Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజా వాసిరెడ్డి మల్లీశ్వరిగారు బహు ముఖ ప్రజ్ఞాశాలిని. భాషమీద బాగా అధికారమున్న విదుషీమణి. సజనాత్మకత సుష్ఠుగా ఉన్న సజనశీలి. కవిత్వం వ్రాయడంలోను, భాషా సాహిత్య వ్యాసాలు పుఖాను పుంఖాలుగా వెలువరించడంలోను దిట్ట. వ్మా, వ్యాఖ్యాత్రి. ఉత్తమ బోధకురాలు, వక్త. ఈమెకున్న ఈ లక్షణాలన్నీ రుచి చూడాలంటే ఆమె రచించిన ''వర్ణిక'' అనే లేఖా సాహిత్య గ్రంథాన్ని చదివితే చాలు.
ఏ రచయితైనా, కవైనా వ్రాసిన గ్రంథాలలో పరిశీలనా దక్పథంతో చూస్తే కనిపించే అంశాలు నాలుగే. అవి వ్యష్టి (వ్యక్తి), సమష్టి (సమాజం), సష్టి, పరమేష్ఠి. ఈ నాలుగింటికి అతిరిక్తంగా ఏ అంశమూ వుండదు. వ్యక్తి యొక్క భావాలు ఆత్మాశ్రయమై, అనుభూతి ప్రధానమై వెలువ రిస్తే అవి వ్యష్టికి సంబంధించిన రచనలవు తాయి. శతక సాహిత్యంలో చాలా భాగం, భావకవిత్వం, అనుభూతి వాదకవిత్వం మొద లైనవి ఈ కోవలోకి చేరతాయి. అయితే వీటిలో ఇతర అంశాలుండవని కాదు. ప్రాధాన్య వ్యపదేశాన్ని బట్టి చెబుతున్నాను. కుటుంబానికి, సమా జానికి, దేశానికి, ప్రపంచానికి సంబంధించిన అంశాలను పరాశ్రయ దక్పథం తో వెలువరిస్తే అవి సమష్టికి సంబంధించినవి. అభ్యుదయాది కవిత్వ శాఖలు, వైయక్తికం కాని ఇతర రచనలన్నీ దీనిలో చేరు తాయి. సష్టి తత్త్వాన్ని, ప్రకతి విశేషాలను వివరించే రచలన్నీ మూడో భాగంగా గ్రహించవచ్చు. ఇక ఆధ్యాత్మిక విషయాలను భక్తిని, భగవత్త త్వాన్ని ప్రతిపాదించేవన్నీ చివరిదైన పరమేష్ఠి గురించి చెప్పే విగా స్థూలంగా గ్రహించవచ్చు.
'వర్ణిక' ప్రక్రియాపరంగా లేఖా సాహిత్యంలోకి చేరినా ఇది కేవలం ఏకాంశ బోధకమైన లేదా ప్రతిపాద కమైన గ్రంథం కాదు. దీన్ని అనేక కోణాల నుంచి అధ్యయనం చేస్తేనే దాని సమగ్రతత్త్వాన్ని అవగాహన చేసుకోగలం, అనుభూతిని పొంద గలం. భాషాపరంగా వాక్యనిర్మాణపరంగా, విషయం పరంగా, అభివ్యక్తిపరంగా మాత్రమే కాక లేఖ ఎవరిని సంబోధిస్తూ, ఎవరు వ్రాశారు అనే విషయాన్ని కూడా పరిశోధనా దక్పథంతో అధ్యయనం చేసినప్పుడు మాత్రమే దీనికి న్యాయం చేయగలం.
తెలుగు భాషమీద పట్టు సాధించాలన్నా అధికారం పొందాలన్నా ఈ గ్రంథంలోని పదజాలాన్ని పరిశీలించాలి. రచయిత్రి హదయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే వాక్య నిర్మాణాన్ని, ఏయే భావాన్ని ఎలాంటి వాక్యాల్లో ఎలాంటి ఊనికతో పొందుపరిచారో వాటిని చక్కగా అనుశీలించాలి. విషయం ప్రతిపాదించేటప్పుడు అది దేనికి సంబంధించింది - అంటే - వ్యష్ఠి సమష్ఠి, సష్టి, పరమేష్ఠిలలో - దేని గురించి అనే అంశాన్ని బాగా విశ్లేషించుకోవాలి. అలాగే, లేఖ ఎవరికి వ్రాస్తున్నారు? ఎవరు వ్రాస్తున్నారు ? ఆయా పేర్లేమిటి ? ఎందుకు అలా వైవిధ్యాన్ని పాటించారు? అనే దష్టితో చదవాలి. అప్పుడుగాని ఈ గ్రంథ లక్ష్యాన్ని గ్రహించలేం. మొత్తం మీద ఈ గ్రంథంపై చక్కటి పరిశోధన చేసి డాక్టరేట్ (పిహెచ్డి) పొందగలిగినంత విషయం దీనిలో ఉంది.
నేను వ్రాస్తున్న ఈ సమీక్షాత్మక వ్యాసంలో విషయపరమైన విషయాలు కొన్ని చెప్పదలచుకున్నాను. దీనిలోని లేఖలు కొన్ని చదువుతున్నపుడు ''ఆత్మాశ్ర యానుభూతి భావవీచిక పర్ణిక'' అని పించింది. మరికొన్ని చదువుతున్న పుడు ఇది ''సమాజ హితైషిక వర్ణిక'' అనిపిం చింది. అలాగే మరికొన్ని చూసినపుడు ''సష్టితత్వ విపంచిక వర్ణిక'' అని, మిగిలినవి చదివినపుడు ''పారమార్థిక లేఖావాహిక'' అనిపించింది. మొత్తం మీద ఈ గ్రంథం గురించి స్థూలంగా చెప్పాలంటే ''సమగ్ర భావ ప్రసారిక వర్ణిక'' అని చెప్పక తప్పదు.
వర్ణికలో మొత్తం 102 లేఖలున్నాయి. 1ం0ం2ొ3 ఈ సంఖ్య త్రిగుణాత్మకతను, త్రిగు ణాతీతతత్త్వాన్ని సూచి స్తుంది. వ్యక్తి, సమాజం, సష్టి - అన్నీ త్రిగుణా త్మక (సత్త్వ, రజస్తమో గుణ) మైనవే. వీటన్నిటికీ మూలకారణమైన పరమేష్ఠి మాత్రం వ్యక్తుడైతే త్రిగుణాత్మకుడు, అవ్యక్తుడైతే త్రిగుణా తీతుడు. అన్ని అంశాలు దీనిలో కనబడుతాయి కాబట్టి ''వర్ణిక''ను ''సమగ్రభావ ప్రసారిక'' అనవచ్చు. 'వర్ణిక' దీనిలో పేరులా కనబడుతుంది. కానీ దాని అర్థం చూస్తే తెలుపు మొదలైన వర్ణం అని, బంగారు వర్ణం అని నిఘంటువులు చెబుతున్నాయి. బంగారం అర్థకామాలకు ప్రతీకైతే, తెలుపు ధర్మానికి, మోక్షానికి ప్రతీక. మొత్తం మీద ''వర్ణిక పురుషార్థ ప్రతిపాదిక'' అని కూడా చెప్పవచ్చు.
102 లేఖలలో వ్యష్ఠికి సంబంధించినవి 52 ఉన్నాయి. సమష్ఠికి సంబంధించినవి 40 ఉండగా, సష్టికి సంబంధిం చినవి 5, పరమేష్ఠికి సంబంధించినవి 5 ఉన్నాయి. ఇవి ఉజ్జాయింపుగా చెప్పినవి మాత్రమే.
వైయక్తికానుభూతి, ప్రేమ, విరహం, విప్రలంభ భేదాలు, ప్రణయం, బాధ, తష్ణ, స్వీయానుభూతి, తలపులు, ఊహలు, విషాదం, ఒంటరితనం, ప్రేమ-కామం లాంటి అంశాలు వ్యక్తి మానసిక స్థితులను బట్టి ఆయా లేఖలలో వివరించబడ్డాయి. ఇవి చదివి అనుభూతి పొందాల్సినవి, ఆనందించాల్సినవి. ఇవన్నీ వ్యష్టిగా అంటే వైయక్తికంగా అనుభూతమయ్యేవి.
సమష్టితో ప్రతిపాదించిన అంశాలలో - స్నేహం, నేటి రాజకీయాల తీరు తెన్నులు, ఉపాధ్యాయుల నిబద్ధత, అసమర్థంగా జీవితాన్ని గడపడం నేటి కవులు, కవిత్వంపై రచయిత్రి అభిప్రాయాలు, సగటు యువతుల జీవనవిధానం, పిల్లల నియంత్రణం, మానవమూల్యాలు (నబఎaఅ Vaశ్రీబవర), దంపతుల అన్యోన్యత, ఉపాధ్యాయ విద్యార్థుల సంబంధాలు, బాలకార్మికుల జీవనస్థితిగతులు, స్త్రీల పరిస్థితులు, స్వార్థం, విశ్వమానవప్రేమ, నేటి సమాజం తీరు, వీధిబాలల కష్టాలు, స్త్రీలబాధలు, నేటి సమాజంలోని వ్యక్తులు, మానవమనస్తత్వం, కవుల్లోనూ ముఠాతత్త్వం (+తీశీబజూఱరఎ), శ్రమైక జీవన విశిష్టత, మాట తీరు, మానవసేవే మాధవ సేవ, దాంపత్యప్రేమ, వ్యక్తివికాసం, మాతభాష అయిన తెలుగు స్థితిగతులు, సమాజంలో అంధత్వం, ఉద్యోగినుల వెతలు, నాటకసాహిత్యం, మానవుల మనస్తత్వం ఆలోచనలు, జీవనవిధానం - ఇలా సమాజ పరమైన అనేక అంశాలను ప్రభావవంతంగా వివరించారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే మల్లీశ్వరి గొప్ప సామాజిక స్పహ కలిగిన రచయిత్రిగా దర్శనమిస్తారు.
సష్టికి సంబంధించిన లేఖలలో ప్రకతి మాధుర్యం, కాలం, కాలమహిమ-వింతలు, మార్పు, చీకటి ప్రశంసించడం లాంటి అంశాలు కనిపిస్తాయి.
పరమేష్ఠికి సంబంధించిన అంశాలలో విష్ణుమాయ గోపికా ప్రేమతత్త్వం, రాసలీల-ఆనందహేల, కాలం పరమాత్మ స్వరూపం, ఆనందానుభూతి లాంటి అంశాలు ఆమె ఆధ్యాత్మికానుభూతిని విశదీకరిస్తాయి.
ఇలా విషయపరంగా చూసినపుడు ఆమెకు ఏ విషయంపై అత్యంత ప్రేమ కాని, ఏ విషయంపై వ్యతిరేకత ఉన్నట్లు కనిపించదు. ఆమె ఒక నిబద్ధత కలిగిన ఉపాధ్యాయినిగా, కవయిత్రిగా రచయిత్రిగా, స్వీయానుభూతులు వ్యక్తపరుస్తూనే సమాజహితం కాంక్షించే ప్రజారచయిత్రిగా తన బాధ్యతను నిర్వహిస్తూ నేటి తరానికి మార్గదర్శకురాలుగా, మంచి హదయమున్న, మానవీయ మూల్యాలు కలిగిన గొప్ప రచయిత్రిగా దర్శనమిచ్చే మల్లీశ్వరిని ఈ గ్రంథం చదివినవారంతా అభినందించకుండా ఉండలేరు.
తెలుగు భాషపై, పదజాలంపై మక్కువ వచ్చి పోతున్న ఈ రోజుల్లో దాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఆమె పదజాలం తదితరాంశాలపై విడిగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. ఆమె తపనను అర్థం చేసుకుని, ఆమె కవితా హదయాన్ని, ఆర్ద్ర భావజాలాన్ని అందుకోగలిగితే ఆంధ్రులు అభినందనీయు లవుతారు.
గ్రంథసమీక్షలో గ్రంథ భౌతికరూపం, ముఖచిత్రం గురించి కూడా వివరిస్తారు. బహుళ వర్ణ మిశ్రితమైన ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది. వెల రు.250 ఉన్నా ఆసక్తిగలవారు కోరితే తగ్గించే అవకాశం ఉంది. 211 పేజీలున్న ఈ గ్రంథంలోని ముంజు మాటలతో సహా ప్రతి అక్షరం చదవదగిందే - ఈ ''వర్ణిక సమగ్రభావప్రసారిక'' అని కంఠోక్తిగా చెబుతూ మల్లీశ్వరి గారిని మనసా, వాచా అభినందిస్తున్నాను.
- బి. జయరాములు, అధ్యక్షులు
విశ్వసాహితి, రిటైర్డ్ ఇంఛార్జ్ డీన్, ఓరియంటల్ ఫ్యాకల్టీ,
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.