Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువతీయువకులారా! మీ బెడ్ రూమే మీ ఆఫీసు కాగలదు, మీ మంచమే మీ కుర్చీగా మారగలదు, మీ కంప్యూటర్ డెస్కే మీ బీరువా అయిపోగలదు.మీరు సర్వ స్వతంత్రులు,మీరు పూరా పనిమంతులు,మీరు బెస్ట్ కమ్యూనికేటర్స్.ఇవాళ మీరు ఔనన్నా కాదన్నా ఇంటి నుంచే ఉద్యోగం చేయడం కళ్లముందున్న వాస్తవం. ఇంకేం సిద్ధం కండి
"We like to give people the freedom to work where they want,safe in the knowledge that they have drive and expertise to perform excellently, whether they (are) at their desk or in their kitchen.Yours truly has never worked out of an office,and never will."
- Richard Branson
ఉద్యోగి వేళకు ఆఫీసుకు రాకపోయినా, వచ్చి సరిగ్గా పనిచేయకపోయినా వెంటనే అక్కడి అధికారి నోటి నుంఎతీ వినిపించే హెచ్చరిక
''ఏం తమాషా చేస్తున్నావా! చేత కాకపోతే ఇంట్లో కూర్చో'' అని. ఆఫీసర్ మాటను ఎంతకీ చెవిన పెట్టకపోతే ఆ ఉద్యోగికి షోకాజ్, తదుపరి సెన్స్యూర్, ఆ తర్వాత సస్పెన్షన్, మితిమీరితే ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇది ఇప్పటి దాకా కొనసాగిన పద్ధతి. టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ గమనాన్ని మూలంగా మార్చేసింది.ఎంప్లారు మెంట్ Ê జాబ్ వర్క్‌లో విప్లవాత్మక విధానాలు అనుసంధానింపబడ్డాయి. కార్యాలయాల కంప్యూటరీకరణ, ఆటోమేషన్తో ఆయా ఉద్యోగులకు లాప్టాప్, టాబ్లెట్, స్మార్ట్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్లు వైఫై సౌకర్యం కల్పించడం ద్వారా 'వర్క్ ఫ్రం హోం 'ఉపాధి విధానం ప్రపంచం నలుమూలలకు విస్తరించింది.వృత్తి నైపుణ్యాలున్న వాళ్లందరికీ 24/7 ప్రపంచ వ్యాప్తంగా సర్వీస్ సెక్టార్లో పనిచేసే అవకాశం ఉత్సావంతుల తలుపు తట్టింది. ఇందులో భాగంగానే ఇంటి నుంచే పనిచేసుకునే ఉపాధి వనరులు వర్క్ ఫోర్స్‌కు అందివచ్చాయి. విశ్వవ్యాప్తంగా ఉద్యోగుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు వర్క్ ఫ్రం హోం సిస్టమ్‌లో పనిచేస్తున్నారు. మున్ముందు ఈ అవకాశాలు ఇంకా నాలుగింతలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో 'వర్క్ ఫ్రం హోం 'విధానానికి సంబంధించిన 'ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం (Job Characteristics Theory) సేవల రంగాన్ని ప్రభావితం చేసింది. మెరుగైన సేవల ద్వారా వ్యక్తిగతంగా ఆకర్షణీయమైన వేతనం అందుకోవడమే కాకుండా, వర్క్ కల్చర్ ద్వారా సామాజిక సంపదను అధికమొత్తంలో ఎట్లా సృష్టించవచ్చునో కాపాడవచ్చునో యువ ఉద్యోగులు (యంగ్ ప్రొఫెషనల్స్) ఈ ఉద్యోగం లక్షణాల సిద్ధాంతం ద్వారా తెలుసుకోవచ్చు. కార్యాలయానికో, కర్మాగారానికో, వృత్తి స్థలానికో ప్రయాణించే సమయాన్ని కూడా పనిగా భావించ కూడదంటున్న"Work is something you do,not a place you go" అని అంటారు ఐ.టి నిపుణుడు స్కాట్ మెక్కూల్. ఈ సూచనను యంగ్ ప్రొఫెషనల్స్ జ్ఞాపకం పెట్టుకొని ఆఫీసు ప్రయాణాల అవసరం లేకుండానే జర్నీ టైం ను సైతం ప్రొడక్టివ్ టైంగా మార్చుకోడానికి వర్క్ ఫ్రం హోం వీలుకల్పిస్తుంది. సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సందర్భంలో ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం ఇంట్లో నుంచే విధులు నిర్వహించే కార్యక్రమాన్ని మరింత సులభతరం చేస్తుంది.
ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం (జీజు) ప్రధానంగా ఉద్యోగి ఐదు సామర్ధ్యాలు 1.నైపుణ్య వైవిధ్యం (Skill Variety) 2.పని గుర్తింపు (Task Identity) 3.పని ప్రాముఖ్యత (Task Significance) 4.స్వయం ప్రతిపత్తి (Autonomy) 5.ప్రతిపుష్టి (Feed Back)లను గమనంలో ఉంచుకొని రూపొందించబడింది. ప్రత్యక్ష కార్యాలయ ఉద్యోగ నిర్వహణలో సహజంగా తలెత్తే అనుపస్థితి, ఆలస్యం, అశ్రద్ధ, కాలయాపన, వాయిదా, సహోద్యోగుల మధ్య ఈర్ష్యా ద్వేషాలతో కూడిన అవాంఛితపోటీ వంటి అవలక్షణాలకు తావులేకుండా సంస్థలు తమకు కావలసిన ఇతోధిక సేవలను ఉద్యోగుల నుంచి పొందడానికి వీలుగా 'ఇంటి నుంచే ఉద్యోగం (WFH) చేసే విధానాన్ని అనుమతించి అనుసరిస్తున్నాయి.
దూరభారం, పని వేళలు, మేనేజ్మెంట్ మేనియా, అన్న పానీయాలు, పౌర ఒత్తిడి ఇత్యాది సమస్యలకు దూరంగా స్వేచ్ఛగా సృజనాత్మకంగా ఎవరి పని వాళ్లు సామర్థ్యం మేరకు సంతృప్తిగా చేసుకోవడానికి 'వర్క్ ఫ్రంమ్ హోం' ఉద్యోగం విధానం తమకు కలిసి వచ్చిన గొప్ప అవకాశంగా ఈ తరం యువత భావిస్తోంది. వ్యక్తిత్వ వికాస విద్యలో 2020 'వ్యక్తి మెరుగుదల యుగం (Age of Improving ourselves) ఆరంభ సంవత్సరంగా ప్రకటించబడిన నేపథ్యంలో యువత తమ మెంటల్ హెల్త్ , ఫిజికల్ ఫిట్ నెస్‌ను కాపాడుకుంటూ,సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, సామాజిక సంబంధాలను ధృఢ పరచుకుంటూ, వృత్తి-ప్రవృత్తి రంగాల్లో రాణించడానికి వర్క్ ఫ్రం హోం సంప్రదాయం ఉద్యోగం కంటే సౌకర్యవంతమైందని కార్పొరేట్ సెక్టార్ కూడి అంగీకరిస్తుంది.ఇప్పటి వరకు అమలులో ఉన్న Office From wrok లోగల Rat Race నుంచి సమర్ధవంతులు బయటపడి ఉత్సాహంగా సమృద్ధికరంగా మారేందుకు ప్రోత్సాహకాలు అందుతు న్నాయి. ప్రముఖ వాస్తుశిల్పి గౌతమ్ భాటియా చెపుతున్నట్టు "Once large
companies realised that profits and
company morals when employees didn't need to be present at all,work rom home not only made sense but introduced to level of useful lethargy that was missing in the presence of an intimidating boss." అనే అభిప్రాయంతో కొత్తతరం ఏకీభవిస్తాను.అధికారులు కల్పించే భయభ్రాంతులేవీ లేకుండగా శీజూవఅ శీటళషవ ద్వారా జరిగే కార్యకలాపలన్నిటినీ ష్ట్రశీఎవ శీటళషవ నడపగలగడం ఉద్యోరంగంలో వచ్చిన పరిణామంగా పారిశ్రామిక వేత్తలు సైతం గుర్తించారు.
ఇంటి నుంచి పనిచేయడాన్నే 'టెలీకమ్మ్యూటింగ్, టెలీవర్క్, మొబైల్వర్క్, రిమోట్ వర్క్, ఫ్లెక్జిబిల్ వర్క్' అని కూడా అంటారు.ఈ పదాల రూపకర్త జాక్ నిల్లేస్. కాలిఫోర్నియాకు చెందిన ఈయన మంచి రాకెట్ శాస్త్రవేత్త.1973 ప్రాంతంలో టెలివర్కర్ పరిభాషను వాడుకలోకి తెచ్చిన జాక్ నిల్లేస్ను 'ఫాదర్ ఆఫ్ టెలీవర్కింగ్గా పిలుస్తారు. ఈయన ఈ రంగాన్ని సంపద్వంతం చేయడానికి JALA international సంస్థను స్థాపించారు. టెలీవర్కింగ్పై'Managing Tele working',Making Telecommuting మొదలైన రచనలు చేశారు.పని పునః కల్పనకు సంబంధించి 1960ల ప్రాంతం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలు, శిక్షణా కార్యక్రమాలు మొదలైనప్పటికి1975లో ఇల్లినాయిస్కు చెందిన మేనేజ్మెంట్ రంగ నిపుణులు గ్రెగ్ ఆర్.ఓల్ధామ్, జె.రిచర్డ్ హాక్మెన్లు సంయుక్తంగా రూపొందించిన' ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం 'బహుళంగా వ్యాప్తిలోకి వచ్చింది. సరళతరమైన పని విధానం ద్వారా సర్వోత్కృష్టమైన ఉత్పాదకతే లక్ష్యంగా ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం వృత్తిదారులకూ ఉద్యోగ సమాజాలకూ ఎంతగానో ఉపకరిస్తుంది. అర్థవంతమైన పని అనుభవం, బాధ్యతాయుతమైన పని అనుభవం,ఫలదాయకమైన పనిజ్ఞానం అనే త్రిముఖ మానసిక శాస్త్రవ్యూహాన్ని అనుసరించి వృత్తి ఉద్యోగాల నిర్వహణలో ప్రభావితాంశాలైన ప్రేరణ (Motivation), సంతృప్తి (Satisfaction) పనితీరు (Performance) అనుపస్థితిత్వం (Absenteeism) మరియు వార్షికాదాయం (Turnover) అనే ఐదింటిని సానుకూలంగా మలుచుకోడాన్ని ఉద్యోగ లక్షణాల సిద్ధాంతం వివరిస్తుంది. ఇందుకు ఓల్ధామ్ & హాక్మన్లు రాసిన గ్రంథం యువతకు వర్క్ ఫ్రం హోం గురించి ఎన్నో మెళకువలు చెపుతుంది.
మెట్రిక్యులేషన్ ఆపై విద్యార్హతలు కలిగి అభివృద్ధి నైపుణ్యాలుగా పేర్కొన బడిన 'నైపుణ్యం 'Work Redesign' (Skill),ప్రమాణం (Scale), వేగం (Speed)లను అంది పుచ్చుకున్న యువతీయువకు లెవరైనా తమ ఇంటి నుండే ఉద్యోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా మెడికల్ Ê హెల్త్, కంప్యూటర్ & ఐటి, కస్టమర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ & ట్రైనింగ్, సేల్స్, ఎకౌంటింగ్ Ê ఫైనాన్స్ రంగాలు వర్క్ ఫ్రం హోం ఉద్యోగావకాశాలను విరివిగా కల్పిస్తున్నాయి. వీటిల్లో డేటా ఎంట్రీ, డాక్యుమెంటేషన్, ప్రూఫ్ రీడింగ్, టైపింగ్, పెయిడ్ సర్వే, లోగో డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, స్ప్రెడ్ షీట్ ఎంట్రీ, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్,ఆన్ లైన్ అడ్వర్టైజ్ మెంట్, వర్డ్ ప్రెస్ డెవలపర్, కాంటెంట్ డెవలెపర్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేషన్, రిక్రూటర్, కాల్ సెంటర్ అసోసియేట్స్, లేబరర్, సప్లయర్,ఆన్ లైన్ టీచింగ్ Ê మెంటరింగ్, కాపీ స్ట్రేటజిస్ట్, లోన్ ప్రొవైడర్, పేమెంట్స్ Ê కలెక్షన్స్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, టూర్ గైడ్ తదితర ఉద్యోగాల ద్వారా అభిరుచి చొరవలను బట్టి రోజుకు యాభై నుంచి వంద డాలర్లు అంటే మూడు నుంచి ఏడువేల రూపాయలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. తాము నివసించే హోమ్ టౌన్ మొదలు దేశ విదేశాలకు చెందిన కంపెనీలలో అభ్యర్థులు గంటలు,రోజులు, వారాలు, నెలల లెక్కన ప్యాకేజీల్లో పని చేయవచ్చు. గ్లోబల్ కంపెనీలైన VipLid, TTEC, DELL, Hopper, Kelly Services, Intuit,United Health Group, Aenta, Kplan, Board Path Health Care Services ,WSI, K12, BCD travel, Hartford,Appen,Meeshow,LionBridge, Amazon,Syker,Human,Liveops,GitLab,Invitae,Hi bu,Thermofisher,CACI international లాంటి వందకు పైచిలుకు సంస్థలు యువతకు విస్తృతమైన ఉపాధివనరులను కల్పిస్తున్నాయి.కుటంబంతో ఉంటూ, ఇంటిఖర్చులను పొదుపు చేసుకొని, ప్రయాణం, ట్రాఫిక్ సమస్యకు దూరంగా, సౌకర్యవంతంగా ఉత్పాదకతా సామర్థ్యానికి పదునుపెడుతూ,స్వచ్ఛగా ,ముఖ్యంగా వొత్తిడి కి దూరంగా పనిచేసే వ్యవస్థగా ప్యాషన్‌తో క్రియేటివ్ టచ్ తో పనిచేసే యంగ్ ప్రొఫెషనల్స్ కోసం 'వర్క్ ఫ్రం హోం' వినూత్న ద్వారాలను తెరచివుంచింది. మన దేశంలోని ముంబై, ఢిల్లీ,కలకత్తా, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్,జైపూర్,పూణే, విశాఖపట్నం, సూరత్ వంటి ముఖ్య మహానగరాల్లో మునుపెన్నడూ లేనివిధంగా వర్క్ ఫ్రం హోం కు ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారు.
'జెడ్' తరం యువతీయువకులారా! మీ బెడ్ రూమే మీ ఆఫీసు కాగలదు, మీ మంచమే మీ కుర్చీగా మారగలదు, మీ కంప్యూటర్ డెస్కే మీ బీరువా అయిపోగలదు.మీరు సర్వ స్వతంత్రులు,మీరు పూరా పనిమంతులు,మీరు బెస్ట్ కమ్యూనికేటర్స్.ఇవాళ మీరు ఔనన్నా కాదన్నా ఇంటి నుంచే ఉద్యోగం చేయడం కళ్లముందున్న వాస్తవం.ఇంకేం సిద్ధం కండి
-డా|| బెల్లి యాదయ్య, 98483 92690