Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోయిల పంచమ శతిలో అపశతి
సరిగమలు తప్పి పోయిన వైనం
కోకిల స్వరమేనా ?
ఎరుక పట్టలేనంత జీర
ఎక్కడి చిగురు గొంతుకడ్డం పడిందో
సాధన తప్పి తిరుగుడు ఎక్కువ అయిందో !!
అరే ! కోయిలను బద్నామ్ చేస్తున్నారే
కాలుష్యం సాకిన గాలి పీలిస్తే
గొంతు పొగ చూరదా
ఇక ఆరోహణలు ఎక్కడ
అవరోహణలు ఎక్కడ
ఎక్కడికక్కడ రాగం అష్ట దిగ్భంధనం
స్వచ్ఛ బందావనం నుండి వలస వచ్చిన కోకిల
కొమ్మల పై ఏ రాగ దర్బారు చేయలేదు
గాలి పీల్చలేని గరం గరం నగరం నరకం కదా
కోయిల వాపస్ పోతే వసంతం పోయినట్లే
రాను రాను ఋతువులు రామని అంటాయేమో
ప్రకతిని వికతి చేసే ఆధునిక విజ్ఞాని అజ్ఞాని
కాకి లేదు పిట్టా లేదు కోయిల లేదు
అంతటా యాంత్రికమైన మనిషే
- కందాళై రాఘవాచార్య, 8790593638