత. సకల వివక్షతలను కూకటివేళ్ళతో పెకిలించాలని కోరుకుంటాడు. తిరుగుబాటు స్వభావం కలవాడు.
1969లో అక్కడ నక్సల్భరీ ఉద్యమం పుట్టేనాటికి అతనో వామపక్ష యువకుడు. ''తూటా ఒకరికే సమాధానం చేప్తుంది కానీ అక్షరం లక్ష మెదళ్ళను కదిలిస్తుంది' అని ఆ పంధాను విడనాడుతాడు. స్వగ్రామంలో బావి నీళ్ళు దళితులకు దక్కేలా చేస్తాడు. నడిచే నేలకు, పీల్చే గాలికి కులం లేదని అంటూ అగ్రవర్ణాల దుర్మా ర్గాలను ప్రశ్నిస్తాడు.
అగ్రవర్ణంలో పుట్టిన శ్యామ్ ఇంట్లో వారికి తల నొప్పిగా మారతాడు. ఘర్షణ పడలేక ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. దేవి నవరాత్రుల సమయం గనుక, ఆ సందర్భంలో జరిగిన దేవదాసిల నృత్యం చూస్తాడు. ఓ దేవదాసి 'రూసి' (సాయిపల్లవి) ప్రేమలో పడ్తాడు. ప్రతి రోజు రాత్రి ఆ చెర నుంచి బయటకు వచ్చిన ఆమెకు లోకం అందాలను చూపుతాడు. ఆమె అప్పుడు అనంతమైన స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతుంది. శ్యామ్ సన్నిధిలో సేదతీరుతూ అతని మాటలతో జాగృతమవుతుంది. తాను తనలాంటి వాళ్ళు తరతరాలుగా ఎలాంటి నరకకూపంలో ఉన్నారో తెలుసుకుంటుంది.
ఈ దేవదాసిల చెర, ఓ మహంతి ఆధీనంలో ఉంటుంది. ఆ మహంతి ఎప్పుడు ఎవరి పొందు కావాలంటే అందుకు మౌనంగా దేవదాసీలు అంగీకరించాలి. ఓ సారి ఓ చిన్నారి బాలికను మహంతి కోరడంతో రూసి దానిని అడ్టుకుంటుంది. మహంతి ఆగ్రహోద్యగుడై గొడ్డును బాదినట్టు రూసీని కొడ్తడు. కోపం చల్లారక ఆమెపై అందరూ చూస్తుండగానే మూత్రం పోస్తాడు.
ఇది తెలుసుకున్న శ్యామ్, మహంతిని అందరి సమక్షంలో శిక్షిస్తాడు. ఆడది ఎవరికీ బానిసకాదు. ఆ దేవునికి కూడా అంటూ అతని ఆయువుపట్టును దెబ్బతీస్తాడు.
అక్కడి నుంచి ఇరువురు కలకత్తాకు వచ్చి చిన్న ప్రెస్‌లో ఉద్యోగం చేస్తు గొప్ప రచయితగా ఎదుగుతాడు. తనకు వచ్చే ధనంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి రూసి సలహా మేరకు, ప్రభుత్వ సాయంతో దేవదాసి పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తాడు.
ఈ పరిణామం తర్వాత శ్యామ్ కుటుంబం ఊరిలో ఏకాకి అవుతుంది. తమ పరువు ప్రతిష్టలు శ్యామ్ మంట కలిపాడని వారు తలపోస్తారు. దీనికి విరుగుడు శ్యామ్ ఆ దేవదాసినైనా విడనాడాలి. లేదా శ్యామ్ అంతమై పోవాలని భావిస్తారు. శ్యామ్ సహజంగానే తన ప్రియురాలు రూసిని విడనాడనని చెప్పడంతో సొంత అన్నలే శ్యామ్‌ను క్రూరంగా హత్య చేస్తారు.
హతుడైన శ్యామ్ ఈ జన్మలో ఫిల్మ్‌మేకర్‌గా అవతారమెత్తు తాడు. శ్యామ్సింగర్ మెదడులో ఏ కథలైతే ఉద్భయించాయో అవే కథలు, సంఘటనలు ఇతనికి స్ఫూరణకు వస్తాయి. వాటినే చిత్రాలుగా మలుస్తాడు.
మా శ్యామ్ రాసిన బెంగాలీ నవలలు, కథలనే ఇప్పటి హీరో (నాని) చిత్రాలుగా తీస్తున్నాడని శ్యామ్ అన్నల బిడ్డలు కాపీరైట్ కేస్ వేయడంతో కథ మొదటికొస్తుంది.
చిత్రంలో రచయిత శ్యామ్ పాత్ర మాటలు సరళంగా, సూటిగా ఉంటూ తూటాల్లా పేల్చాయి. 'దేవాలయాల మాటున దేవదాసీకాంతుల చీకటి బతుకులు' జాలికొల్పుతాయి. కథలోనే హింసా, భీభత్సం ఉన్నది. హీరోయిజం దానికి తోడవుతుంది. అశ్లీలత కానరాదు.
కానీ... ఆధునిక పెట్టుబడిదారీ సంస్కృతి - ఆడపిల్ల స్మోక్ చేయడం, అకేషనల్‌గా మందు కొట్టడం, పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్స్‌కు వెళ్ళడం తప్పు కాదనే భావన కొందర్ని ఇబ్బంది పెడ్తుంది.
అయినా ఒక సామాజిక సమస్యను తీసుకొని అల్లిన కథ, నేటి వాస్తవికతకు అద్దం పడుతుంది. అభ్యుదయ భావాలు ఆచరణను చర్చకు తీసుకురావటం ఆహ్వానించే విషయం.
- కె. శాంతారావు, 9959745923