Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్య
పరిశోధకులు అహౌబిలం కరుణాకర్, ఏలేటి
చంటి సూర్యాపేట జిల్లా మండల కేంద్రం
చింతలపాలెంలో అపూర్వ శిల్పాలను, శిథిల
త్రికూటాలయాన్ని గుర్తించారు. పూర్తిగా
జీర్ణస్థితిలో ఉన్న దేవాలయంలోని శిల్పాలు
బయటపడేసివున్నాయి. ఈ శిల్పాలలో బ్రహ్మ,
కేశవమూర్తి, ఆదిత్యుడు, భైరవ శిల్పాలు
ప్రధానమైనవి. ఈ త్రికూటాలయంలోని
ప్రధానదైవం శివలింగం కనిపించలేదు. కష్ణా
నదీ పరివాహక ప్రాంతాల్లో ఆలంపురం నుంచి
దేవరచర్ల దాక బ్రహ్మశిల్పాలు లభించడం
విశేషం. దేవాలయాలలో బ్రహ్మకు ప్రాధాన్యత
కల్పించడం ఈ ప్రాంతాలలోని ప్రత్యేకత.
మూడుతలలతో, పర(పై)హస్తాలలో పాశం, అంకుశం, కింది చేతులలో అక్షమాల, కుండిలతో, కంఠహారం, వక్ష బంధం, కటిమేఖల, ఉరుడాలు, యజ్ఞోపవీతం, జయమాల, చేతులకు, కాళ్ళకు కడియాలతో, హంస వాహనంతో కనిపిస్తున్న ఈ బ్రహ్మ శిల్పశైలి భిన్నమైనది. తలపై మణి మకుటంతో, రెండు చేతులలో తామర పుష్పాలతో, కంఠహారం, వక్షబంధం, కటిమేఖల, ఉరుడాలు, చెవులకు జూకాలు, కాళ్ళు,చేతులకు కడియాలతో సూర్యశిల్పం కూడా బ్రహ్మశిల్ప శైలిలోనే చెక్కబడింది. ఈ రెండు ఒకే కాలానికి, బాదామీ చాళుక్య శైలికి చెందినవి. కేశవ శిల్పం పశ్చిమ చాళుక్యశైలిలో అగుపిస్తున్నది.
ఈ త్రికూటాలయం చుట్టూ వ్యవసాయం చేయడం వల్ల ఆలయం బాగా దెబ్బతిన్నది. దేవాలయ స్థలం కూడా ఆక్రమణలకు గురౌతున్నదని ప్రజలు చెప్పుకుంటున్నారు. అద్భుత శిల్పాలతో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని, విలువైన శిల్ప సంపదను సంరక్షించాలని కొత్త తెలంగాణ చరిత్ర బందం ప్రభుత్వాన్ని కోరుతున్నది.
క్షేత్ర పరిశోధన, ఫోటోగ్రఫీ :
అహౌబిలం కరుణాకర్, 9640074420,
ఏలేటి చంటి, 9666757033
కొత్తతెలంగాణ చరిత్ర బృందం సభ్యులు
చారిత్రక వ్యాఖ్య :
శ్రీరామోజు హరగోపాల్, 9949498698
కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్ర బృందం