Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీడేంటి పులంటే భయం లేదేమిటి? అనుకుంది. అయినా వీడి మొఖం వీడేం చేయగలడులే అని కొంచెం కాన్ఫిడెన్సు తెచ్చుకుంది. పంజాల్లో గోళ్ళు విప్పుకుని ఒళ్ళు విర్చుకున్నవి.ఇక పులి మనిషి మీదికి దూకడమే. నాలుగు కాళ్ళూ పైకి లేపిన పులి రాతి బొమ్మలా అలా నిలబడి పోయింది. మనిషి ఏదో తెల్లటి పొడిని దానిమీద చల్లాడు. అంతే పులి చతికిలబడింది.
గుహలో గుర్రుపెట్టి నిద్ర పోతున్నది అది. అది అంటే ఆరడుగుల పొడువు పసుపు మీద మెరిసే నల్ల చారలు బారుతోక నాలుగు పాదాల్లో దాక్కున్న గోళ్ళూ గాజు కళ్ళూ ఉన్న పులి.
అవును పులే! పీకల దాకా మెక్కి ఒళ్లూ పైనకిందా తెలీకుండా నిద్రపోతున్న పులి. అంత నిద్దర్లో ఉన్నా గుహలోపలికి ఎవరో అడుగుపెట్టినట్టు తెలిసిపోయింది. పులి అంత చురుకైనది మరి. అంత నిద్ర మత్తునూ క్షణాల్లో వదిలేసింది. ఉన్న చోటునించే కదలకుండా కళ్ళు సగం విప్పింది. అర్థ నిమీలిత నేత్రా లతో గుహలోకి అనుమతి లేకుండా వచ్చిందెవరో చూసింది.
ఆశ్చర్యంతో దాని గాజుకళ్ళు అన్ని వైపులకీ తిరగేయి. ఎవరు వీడు బక్కపలచగా ఉన్నాడు. ముఖంలో అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. వీడు చావు వీడ్ని చేయిపట్టుకు తీసుకువచ్చి ఇక్కడ నిలబెట్టిందా? వీడి ఒంట్లో ఎముకలూ, మాంసమూ కలిస్తే కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి పనికి రాడు అనుకుంది. ఒక్కసారి ఇటు నించి అటు కదిలితే చాలు ఏడు ఆమడలు పారిపోడూ అనుకుంటూ ఒక్కసారి తల విదిలిస్తూ లేచి కూచుంది. మనిషి పారిపోయాడా లేదా అని ఒక కన్ను మూసి చూసింది.
ఆశ్చర్యంతో రెండు కళ్ళూ తెరిచింది. మనిషి మరింత ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎవడ్రా నువ్వు!. పులి గుహలో దూరావు! పైగా పైపైకి వస్తున్నావు. నన్ను చూడగానే నీ ఒంట్లో రక్తం ఫ్రీజవలేదా! పులినోట్లో తల పెట్టాలని సరదాగా ఉందా అంది పులి తోకని అంత ఎత్తున మెలిపెట్టి నిలబడుతూ.
మనిషి ముఖంలో భయం లేదు. ఒక్క అంగుళం వెనక్కి తగ్గలేదు. వచ్చిన మనిషి మరికొంచెం ముందుకు వచ్చి నేనెవరో తెలుస్తుందిలే నువ్వు నన్నే మీ చెయ్యలేవు. నీ అంతబలం లేకపోయినా, పైకి కనిపించే గోళ్ళు లేకపోయినా నేను నీ కంటే గొప్పవాడ్ని. పులిని వెతుక్కుంటూ వచ్చిన వాణ్ణి.
మనిషి మాటలు విన్న పులికి కొంచెం భయమేసింది. వీడేంటి పులంటే భయం లేదేమిటి? అనుకుంది. అయినా వీడి మొఖం వీడేం చేయగలడులే అని కొంచెం కాన్ఫిడెన్సు తెచ్చుకుంది. పంజాల్లో గోళ్ళు విప్పుకుని ఒళ్ళు విర్చుకున్నవి. ఇక పులి మనిషి మీదికి దూకడమే. నాలుగు కాళ్ళూ పైకి లేపిన పులి రాతి బొమ్మలా అలా నిలబడి పోయింది. మనిషి ఏదో తెల్లటి పొడిని దానిమీద చల్లాడు. అంతే పులి చతికిలబడింది. మనిషి ముందుకు వచ్చి తన వీపు మీద ఎక్కడం దానికి లీలగా కనిపించింది. పులి తన వీపు మీద మనిషిని మోస్తూ గుహ బయటకు నడిచింది. ఆ తర్వాత అడవీ, పల్లెలూ, పట్నాలూ మనిషి తనని స్వారీ చేస్తూ వెళ్తుంటే నోరెత్తకుండా మోసుకు పోతున్నది.
క్రమంగా దానికి తెల్సివచ్చింది. ఆ మనిషి పవర్ అనే పౌడరు చల్లి తనను లొంగ దీసుకున్నాడని. పులిని లొంగదీసుకున్న ఆ మనిషి, పులి మీద స్వారీ చేస్తున్న ఆ మనిషి కళ్ళునెత్తి కెక్కాయి. మదంతో, మాత్సర్యంతో, గర్వంతో మనిషి విర్రవీగసాగాడు. పులిమీద స్వారీ చేస్తున్నానన్న ధీమాతో తనను ఎవరూ ఏమీ చెయ్యలేడు అనుకున్నాడు. పవర్ వచ్చిన మనిషి. ఇక ఆ మనిషి నోటికి అడ్డూ అదుపూలేకుండా పోయింది. చేతలకు అర్థం లేకుండా పోయింది. ఎవరినీ లెక్క పెట్టడం లేదు. ఎవరినీ లెక్క చెయ్యడం లేదు. తన ముందుకు వచ్చిన ప్రతివాడూ చీమలా దోమలా బుద్ధిలేని సన్నాసిలా కనిపించసాగాడు. పవరొచ్చిన మనిషికి, పవర్ఫుల్ మనిషికి పులినెక్కిన మనిషికి
అనేక మంది పవర్ఫుల్ మనుషులు పులుల మీద స్వారీ చేస్తుండడం గమనించింది. ఒకనాడు మనిషి పులి మీద నిలబడి జనానికి ఉపన్యాసం దంచుతుంటే అడిగింది మరో పులిని 'ఇలా మన బ్రతుకంతా వీళ్ళని మోస్తూ ఉండడమేనా' అని వాపోయింది. అవకాశం వచ్చి ఏదో ఒక క్షణాన మనల్ని స్వారీ చేస్తున్న మనిషి కిందికి దిగుతాడు. క్షణం ఆలస్యం చేయకుండా పగతీర్చుకోవడమే అంది.
అదృష్టం ఎప్పుడైనా షేక్హేండ్ ఇవ్వచ్చుకదా. ఆ రాత్రే పవర్ఫుల్ మనిషి ఎందుకో పులిమీది నించి దిగాడు. ఇన్నాళ్ళు తన మీద స్వారి చేసిన మనిషి రక్తం, మాంసాలు వాసన చూడటం కూడా అసహ్యమనిపించి అడవి దారి పట్టింది పులి.
- చింతపట్ల సుదర్శన్, 9299809212