Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్తువులనే వాడాలనే వాదం లేచింది. ఈ ఉద్యమం మద్రాసు యువకులను ఆకర్షించింది. దీంతో అక్కడి ఉద్యమకారులకు మద్దతుగా చైతన్యం గల్గిన కొందరు యువకులు పెద్ద సభ నిర్వహించాలని తలిచారు. వారిలో కొమర్రాజు కూడా ఒకరు. ఇదే సమయంలో దేశ స్వాతంత్య్రాన్ని కోరుతూ ర్యాలీలు దీస్తున్న క్రమంలో ఉద్యమ ప్రోత్సాహానికి నగదు అవసరమని తలిచి నిధి వసూలు చేపట్టి దానికి 'దీపావళి జాతీయ నిధి' అని పేరు పెట్టి ఉద్యమాన్ని సాగించారు.
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తిమిర తెలంగాణలో వెలిగిన ప్రమిద. కాలికి పెన్ను కట్టుకొని బాధ్యతను భుజాలకెత్తుకొని నిజాం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు ఆలోచించారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక సంపదను వెతకడానికి ఎన్ని చీకటి పేజీల గోడలను వెలికి తీసారో ఒక ప్రాంత వైభవం ఆ ప్రాంతంలో ఏర్పడిన గ్రంథాలయంలోనే ఉంటుందని విశ్వసించి గ్రంథాలయాల స్థాపనను ఉద్యమంలా చేపట్టారు. ఎక్కడో కన్ను తెరిచి, మరెక్కడో పెన్ను పట్టి, ఎప్పుడూ వెన్ను తిప్పక ముందుకెళ్ళిన వైతాళికుడు. కొమర్రాజు లక్ష్మణరావు- వెంకటప్పయ్య, గంగమ్మలకు మే,18, 1877 కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. లక్ష్మణరావు పుట్టిన కొన్నేండ్లకే తండ్రి పోవడంతో మేనమామ అయిన మాధవరావు దగ్గరికి భోనగిరికి వెళ్ళారు. అక్కడే ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. కొన్నాళ్ళకు నాగపూరులో ఉన్న మరో మేనమామ దగ్గరికి పోవడంతో నాగపూరులో ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.
అనంతరం 'జ్ఞాన విస్తార్' పత్రి కకు సహాయ సంపాదకత్వం వహించారు. ఆ తర్వాత 1897లో మాధ్యమిక విద్య పూర్తి చేసి మారిస్ కాలేజీలోనే బి.ఏలో చేరారు. 1900లో ఎం.ఏ కోసం కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరారు. ఇలా పుట్టిన చోటును కాదని పరిస్థితుల ప్రభావం దృష్ట్యా వేరు వేరు ప్రాంతాలలో చదువుకొని, అక్కడి స్థానిక సంఘటనలను గమనించి జీవిస్తున్న సమాజంపై ఒక అవగాహనను ఏర్పరచుకున్నారు.
తన భర్త దివానుగా పనిచేసిన మునగాలలోనే కొడుకును దివానుగా చూడాలని కలలుగన్న తల్లి ఆశయాల్ని సార్థకం చేశారు. 1910 నాటికి తెలుగు భాష పలు వాదాలతో కుతకుతలాడుతుంది. ఏ భాషా వాదంలో రాస్తే సాహిత్యం ప్రజా వాహినికి చేరువవుతుందనే అంశంపై ఎవరి వాదనలో వాళ్ళు ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో కొమర్రాజు మాత్రం గ్రాంథిక భాషా వాదాన్ని సమర్థించి ఆ వైపే నిలబడ్డాడు. పైగా ఈ వాద విషయంలో తుది తీర్పు చెప్పడానికి మద్రాస్ ప్రభుత్వం వేసిన భాషా వ్యవహారిక కమిటీలో లక్ష్మణరావు సభ్యుడిగా ఉన్నారు. లక్ష్మణరావు జీవితంలో హాస్యాత్మక ఘటన ఒకటి జరిగింది. వడ్డాది సుబ్బారాయుడు 'సతీస్మృతీ' అనే పద్య కావ్యం రాశారు. దానిని చదివి ప్రేరణ పొందిన లక్ష్మణరావు మరాఠిలో ఒక కవితను రాశారు. దానిని చదివిన పాఠకులు, కవికి చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చెనని చాలా మంది ఆయనను పరామర్శించుటకు వచ్చారు. దాంతో అతను మళ్ళీ కవిత్వం జోలికే పోలేదట.
ఉద్యమం: 1905 లో బెంగాల్ విభజనను ప్రతి ఘటిస్తూ దేశంలో కొన్ని చోట్ల నిరసనలు జరిగాయి. దీనిలో విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్తువులనే వాడాలనే వాదం లేచింది. ఈ ఉద్యమం మద్రాసు యువకులను ఆకర్షించింది. దీంతో అక్కడి ఉద్యమకారులకు మద్దతుగా చైతన్యం గల్గిన కొందరు యువకులు పెద్ద సభ నిర్వహించాలని తలిచారు. వారిలో కొమర్రాజు కూడా ఒకరు. ఇదే సమయంలో దేశ స్వాతంత్య్రాన్ని కోరుతూ ర్యాలీలు దీస్తున్న క్రమంలో ఉద్యమ ప్రోత్సాహానికి నగదు అవసరమని తలిచి నిధి వసూలు చేపట్టి దానికి 'దీపావళి జాతీయ నిధి' అని పేరు పెట్టి ఉద్యమాన్ని సాగించారు. ఇలా ఉద్యమానికి సహాయంగా చేపట్టిన నిధి సేకరణలో లక్ష్మణరావూ ఉన్నారు. 1907లో స్వదేశీ ఉద్యమ ఆకాంక్షను దేశమంతటా తెలియ చెప్పడానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటన చేశారు. ఈ సందర్భంగా చంద్ర పాల్ పర్యటన బాధ్యతను మునగాల రాజా నాయని వెంకట రంగారావు లక్ష్మణరావు సూచనల మేరకు చూశారు. 1907లో నందిగామలో రాజకీయ మహాసభలు జరిగాయి. ఆ సభలకు ఆహ్వాన సంఘ కార్యదర్శిగా లక్ష్మణరావు ఉన్నారు.
రచనలు: శివాజీ చరిత్ర, హైందవ వీరులు, హిందూ మహాయుగం, మహమ్మదీయ మహాయుగం వంటి గ్రంథాలు అందించారు. ఆంధ్రజన సంఘానికి అనుబంధంగా 1922లో కొమర్రాజు లక్ష్మణరావు పరిశోధక మండలిని ఏర్పాటు చేశారు. కొమర్రాజు వాద, వివాదాలకు పోకుండా ఏ విషయం పట్ల అయిన సందేహం అనిపిస్తే ఆ అంశాలను ఆయన మారు పేరుతో రాశారు. అలా పత్రికల్లో కె. రామారావు పేరుతో అనేక చర్చలను ఆరంభించేవారు.
ఈ విధంగా తెలుగు నేలపై వెలిసిన ఒక మహా వైతాళికుడు 1923 జూలై, 13 నాడు 46వ యేట అకాల మరణం చెందారు. దీంతో 1931లో పరిశోధక మండలి 'లక్ష్మణరాయ పరిశోధక మండలి'గా మార్చబడింది.
- ఘనపురం సుదర్శన్, 9000470542