Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ అండ ఉన్న ఆ వ్యక్తి కారణంగా అమెను మరో సీటుకి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయవలసి వస్తుంది. సూటిగా పని చేసుకుంటూ పోయే ఆమె స్వభావం, ఎవరికీ భయపడని ఆమె నైజం గమనించి అనుభవజ్ఞుడైన ఆమె సీనియర్, దివ్యను జువినైల్ హోంలోని పిల్లలకు ఫుట్ బాల్ కోచ్‌గా పంపిస్తాడు. రాజకీయ ఒత్తిడులకు దూరంగా ఆమెను పంపుతూనే, ఆమెలోని పట్టుదల మరో రకంగా సమాజానికి ఉపయోగపడేలా చూడాలని దివ్యకు ప్రత్యేకంగా ఈ భాద్యత అప్పగిస్తాడు ఆమె బాస్.
మన భారతీయ భాషల్లో చాలా స్పోర్ట్శ్ డ్రామాలు వచ్చాయి. గుజరాతీ భాషలో ఇప్పటిదాకా స్పోర్ట్శ్ డ్రామాలు రాలేదు మొదటి స్పోర్ట్శ్ డ్రామా ''గుజరాత్ -11'' 2019లో రిలీజ్ అయ్యింది. ఇప్పటి దాకా వచ్చిన మన దేశంలోని వివిధ భాషలలో వచ్చిన స్పోర్ట్శ్ డ్రామలు అన్నిట్లో కూడా కోచ్‌గా పురుషులనే చూసాం. అసలు క్రీడలు అంటేనే పురుష ప్రాధ్యాన్యత ఉన్న శాఖ. కోచ్‌గా స్త్రీలను చూపిస్తూ, అదీ మగపిల్లల టీంను తయారు చేయడం గురించి మనం వినలేదు. ఆ పాత్రకు స్త్రీలను ఇప్పటి దాకా ఎవ్వరూ ఊహించలేదు. గుజరాతీ భాషలో వచ్చిన ఈ మొదటి స్పోర్ట్శ్ డ్రామాలో కోచ్‌గా స్త్రీని చూడడం వినూత్నంగా, ప్రోత్సాహకరంగా అనిపించింది. క్రీడలలో ఆడపిల్లలు పతకాలు తీసుకొస్తున్న సందర్భంలో కోచ్ స్థాయిలో ఒక మహిళను చూడడం చాలా స్పూర్తిదాయకంగా ఉంది. ముఖ్య పాత్ర పోషించిన డైసీ షాV్‌ా కూడా చాలా బాగా నటించింది. సినిమాలో ఆ పాత్రను డిగ్నిపైడ్ గా మలిచి పూర్తి న్యాయం చేసారు దర్శకులు జయంత్ గిలాతర్. బాంక్ ఉద్యోగాన్ని వదిలి సినిమా పై ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన జయంత్ ఎన్నో టీ.వీ సీరియల్లకి కూడా దర్శకత్వం వహించారు. హిందీలో ''చాక్ అండ్ డస్టర్'' అనే సినిమాని తీసి తన ప్రతిభను నిరూపించుకున్న జయంత్ మరాఠీ సినిమాలకు కూడా పని చేసారు. విలువలను ప్రాద్యన్యం ఇచ్చే సినిమాలు తీయడం ఈయన నైజం.
దివ్య చౌహాన్ సబ్ ఇన్స్పెక్టర్గా పోలీసు రంగంలో పని చేస్తూ ఉంటుంది. ఒక డ్రగ్స్ కేస్‌లో ఒక ప్రముఖుడ్ని దివ్య అరెస్టు చేస్తుంది. రాజకీయ అండ ఉన్న ఆ వ్యక్తి కారణంగా అమెను మరో సీటుకి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయవలసి వస్తుంది. సూటిగా పని చేసుకుంటూ పోయే ఆమె స్వభావం, ఎవరికీ భయపడని ఆమె నైజం గమనించి అనుభవజ్ఞుడైన ఆమె సీనియర్, దివ్యను జువినైల్ హోంలోని పిల్లలకు ఫుట్ బాల్ కోచ్‌గా పంపిస్తాడు. రాజకీయ ఒత్తిడులకు దూరంగా ఆమెను పంపుతూనే, ఆమెలోని పట్టుదల మరో రకంగా సమాజానికి ఉపయోగపడేలా చూడాలని దివ్యకు ప్రత్యేకంగా ఈ భాద్యత అప్పగిస్తాడు ఆమె బాస్. దివ్య ఉద్యోగంలోకి రాక ముందు ఫుట్ బాల్ చాంపియన్. ఆ ఆటంటే ఆమెకు ప్రాణం. కాని మైదానంలో జరిగిన ఒక ప్రమాదంలో ఆమె మోకాలుకు దెబ్బ తగలడం వలన తనెంతో ఇష్టపడే ఆటకు దివ్య దూరం అవ్వవలసి వస్తుంది. తన కిష్టమైన ఆటను మరోసారి ఆస్వాదించే అవకాశం ఆమె ఉద్యోగం ద్వారా ఈ రకంగా ఆమెకు కలుగుతుంది.
దేశంలోని అన్ని రాష్ట్రాలలోని జువినైల్ హోమ్స్ నుండి టీంలను ఎన్నుకుని వారితో ఫుట్ బాల్ మాచ్ ఆడిస్తుంది ప్రభుత్వం. గుజరాత్ లో అన్ని జిల్లాలలో ఉన్నజువినైల్ హోమ్స్ నుండి టీం కోసం క్రీడాకారులను ఎన్నుకోవడం మొదలుపెడుతుంది దివ్య. జువినైల్ హోమ్‌లో చేరిన పిల్లలు ఎప్పుడూ అసహనంగా, కోపంగా, కసిగా ప్రవర్తిస్తూ ఉంటారు. చెడు అలవాట్లను బానిస అయిన వాళ్ళు కూడా వీరిలో ఎక్కువే. దివ్య వీరందరి నుంచి తనకు కావలసిన పదకొండు మందిని ఎంచుకుంటుంది. వీరందరి గతం కూడా వారిపై పని చేస్తూ ఉంటుంది. కలిసి టీంగా పని చేయడం తెలియదు ఎవ్వరికీ. ఈ హోమ్‌లో పిల్లలు ఎవ్వరినీ నమ్మరు, ఎవ్వరి నమ్మకాన్ని సంపాదించుకోలేరు. ఇలాంటి నేపద్యం ఉన్న పిల్లలలో ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, గౌరవం పెంపొందించడం అవసరం అని దివ్య గుర్తిస్తుంది. దివ్యకు దొరికిన సమయం చాలా తక్కువ. ఈ పనికి ఆమెకు సహాయం చేయడానికి ఒక కాన్స్టేబుల్ని మాత్రమే ఇస్తుంది ప్రభుత్వం. అతను ప్సోర్ట్ కోటాలో ఉద్యోగం సంపాదించుకున్నా, ఆ తరువాత ఆటలు పక్కన పెట్టి విపరీతంగా ఊరిపోతాడు. తిండి తప్ప మరేదానిపై దృష్టి ఉండదు అతనికి. జువినైల్ హోం వార్డేన్ కూడా దివ్యకి సహకరించడు. ఒక స్త్రీ తనపై అధికారం చెలాయించడం. సొంత నిర్ణయాలు తీసుకోవడం అతను భరించలేకపోతాడు. ఆమెకు పనిలో సహాయపడడానికి బదులు అన్ని రకాలుగా ప్రతిబంధకాలు కలిగిస్తూ ఉంటాడు.
అంతకు ముందు షారుఖ్ ఖాన్ 'చక్ దే' చూసిన్ వారికి కోచ్ మానసికంగా పిల్లలకు దగ్గర అవడం వెనుక ఉండే అవసరం అర్ధం అవుతుంది. ఈ సినిమాలో దర్శకుడు హీరోయిక్ ఎలిమెంట్ లేకుం డా చాలా ప్రాక్టికల్ గా కోచ్ పనితనం చూపిస్తారు. ఇందులో పిల్లలు జువినైల్ హోం వారవడం వలన వారివి జీవన పోరాట కథలు. ప్రేమ కథలు ఇందులో లేవు. తమపై తమకు నమ్మకం కలిగించ డానికి ఆ పిల్లలను శిక్షణ ద్వారా దివ్య ఎలా తనవైపుకి తిప్పుకుని ఒక సామూహిక గమ్యం వైపుకు వారిని ప్రయాణించేలా ప్రేరిపించిందన్నది సినిమాలో చూడాలి. స్త్రీ అనగానే ఆమె శరీరం వైపు ఆశగా చూసే ఆ వయసు మగపిల్లలని తన దారికి తెచ్చుకుని వారిలో క్రమశిక్షణ అలవడేలా ఆమె జాగ్రత్తపడిన అంశాలు దర్శకులు బాగా చూపించగలిగారు.
దివ్యను ప్రేమించే ఆమె చిన్నప్పటి స్నేహితుడి అండ కూడా ఆమెకు ఈ పనిలో తోడ్పడుతుంది. తమ పిల్లలు జైలులో కాలం గడుపుతున్నా తమను తాము నిరూపించుకోవడానికి వారు పడుతున్న శ్రమకు తోడ్పాటు అందించడానికి వారి తల్లి తండ్రులు ముందుకు రావడం, పిల్లల విజయాన్ని వారు ఆస్వాదించడం సినిమాలో చూస్తున్నప్పుడు కలిగే ఆనందం మంచి ఫీల్ ను ఇస్తుంది.
పురుషులు ఆధిపత్యం వహించే రంగాలలో స్త్రీలను చూపిస్తున్నప్పుడు సినిమాలలో ఆ పాత్రల చిత్రీకరణలో కొంత బాలెన్స్ తప్పే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలను పురుషులను అనుకరిస్తున్నట్లు చూపుతూ వారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా పురుష స్వబావంతో నింపేసిన సినిమాలు మన భారతీయ భాషలలో చాలా చూసాం. కాని ఈ సినిమాలో ఒక అందమైన బాలెన్స్ ను చూస్తాం. తన వృత్తి పరంగా చాలా కఠినంగా ఉండే దివ్య వస్త్రధారణ, స్టైల్ అంతా కూడా వృత్తికి అనుగుణంగా ఉంటుంది. గ్రౌండ్లో ఒక క్రీడాకారిణీకి ఉండవలసిన నిబద్దత చాలా బాగా చూపిస్తుంది ఆమె. పిల్లలతో సంభాషించేటప్పుడు చాలా విమర్శనాత్మకంగా, హుందాగా, నిర్భీతిగా కని పిస్తుంది. ఒక మంచి టీచర్‌కు ఉండవలసిన లక్షణం ఇది. అలాగే తన టీంలోని క్రీడాకారులను గమనిస్తూ వారిలోని శక్తులను లోపాలను శ్రద్దగా నోట్ చేసుకుని వాటిని ఉపయోగపడేలా మలచుకోవడంలో ఆమెలోని చతురత గమనించవచ్చు.
లావుగా ఉన్నందుకు హేళనను అనుభవిస్తున్న ఒక క్రీడాకారుడ్ని ఆ టీంకి బలమైన ప్లేయర్ గా ఆమె మార్చి చూపిస్తుంది. పురుషులు అప్పటిదాకా డామినేట్ చేసిన రంగంలో స్త్రీలు కాలు పెట్టినప్పుడు పురుషుని శరీర భాషను కాపీ చేస్తూ, స్త్రీతత్వాన్ని విస్మరించి ప్రవర్తించడం అవసరం అని నమ్మించే పద్దతిలో కొన్ని సినిమాలో పాత్రలను గతంలో రూపొందించారు. ఆ సినిమాలను చూస్తున్నప్పుడు, అ పాత్రలలో సహజత్వం లోపించి ఆ పాత్రలను అన్ని శ్రేణుల ప్రేక్షకులు ఇష్టపడేవారు కాదు. కాని దానికి భిన్నంగా చాలా డీసెంట్‌గా డిగిఫైడ్గా మలచిన పాత్ర దివ్య చౌహాన్. ఆ పాత్రను అదే స్థాయిలో పోషించిన డేజీ షాV్‌ా నటనను అభినందించాలి.
మన దేశంలో ఆడపిల్లలకు క్రీడలలో ప్రోత్సాహం తక్కువ. దేశంలో క్రీడలలో ఎక్కువగా అమ్మాయిలు పాల్గొనేదీ మహరాష్ట్రలో. ఒక సంవత్సరం చేసిన సర్వేలో మన దేశంలో క్రీడలలలో పాల్గొనే అమ్మా యిలలో 54శాతం మహరాష్ట్ర నుంచి ఉంటే,53శాతం అమ్మాయిలు తమిళనాడు నుంచి ఉన్నారు. పంజాబ్ హరయాణా రాష్ట్రాల నుండి 15శాతం మాత్రమే అమ్మాయిలు క్రీడలలో కనిపి స్తారు. జాతీయ క్రీడలలో మహిళా క్రీడాకారు లను గమనిస్తే 1979 నుండి 2011 దాకా గుజరాత్ మహిళా క్రీడాకరులు సంఖ్యా పరంగా చాలా తక్కువ మంది పాల్గొంటున్నారు. 1975 జాతీయ క్రీడలలో 25 మంది బాలికలు పాల్గోంటే 2011 లో 33 మంది మాత్రమే పాల్గొన్నారు. మిగతా రాష్ట్రలల్తో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ. ఇప్పటికీ గుజరాత్ నుంచి క్రీడలలో పాల్గొనే మహిళలు మిగతా రాష్ట్రాలతో చూస్తే చాలా తక్కువ. అలాంటి సందర్భంలో ఫుట్ బాల్ లాంటి ఒక ఆటలో మహిళలు ఎంత తక్కువగా ఉంటారో ఊహించవచ్చు. అయినా గుజరాత్ లో వచ్చిన మొదటి స్పోర్శ్ సినిమాలో కోచ్‌గా మహిళను చూపించడాన్ని గమనిస్తే ఇది ఎంత గొప్ప ప్రయత్నమో అర్ధం చేసుకోవచ్చు. 2017 గణాంకాలు, బ్రూణ హత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం గుజరాత్ అని చెబుతున్నాయి. వీటన్నిటి మధ్య గుజరాతీ భాషలో 2019లో ఈ సినిమా రావండం ఆశాజనకమైన పరిణామం అని ఒప్పుకోవాలి.
సినిమా ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది. మంచి సబ్జెక్టుతో సినిమా తీస్తున్నప్పుడు అందులో స్టార్ స్టేటస్ ఉన్న హీరోని తీసుకుంటే అతని స్టార్డం కోసం సినిమాలో అతని పాత్రను ఎలివేట్ చేయడానికి అనవసరమైన నాటకీయత జోడించవలసిన అవసరం వస్తుంది. కాని దాని వలన విషయం పలచనయిపోతుంది. రాబిన్ హుడ్ టైప్ కోచ్‌లను చూపించి భారతీయ సినిమాలో, హీరో ఎలిమెంట్ ను పెంచకుండా ఇలాంటి బాలెన్స్డ్ సినిమా తీయడం వలన సిని మాలో పాత్రల సహజ వ్యక్తిత్వం చాలా వరకు నిలిచి ఉంటుంది. గుజరాత్ 11లో కొన్ని టెక్నికల్ లోపాలు, కథనంలో బల హీనతలు ఉన్నా విషయాన్ని ప్రెజెంట్ చేసిన తీరును గమనిస్తే ఇది ఒక మంచి చిత్రంగా గుర్తుండి పోతుంది. దివ్య షాV్‌ా పాత్ర భారతీయ సినిమాలలో స్త్రీ పాత్రలలో గౌరవమైన స్థానానికి అరÛత సంపాదించుకుంటుంది.
- పి.జ్యోతి, 9885384740