Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యలమర్తి అనూరాధ కవితా సంపుటిలో ప్రతి కవితా ఆలోచింప చేసేలా ఉన్నాయి.
ఇంటి పెద్ద మరణిస్తే ..
'కుర్చీ కళ్ళ నీళ్లు పెట్టుకుంది'-
'సంప్రదాయం అటకెక్కి దిక్కులు చూస్తోంది'-
'అనుబంధాల సవ్వడి వినిపించడం మానేసింది' ..
అని 'ఎద సవ్వడి'గా చెప్పడం బావుంది.
'స్నేహ ప్రయాణం 'కవితలో ప్రశ్నిస్తున్నట్టుగానే వున్నా - స్నేహాన్ని కడదాకా ఎలా నిలుపుకోవాలో .. ఆచర ణాత్మకంగా సూచించారు.
'ఎన్నటికీ చిరంజీవిగానే' అని సినారెని ప్రస్తుతిస్తూ -'సదా లోకులను మంచి వ్యక్తులుగా మార్చు!' అని శ్రీ వేంకటేశ్వరుడిని కోరడం -
'వ్యక్తిత్వాన్ని కొలిచే ధర్మామీటర్ అని 'అక్షరాన్నీ', 'కష్టాన్నంతా తన మీద వేసుకుంటూ వెచ్చదనం నీ సొంతం చేస్తుంది' అంటూ 'రెయిన్ కోట్ ' నీ నిర్వచించడం బావుంది !
అమ్మా నాన్నల గురించి, స్త్రీ తత్వం గురించీ, ప్రకృతి గురించీ బాగా చెప్పారు.
'జనాలతో పెట్టుకోకు !' వ్యంగ్యోక్తులతో కూడిన కవిత!
తన భావనాశక్తిని అందంగా, కవితాత్మకంగా ప్రదర్శించగలిగే సత్తావున్న కవయిత్రి యలమర్తి అనూరాధ గారిని అభినందిస్తున్నాను .
- డా|| అమృతలత