Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పఠనావశ్యకతను గురించి ప్రముఖుల గొప్ప గొప్ప వ్యాఖ్యలు అనేకం చేశారు. 'చదవడాన్ని పిల్లలకు విధిగా, అందించకూడదు. దానిని కానుకగా సమర్పించాలి.' అని కేట్ డికామిల్లో,'పుస్తకాలు మనుషుల్లాగే ఉంటాయని భావిస్తున్నాను, మనకు చాలా అవసరమైనప్పుడు అవి మన జీవితాల్లోకి రాగలవు' అని ఎమ్మా థాంప్సన్, 'ఇవాళ్టి పాఠకుడే రేపటి నాయకుడు.' అని మార్గరెట్ ఫుల్లర్, 'ఒక పదం తర్వాత ఒక పదం ఇదే వాక్యాలకుండే శక్తి. పుస్తకంలోని మహాశక్తి కూడా ఇదే' అని మార్గరెట్ అట్వుడ్, 'నాకు పాఠకుల బృందాలను చూపించండి, నేను ప్రపంచాన్ని కదిలించే వ్యక్తులను మీకు చూపిస్తాను.' అని నెపోలియన్ బోనపార్టే, 'పుస్తకం చదివినప్పటి ఆనందాన్ని మించిన ఆనందం కంటే మరొక ఆనందం ఏదీ లేదు.
“A book is a garden, an orchard, a storehouse, a party, a company by the way, a counselor, a multitude of counselors.”
– Charles Baudelaire
''తను మరణించేలోపు చదువరి వేయి జీవితాలను జీవిస్తే, పఠనం అలవాటు లేని అరసికుడు ఒక బ్రతుకునే వెళ్లదీస్తుంటాడు'' అని అంటారు సుప్రసిద్ధ అమెరికా రచయిత జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్. పఠనాస్వాదనకు సంబంధించి ఉత్తమోత్తమ వ్యాఖ్య ఇది. దీన్ని కొన్నేండ్ల నుంచి విద్యార్థులకు చెప్పిచూస్తూనే వున్నాను. అర్థం చేసుకున్న వాళ్లూ ఆకర్షితులైన వాళ్లూ కొంతలో కొంత మారారు. లైబ్రరీలకు వెళ్తున్నారు.ఇష్టమైన పుస్తకాలు లిస్టు వేసుకొని దొరకబట్టుకొని చదువుతున్నారు. ఎప్పుడైనా చర్చపెడితే ఏదో ఓ మేరకు చదివిన పుస్తకాలను విలక్షణంగా ప్రస్తావిస్తున్నారు. తరగతిలో కొద్దిమందికి మాత్రమే పఠనాభిరుచి ఉంటే సరిపోదు. విద్యార్థులు అందరికందరూ పుస్తక ప్రియులుగా, మంచి చదువరులుగా మారినప్పుడు విద్యా సాధకత్వం (అకడమిక్ అచీవ్మెంట్) పరిపూర్ణం సంపన్నం అవుతుంది. అయితే కొన్ని చోట్ల స్వీయాసక్తిగల అధ్యాపకులు స్కూళ్లూ కాలేజీల్లో విద్యార్థులను పఠనం వైపుకు మళ్లిస్తుంటారు. సాహిత్యం పట్ల గౌరవం, సామాజిక చైతన్యం బొత్తిగా లేని, కేవలం జీత భత్యాల కోసం పనిచేసే టీచర్లున్న చోట పఠన మందిరాలు, ప్రసిద్ధ గ్రంథాలు స్పర్శించే వాళ్లులేక నీరసంగా నిస్సత్తవగా ఉండిపోతున్నాయి. ఈ నీరస నిసస్సత్తువ వాతావరణాన్ని ఛేదించి, పాఠశాల గ్రంథాలయాల్ని నిరంతర అధ్యయన శాలలుగా మార్చే కార్యక్రమం కోసం దశాబ్దాలుగా ఎదురు చూశాం. ఈ సుదీర్ఘ నిరీక్షణను పరిష్కారంగా మన రాష్ట్రప్రభుత్వం ' రీడ్ (Read Enjoy,and Develop) ప్రోగ్రాంను సంకల్పించింది.
పిల్లలందరినీ చదువరులుగా తీర్చిదిద్దడమే రీడ్ కార్యక్రమ లక్ష్యం. ఇందుకు గాను ఈ నెల ఐదో తేదీ నుంచి రీడ్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రారంభిం చింది. ప్రతి శనివారం ఒక ప్రత్యేక కార్యక్రమంతో పాటు, ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు పాఠశాల గ్రంథాలయ వారోత్సవాలు, మాసోత్సవాలను కలుపుకొని వంద రోజులపాటు విద్యార్థుల పఠనాభివృద్ధికై బృహత్కార్యక్రమాలు జరుగనున్నాయి. బాలబాలికల కోసం పఠన వనరుల (రీడింగ్ రిసోర్సెస్) కల్పనలో నిబద్ధతగల ఉపాధ్యాయినీఉపాధ్యాయులు నిస్సం శయంగా తల ముకలైనారు. రాష్ట్ర ప్రభుత్వమే 'సమగ్ర శిక్షాకార్యక్రమం' ద్వారా పూనుకొని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకురావడంతో ప్రతి పాఠశాల ఇప్పుడు పఠన శిక్షణాలయంగా కొలువుతీరనున్నది. దీనికి తోడు 'మన ఊరు మన బడి' పథకంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 26,065 పాఠశాలల అభివృద్ధి-నవీకరణ ఊపందుకోనున్నది. రీడ్‌లో భాగంగా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు గల దాదాపు 18 లక్షల మంది చిన్నారుల్లో చదివే అలవాటు, నైపుణ్యాలు పెంపొందనున్నాయి. పాఠశాల లైబ్రరీని అభివృద్ధి పరచడం, వయోవర్గాల వారీగా అవసరమైన పిల్లలకు పుస్తకాలను ఇచ్చి చదివేలా చూడడం లీగ్ కార్యక్రమంలో ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత. పిల్లల పఠన అలవాటును పెంపొందించేందుకు సంబంధించిన రికార్డులను టాస్క్ కమిటీ పర్యవేక్షిస్తుంది. కుశాగ్ర, అమోఘ చదువరుల జాబితాను సిద్ధంచేసి నోటీసు బోర్డులో వేసి ఈ కమిటీ బాలల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహిస్తుంది. తల్లిదండ్రులు ప్రాతినిధ్యం వహించే పాఠశాల యాజమాన్య కమిటీ కూడా 'రీడ్'లో అనుసంధానమై పనిచేస్తుంది. పాఠశాలను పటిష్ఠం చేసేందుకు, గుణాత్మక విద్యనందించేందుకు తోడ్పడనున్న 'రీడ్'ను ఇక్కడ సూచించిన నాలుగు పద్ధతులు అనుసరించడం ద్వారా ఉపా ధ్యాయులు తమవంతుగా జయప్రదం చేయవచ్చు. అవి
1.పిల్లలకు సరైన పఠన సామాగ్రిని అందుబాటులోకి తేవడం,
2.నిత్య పఠనం వైపుకు పిల్లల్ని మళ్లించడం,
3.పఠనాసక్తి రేకెత్తిస్తూ పిల్లలకు సరియైన శిక్షణ ఇవ్వడం,
4. తాము ఆనందించే పుస్తకాలలో ప్రత్యేకత కలిగిన బుక్ క్లబ్‌లు లేదా రీడింగ్ గ్రూపులను ఏర్పాటుచేయడం.
ఎన్ని రకాలుగా ప్రేరణ ప్రోత్సాహం కల్పించినప్పటికినీ విద్యార్థులు పఠనానాన్ని ఆస్వాదించకపోవడానికి పాఠ్యేతర గ్రంథాలు, సాహిత్యం ఎక్కడా ఎందుకూ ఉపయోగపడవని భావించడమే కారణం. ఇక్కడే చిన్నారుల ఆసక్తులను పరిగణనలోకి తీసుకుని, వాళ్లలో పఠనా కుతూహలాన్ని స్థాపించే కార్య క్రమాలను ఉపాధ్యాయులు అనేకం రూపొందించుకోవాలి. చదవడం వ్యక్తిగతమని, మరొకరితో పోటీ కాదని, గాఢమైన, లోతైన, అత్యంత ఆత్మాశ్రయ కార్యకలాపం అని నమ్రతగా విశద పరచాలి. అందరూ ప్రశంసించే అవార్డు-విజేత గ్రంథాలు తమకు నచ్చనందుకు పిల్లలు అపరాధభావానికి లోనుకాకుడా చూడాలి. కామిక్స్ లేదా రొమాన్స్ నవల వంటి ఇతరులు 'లోబ్రో'గా భావించే వాటిని ఒకవేళ పిల్లలు నిజంగానే ఇష్టపడితే ఉపాధ్యాయులేమీ ఇబ్బంది పడకూడదు. ఇష్టపడేదాన్ని చదవమనడం, ఎవరూ ఎవరితోనూ పోల్చుకోకుండా చూడడం, పిల్లలకు ఒక పుస్తకం నచ్చకపోతే, వాళ్లు చదవడం మానేయాలని కాదు! ఆ సుకుమార హృదయాల కోసం తాము ఇంకా పుస్తకాన్ని కనుగొనలేదని ఉపాధ్యాయులు భావించాల్సి వుంటుంది. సినిమాలు లేదా టెలివిజన్ ప్రోగ్రాములు చూడటం కంటే కూడా పఠనాన్ని సోలో యాక్టివిటీగా అనుకుంటున్నారు చాలామంది. కానీ అట్లా అనుకోవాల్సిన పని లేదు. పుస్తకాలు తక్కిన మాధ్యమాల వలె ఇతరులతో మాట్లాడటానికి సరదాగా ఉంటాయన్న సత్యాన్ని కూడా పిల్లల దృష్టిపథంలో ఉపాధ్యాయులు ఉంచాలి. ఆనందించగలిగితేనే పిల్లలు పఠనాన్ని ఇష్టపడడం జరుగుతుంది. ఇష్టం పెంచుకుంటేనే పుస్తకాల నుంచి పత్రికల నుంచి పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. అతి పిన్న వయస్సులోనే నిత్యపాఠకురాలిగా మారి పేరుగాంచిన బ్రిటీష్ నవలాకారిణి, ఇరవైయ్యో శతాబ్దపు గొప్ప అరుదైన పుస్తకాల సంపాదకురాలు డయానా అథిల్.
తన పఠనానుభవాన్ని గురించి తన ఆత్మకథలో ఇట్లా 'విద్యార్థి వయస్సులో నాతోటి వారంతా ప్రాంగణాల్లో గొడవలు పడేవారు, ప్రేమలో పడ్డారు. కానీ, నేను మాత్రం పుస్తకాల్లో పడ్డాను'' అంటారు. చిరు ప్రాయంలో గ్రంథపఠనం అలవాటై నందునే డయానా అథిల్ మహా రచయిత్రిగా ఎదిగారని ఉపాధ్యాయులు అనురక్తిరగిలిస్తూ చెప్పాలి. వ్యక్తి వికాసానికి 'అభీష్టం, నైపుణ్యం, పునః పూరణం (విల్, స్కిల్,రీఫిల్)' అనేవి క్రమ పాతిపదిక. ఈ ప్రాతిపదికలో ప్రతిమెట్టులో పఠనం మహా చోదకశక్తిలా పనిచేస్తుందని మోటివేషనల్ స్పీకర్, ప్రఖ్యాత రచయిత జిగ్ జిగ్లర్ అంటారు. క్యారెక్టర్ స్ట్రెంత్స్ అండ్ వర్చుస్: ఎ హ్యాండ్‌బుక్ అండ్ క్లాసిప ˜ికేషన్ గ్రంథంలో పాజిటివ్ సైకాలజిస్టులు క్రిస్టోఫర్ పీటర్సన్, మార్టిన్ సెలిగ్మాన్ నిర్వచించినటట్టు వ్యక్తిత్వ బలాలకు అంతర్వాహినులుగా ఉండే ఈ ఆరు సద్గుణాలు 1.జ్ఞానం(నాలెడ్జ్), 2.ధైర్యం (కరేజ్), 3.మానవత్వం (హ్యూమానిటీ), 4.పరకాయ ప్రవేశం (ట్రాన్సెండెన్స్) 5.న్యాయం (జస్టిస్), 6.నిగ్రహం (టెంపరెన్స్) గ్రంథపఠనం వల్లనే సిద్ధించగలవు.ఇవే వ్యక్తుల సామాజిక మేధాశక్తికి పునాది.
పఠనావశ్యకతను గురించి ప్రముఖుల గొప్ప గొప్ప వ్యాఖ్యలు అనేకం చేశారు. 'చదవడాన్ని పిల్లలకు విధిగా, అందించకూడదు. దానిని కానుకగా సమర్పించాలి.' అని కేట్ డికామిల్లో,'పుస్తకాలు మనుషుల్లాగే ఉంటాయని భావిస్తున్నాను, మనకు చాలా అవసరమైనప్పుడు అవి మన జీవితాల్లోకి రాగలవు' అని ఎమ్మా థాంప్సన్, 'ఇవాళ్టి పాఠకుడే రేపటి నాయకుడు.' అని మార్గరెట్ ఫుల్లర్, 'ఒక పదం తర్వాత ఒక పదం ఇదే వాక్యాలకుండే శక్తి. పుస్తకంలోని మహాశక్తి కూడా ఇదే' అని మార్గరెట్ అట్వుడ్, 'నాకు పాఠకుల బృందాలను చూపించండి, నేను ప్రపంచాన్ని కదిలించే వ్యక్తులను మీకు చూపిస్తాను.' అని నెపోలియన్ బోనపార్టే, 'పుస్తకం చదివినప్పటి ఆనందాన్ని మించిన ఆనందం కంటే మరొక ఆనందం ఏదీ లేదు. నాకు స్వంత ఇల్లు ఉన్నప్పుడు, నాకు అద్భుతమైన లైబ్రరీ లేకపోతే నేను దయనీయంగా ఉంటాను' అని జాన్ ఆస్టిన్ అంటారు. మానసిక ఉద్దీపన, ఒత్తిడి తగ్గింపు, భాషాజ్ఞానం, జ్ఞాపకశక్తి , విశ్లేషణా సామర్థ్యం, ఏకాగ్రత, సృజనాత్మకత, మానసిక ప్రశాంతత, వినోదం, సంఘైక్యత మొదలైనవన్నీ పుస్తకాల మూలాన పఠితలకు చేకూరే ప్రయోజనాలు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ యుద్ధసమయాల్లో ప్రతి రాత్రి విధిగా మలుసి రోజు యుద్ధ వ్యూహం కోసం, ప్రేరణ కోసం 'ఇలియడ్' గ్రంథాన్ని చదివేవాడని చెపుతారు. మొగలాయిల్లో మహా చక్రవర్తిగా కొనియాడబడిన అక్బర్ పాదుషా నాడు వాసికెక్కిన వివిధ భాషల్లోని ఇరవైఐదువేల గ్రంథాలతో పఠనాలయం నెలకొల్పాడని, ఆయన నిరక్షరాస్యుడైనప్నటికినీ పండితులచేత చదివించుకొని గ్రంథ సారాన్ని ఆస్వాదించేవాడని చరిత్రకారులు పేర్కొన్నారు. ఇట్లా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పుస్తక ప్రియుల పఠన గాథలను తరగతుల్లో సందర్భానుసారంగా పరిచయం చేయాలి.
పిల్లల్లో పఠన గుణాన్ని నెలకొల్పడానికి పెద్దలు సైతం పుస్తక పఠనం అలవాటుచేసుకోవాలి.'పెద్దవాళ్లు చదవడం అనేది పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన అభ్యాస నిమగతను పేర్కొన కుండానే పరోక్షంగా వారితో అనుబంధాన్ని పెంచు కోవడానికి, పఠనం అలవరచ డానికి ఒక అద్భుతమైన మార్గం' అంటారు స్టెఫ్నీ జాన్సన్. ఈమె 'ఫీడ్ ఫాండ్. కామ్' లో పిల్లల పఠనార్థం కంటెంట్ రాస్తుంటారు. ఈమె చిన్నారులతో ' బోర్డు బుక్స్, ఫోక్ టేల్స్, ఫెయిరీటేల్స్, ఇంట రాక్టివ్ బుక్స్, పోయెట్రీ, ఆల్ఫబెట్ బుక్స్, కౌటింగ్ బుక్స్,రైమింగ్ బుక్స్, రైమింగ్స్ బుక్స్, ఇన్ఫర్మేటివ్ బుక్స్' వంటి పదిరకాల పుస్తకాలను చదివించాలని సూచిం చారు. 'తల్లిదండ్రులు ఎంత ప్రొఫెషనల్స్ అయినప్పటికీ, తగిన పుస్తకాల ఎంపికపై బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ చేయడానికి చాలా మందికి సమయం లేదు కాబట్టి, పిల్లలకు ఎటువంటి పుస్తకాలు కావాలో, వాటిని ఎట్లా చదవాలో తెలియదు కాబట్టి పుస్తక క్యూరేటర్ల సహాయం తప్పనిసరి' అంటారు హైదరాబాద్‌కు చెందిన అనుపమ దాల్మియా. పిల్లలలో సాహిత్యంపై ప్రేమను ప్రోత్సహించడానికి 'బియాండ్ ది బాక్స్'ను స్థాపించారీమె. మన తెలుగులోనూ విస్తారమైన బాలసాహిత్యం ఉంది. దీన్నీ పిల్లలకు అందుబాటులో ఉంచాలి.
విద్యార్జనకు సంబంధించి పన్నెండేండ్లలోపు పిల్లలది స్వీకరణ దశ. ఆపైన ఆవిష్కరణ దశ. స్వీకరణ దశలో పిల్లలకు చేరువగా కన్సర్వేటివ్ లిటరేచర్ ఉంచేదానికన్నా ప్రోగ్రెస్సివ్ లిటరేచర్ తీసుకెళ్తే, ఆవిష్కరణ దశలో పిల్లల అన్వేషణాశక్తి ఊహాశక్తి మరింత బలపడి లోకహితదాయకంగా వెలుగొందుతాయి. భారతీయ విద్యావ్యవస్థలో వినూత్న ఆలోచనలకు పాదువేసిన గిజుభాయి వధేకా, స్వతంత్ర భారత పాలనలో పలుకబడిలో శాస్త్రీయ స్పృహకు పెద్దపీట వేసిన పండిట్ నెహ్రూ ఇరువురు కోరుకున్నదీ ఇదే. తెలంగాణ బాలల మేధోభివృద్ధికి దోహదపడగల 'రీడ్' ఒక చేంజ్ మేకర్. కోవిడ్ మహమ్మారి కారణంగా సంభవించిన పిల్లలకు జరిగిన విద్యా నష్టభర్తీకి ప్రముఖ ఎపిడమాలజిస్ట్, విద్యావేత్త చంద్రకాంత్ లహారియా సూచిస్తున్న" There is a need every government to prepare a mid- to long-term plan to compensate for the learning loss,with the sufficient focus on overall child development. There is need for strategic and innovative thinking and lasting solutions ( Structured Approach : P-E-R-I prepare, engage, reimagine, innovation)"కు ప్రత్యామ్నాయం. 'రీడ్'లో తల్లిదండ్రులు యాజమాన్యాలది ఇతోధిక పాత్ర, ఉపాధ్యా యులది క్రియాశీలక పాత్ర. ఇంకేం? పిల్లలూ! పుస్తకాలు చదవండి, ఆనందం పొందండి. అభివృద్ధికి చేరువకండి.
-డా|| బెల్లి యాదయ్య, 98483 92690