Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన సర్వేల ప్రకారం ప్రతి ఏటా 4శాతం నుంచి 59శాతం వరకు కెరీర్ గ్యాప్ నమోదవుతున్నది. కెరీర్ గ్యాప్ ఎదుర్కొంటున్న వాళ్లలో మహిళలు 73శాతం కాగా పురుషులు 47శాతం ఉన్నారు. కారణాలేవైనా కెరీర్ బ్రేక్ ఏర్పడి, గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా యువతీయువకుల ఉపాధికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందుకు కోవిడ్ కూడా ఒక ప్రధాన కారణం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆకస్మికంగా ఉద్యోగాల నుంచి తొలగించబడి జీవనోపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో యావన్మంది యువత పునరుపాధి కొరకు నిరీక్షిస్తున్నారు.
యువతీయువకులు కోర్సులు పూర్తికాగానే తమతమ నైపుణ్యాల మేరకు అందివచ్చిన అవకాశాల మేరకు ఏదో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరిపోతుంటారు. కొంత కాలం పనిచేశాక ఆ ఉద్యోగం మానేస్తారు. మళ్లీ ఉపాధి కోసం ఆయా చోట్లకు రెజ్యూమ్ పట్టుకొని మరోచోట ప్రయత్నిస్తుంటారు. ఉన్న ఉద్యోగం పోయి, మరొకటేదో చేయాలనుకుని అదీ దొరక్క కొందరు అనేక అవస్థలు పడుతుంటారు. కొలువులే దొరకని గడ్డు రోజుల్లో చేస్తున్న ఉద్యోగాన్ని ఎందుకు మానేశారు?
మళ్లా కంపెనీల దారిబట్టి ఎందుకు తిరుగుతున్నారనిపిస్తుంది చూసే వాళ్లెవరికైనా. ఎలాగో అలాగా మళ్లీ పోయిన కంపెనీలోనో, మరొకచోటనో అనేకపాట్లు పడి మళ్లీ ఉద్యోగంలో సంపాదిస్తారు.ఉద్యోగుల మొదటి ఉద్యోగానికీ రెండో ఉద్యోగానికీ మధ్య ఏర్పడిన ఈ అంతరాన్ని లేదా ఖాళీనే 'కెరీర్ గ్యాప్ (Career Gap/Career Break) అంటారు. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్, మోన్ స్టర్ ఇండియా సర్వే-2021 మొదలుకొని వివిధ అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన సర్వేల ప్రకారం ప్రతి ఏటా 4శాతం నుంచి 59శాతం వరకు కెరీర్ గ్యాప్ నమోదవుతున్నది. కెరీర్ గ్యాప్ ఎదుర్కొంటున్న వాళ్లలో మహిళలు 73శాతం కాగా పురుషులు 47శాతం ఉన్నారు. కారణాలేవైనా కెరీర్ బ్రేక్ ఏర్పడి, గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా యువతీయువకుల ఉపాధికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందుకు కోవిడ్ కూడా ఒక ప్రధాన కారణం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆకస్మికంగా ఉద్యోగాల నుంచి తొలగించబడి జీవనోపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో యావన్మంది యువత పునరుపాధి కొరకు నిరీక్షిస్తున్నారు. కొత్త ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు కావాల్సిన 'నైపుణ్యాల పెంపు (Skilling Up)మీద అంతా దృష్టి సారించారు. వీళ్లకు శిక్షణ ఇచ్చేందుకు Tinkerly, NEXT Wave,ZELLEDUCATION, Skil Up India, NSTI లాంటి 'ఎడ్-టెక్ సంస్థలు' ఎన్నో ముందుకొస్తున్నాయి.
వదిలేసిన ఉద్యోగానికీ పునర్ని యామకానికీ మధ్యన
ఉపాధి అవకాశాల మెరుగుదల కొరకు చేసే ప్రయత్నాలను, అధిగమించే ఆక్షేపణలను 'కెరీర్ గ్యాప్ మేనేజ్ మెంట్' అంటారు. నిరాశకు లోను కాకుండా నైపుణ్యాల్లో వర్కింగ్ స్టైల్లో అవసరమైన మార్పులతో నూతనోత్సాహంతో కెరీర్ ను Re-Plan చేసుకోవడమే ఇప్పుడు యువత ముందున్న ప్రధాన కర్తవ్యం.
కెరీర్ కన్సల్టెంట్స్ చెబుతున్న దాని ప్రకారం చూస్తే కెరీర్ గ్యాప్‌కు ముఖ్యంగా రెండు రకాల కారణాలు కనిపిస్తున్నాయి. అవి 1. వ్యక్తిగత కారణాలు (Personal Reasons) 2. వృత్తిగత కారణాలు (Professional) వ్యక్తి గత కారణాల్లో ప్రధానంగా - అనారోగ్యం (ఱశ్రీశ్రీఅవరర) కుటుంబ అత్యవసరాలు ((Family Emergencies),కుటుంబంతో గడపడానికి సమయం లేకపోవడం(Taking time out for family and children), ఉన్నత విద్యకు వెళ్లడం(To further study), సరియైన కెరీర్ ను ఎంచుకోవడం (Find the right career)అనేవి కనిపిస్తున్నాయి.ఇక వృత్తిపరమైన కారణాల్లోకి వెళ్తే- పై అధికారుల వేధింపులు (Fired by the employers),, నిర్వహిస్తున్న హోదా పని వత్తిడితో కూడుకున్నది కావడం (Position was made redundant), క్షేత్ర స్థాయిలో పనిసంస్కృతి-వైరుధ్యాలు (Problems with culture of work place), రెజ్యూమ్‌కు భిన్నమైన పనులు చేయాల్సిరావడం (Hacks to hide employment gap from resume) మొదలైనవి ప్రభావితాంశాలుగా అగుపిస్తున్నాయి.అది ఎంత పెద్ద హోదా అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా ఒక్కసారి నిరాసక్తత ఏర్పడిందంటే అక్కడ పనిచేయడం ఎంతో కష్టం అంటున్నారు అభ్యర్థులు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ మార్కెటింగ్ మొదలగు విషయాల్లో మునపటికంటే మెరుగుపడకపోతే
జాబ్-రిఎంట్రీ అసలు సాధ్యపడదంటున్నారు 'కెరీర్ ఛాలెంజెస్ డ్యూరింగ్ గ్లోబల్ అన్సర్టెనిటి' గ్రంథ కర్త సరబ్జిత్ సింగ్. జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుతూ 'కొత్త నైపుణ్యాలతోనే నూతనోద్యోగాలు లభిస్తాయనే సత్యాన్ని అందరం గ్రహించాలి' అంటాడు. కెరీర్ బ్రేక్ సర్వే-2005 పేర్కొన్నట్టు ఆరు మాసాల నుంచి రెండు సంవత్సరాల వరకు అభ్యర్థులు వ్యవధి తీసుకోవచ్చు. ఇంతకు మించి కెరీర్ బ్రేక్ ఉన్నట్లైతే మళ్లీ స్థిరపడం కష్టమే మరి. ఉత్పత్తి,సేవలు అది ఏ సెక్టార్ అయినా నలభై ఐదేండ్లు దాటినవాళ్లు ఎట్టిపరిస్థితిలోనూ కెరీర్ బ్రేక్ తీసుకోరాదంటున్నారు మేనేజ్మెంట్ రంగ నిపుణులు. ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్య విరామాన్నియూరప్ లో 'అడల్ట్ గ్యాప్ ఇయర్' అని, అమెరికాలో 'సబ్బాటికల్' అంటారు. ఈ సమయంలో అభ్యర్థులందరు దాదాపుగా అనుభవాల మదింపు, నైపుణ్యాల పెంపు పైన్నే దృష్టిసారిస్తారు. వెనుక బడిన దేశాల్లో కెరీర్ గ్యాప్ అనేది ఆగిపోవడం లేదా తిరిగి అదే చేయడం (Stop or U-turn) గా మారిపోయింది. మానవ స్వభావం విషయంలో సామాజిక శాస్త్రవేత్తలు రెండు విషయాల్ని స్పష్టంగా తేల్చి చెబుతారు. అవి.1. సాధారణంగా ప్రజలు హేతుబద్దంగానే ఆలోచిస్తారు, ఆచరిస్తారు, 2.అభిమానం, భయం, ద్వేషం తమను ఆవహించిన సందర్భాల్లో హేతుబద్దతకు ఎడం జరుగుతారు. కెరీర్ ఎంపికకూ, కెరీర్ బ్రెక్కూ లోతుగా ఆలోచిస్తే ఇవే ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి.
కెరీర్ బ్రేక్ వల్ల తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి సంబంధించి మానసిక శాస్త్రవేత్తలు మేనేజ్మెంట్ పండితులు విద్యా కోణంలోఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఈ తరహా పరిశోధనలో న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులుDr.Michael Woodward Exicutive Coaching ప్రసిద్ధుడు. The You Plan:A 5-step guide to Training Charge of Your Career in the New Economy అనే గ్రంథం ఎంతో ఉపయుక్తమైంది.ఈ గ్రంథం ఉద్యోగ జీవితంలో వ్యక్తుల నడవడిని శాస్త్రీయంగా విశ్లేషిస్తుంది. పని లేదా వ్యవహార నిర్వహణలో 1. ప్రమాణాలు (Values), 2.ఆంతర్యాలు (Intrinsics),3.ఆతురత (Passion), 4.సారం లేదా వైయక్తిక ముద్ర (Essence or Personal brand), 5.కార్యాచరణ ప్రణాళిక (Road map) అనే ఐదు అంశాలకుండే ప్రాముఖ్యతను The You Plan విశదీకరిస్తుంది.''అన్నీ మన మంచికే'' అనే ఒక లోకోక్తి మనకు తెలిసిందే.ఇది కెరీర్ బ్రేక్‌కు కూడా అన్వయించుకోవచ్చు. కేరీర్ బ్రేక్ వల్ల వ్యక్తికి కొత్త పర్స్పెక్టివ్ (Gain new perspective), కొత్త నైపుణ్యాలు (Gain new skills),కుటుంబ సంబంధాల పటిష్ఠత(Improve Family relationship), ప్రతికూల పరిసరాల నుంచి వైదొలగడం (Get away from negetive work environment), సామర్థ్యాల పునరంచనా (It can help you reasses your career), లక్ష్యాల మీద పునఃకేంద్రీకరణ (It can help you refocus your goals) అదనపు విద్యాంశాలను అందిపుచ్చుకోవడంYou can engage in extra curricular activities), మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం Look after your mental health), స్వీయ ప్రేరణ పొందడం(Self-motivation),, అనూహ్య ఫలితాల సాధన (It can bring you unexpected results)
మొదలైన ప్రయోజనాలు కెరీర్ గ్యాప్ వల్ల సమకూరతాయని'Half The Sky' అనే కెరీర్ ప్లాట్ ఫాం వెల్లడిస్తోంది.
రామాయణ మహేతిహాసం ఉద్ఘాటిస్తున్నట్టు ''మనోహి హేతుః సర్వేషామింద్రయాణాం ప్రవర్తనే'' సకలేంద్రియాల ప్రవర్తనకు మనస్సే కారణం కనుక మానసిక దృఢత్వ సాధనకు కెరీర్ బ్రేక్ బాగా ఉపయోగపడుతుంది కూడా. ఐ క్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి. అనేది నిజమే.ఐతే, ప్రజ్ఞాలబ్ధిని వినూత్న కల్పనా లబ్ధి (Innovation quotient) గా మలచు కునేందుకు కెరీర్ గ్యాప్ నిస్సంకోచంగా దోహదపడగలదు.
ఏదేని వృత్తి,ఉద్యోగం పొందగలగడం అనేదివ్యక్తి సామర్థ్యాలకే నిదర్శనం. అట్లాగే వృత్తి, ఉద్యోగం నుంచి తొలగించబడినప్పుడు లేదా వైదొలగినప్పుడు కూడా వ్యక్తి సామర్థ్యాల లోపం లేదా సామర్థ్యాల సంఘర్షణే కారణమని అర్థంచేసుకోవాలి. మరి, కెరీర్ బ్రేక్‌లో ఎవళ్లకు వాళ్లు ఏం చేయాలో కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకు ముందు ప్రస్తావించినట్టు కెరీర్‌కు బ్రేక్ ఏర్పడినప్పుడు అంతకు ముందుదాకా ఎంతటి వర్క్ రికార్డు ఉన్నా మళ్లీ ఒక పర్యాయం 'గ్యాప్ మేనేజ్మెంట్'లో ఆరేడు అంశాలపై ప్రధానంగా దృష్టి నిలపాల్సి వుంటుందని ప్రముఖ కాలమిస్ట్, మార్కెటింగ్ కన్సల్టెంట్Mrs.Margo TrottCollins సలహా ఇస్తారు. TopResume అనే˚ website కు వ్యాసం రాస్తూ ఆమె ఈ క్రింది విధంగా సూచనలు చేశారు.1.తమ నైపుణ్యాలు పట్ల, పని సామర్థ్యం పట్ల నిజాయితీ కలిగి లోపాలను
సరిద్దుకోవాలి (Honest really is best policy),2. సామాజిక సంబంధాలు కుంటు వడకుండా చూసుకోవాలి (Don't stop networking), 3.సామాజిక సంబంధా లను విస్త్రృత పరచుకోవాలి (Expand yournetwork), 4.సత్య వర్తనం అలవరచు కోవాలి (Own your truth), 5.క్రమేపి ఆవహించే ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి (Keep up amotions routine), వృత్తి ఉద్యోగ సంస్థలతో బాంధవ్యం మరువరాదు (Concentrate on the connection), 7.హానికరంగానో శత్రుపూర్వకంగానో అసలు వ్యవహరించ రాదు (Don't bitter).. ఈ సూచనలను గమనిస్తే వృత్తి ఉద్యోగ నిర్వహణలో నైపుణ్యాలు సామర్థ్యాలతో పాటు సంస్థాగత సంబంధ బాంధవ్యాలు కూడా కీలకమని తెలుస్తున్నది.అంటే కృత్రిమ మేధస్సు (Artificial intelligence) ఎంత అవసరమో, సామాజిక మేధస్సు (Social Intelligence) కూడా అంతే పెద్ద ఎత్తున అవసరమని యువత గుర్తించాలి. ఈ సందర్భంలో STAR అనే పదాన్ని మీ ముందుపెడుతున్నాను.''అది అతని స్టార్, అతని స్టార్ తిరిగింది.స్టార్ ఉండాలి'' వి జేతల విషయంలో ఇట్లాంటి మాటలు వింటుంటాం. మరి ఎవరు స్టార్ కాగలరు? అంటే ఎవరైతే పరిస్థితులకు ధైర్యగా ఎదురీది ఫలితాలను సాధిస్తారో అతనే, ఆవిడే స్టార్ కాగలరు.
అందుకే ఇంగ్లీషులో Situation Task Action Resultఅనే అర్థ విస్తరణ ఉంది. Wisdom ఎంతోమందికి ఉంటుంది. Stardom కొద్దిమందికే ఉంటుంది. కెరీర్ గ్యాప్‌లో Stardom ను అందుకునేందుకు కావాల్సిన మాడ్యూ ల్స్‌ను యువతీయువకులు రూపొందించు కోవాలి. సానబట్టుకోవడం అంటారే అదే కెరీర్ బ్రేక్‌లో ఎవరైనా చేయాల్సింది. అన్ని అరతలున్నప్పటికినీ ఒక సగటు ఉద్యోగం దొరకాలంటేనే ఐదారు నెలల కాలం నిరీక్షించాల్సిన పరిస్తితి ఉంటే, జాబ్ బ్రేక్ తీసుకునే వాళ్లు తిరిగి నచ్చిన చోట, నచ్చిన జీతభత్యాలతో నచ్చిన ఉద్యోగంలో చేరాలంటే Mental raodblocks qT Textual roadblocksరను సమూలంగా ఛేదించుకొని వ్యక్తిత్వాన్ని అత్యంత తాజా పరచుకుంటేనే సాధ్యం.
-డా|| బెల్లి యాదయ్య, 98483 92690