Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకతిలో ఎన్నో రకాల జీవులుంటాయి. అన్ని జీవులు కూడా తమదైన ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అయినప్పటికీ అన్ని రకాల జంతువులు కలసిమెలసి ఉంటాయి. ఒక దానిపై ఒకటి ఆధారపడి బతుకుతుంటాయి. ప్రకతిలో మొక్కలు, జంతువులు, మానవులు అంతా తమ ప్రత్యేకతను కోల్పోకుండానే కలసి సహజీవనం చేస్తుంటారు. జీవుల మధ్య ఉండే భిన్నత్వాన్నే వైవిధ్యాన్నే జీవ వైవిధ్యం అంటారు. ప్రస్తుత జీవనశైలి, జీవన గమనాల్లో తేడా వలన ప్రకతిలో సమతుల్యత దెబ్బ అంటున్నది. ప్రకతిలో సమతుల్యత లోపించటం వలన కొన్ని రకాల మొక్కలు, కొన్ని రకాల జంతువులు ప్రకతి నుంచి కనుమరుగవుతున్నాయి. కొన్ని రకాలు కనుమరుగయ్యే అంటే అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని గమనించి ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్యానికి ఒక రాజును నిర్ణయించాలని భావించింది. అందుకు గాను మేనెల ఇరవై రెండవ తేదిని ఎన్నుకుంది ప్రతి ఏం మేనెల ఇరవై రెండవ తేదిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకుంటున్నారు.
భారతీయ సంస్కృతి కూడా ప్రకతిని అనుసరించే భిన్నత్వంలో ఏకత్వం విధానాన్ని అవలంభిస్తున్నది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయంలో కూడా జంతువుల సహకారం ఉంటుంది. నేల లోపల ఉండే అనేక జీవాలు కూడా మొక్కలు పెరగటానికి తోడ్పడతాయి. ఏదైనా మొక్కను నాశనం చేసే కీటకాలు వచ్చినపుడు, ఆ కీటకాలను తినేసే మరో జీవుల్ని ప్రవేశపెడతారు. ఫలితంగా రసాయన మందుల అవసరం లేకుండానే వ్యవసాయం సాగుతూ ఉండేది. భారతదేశంలో పండుగలు కూడా ప్రకతిని అనుసరించే జరుపుకుంటారు. చెట్టు పుట్టకు మొక్కుతారు. జంతువుల్ని ఆరాధిస్తారు.
2010 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది. సంవత్సరమంతా జీవ వైవిధ్యాన్ని గురించిన సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 2012లో బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్ మన దేశంలోని హైదరాబాదు నగరంలో జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌కు 194 దేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, అటవీశాఖా మంత్రులు, జీవ శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జీవ వైవిధ్యం, జీవ భద్రతకు సంబంధించిన దాదాపు పదివేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ సమయంలో నేను కూడా బయోడైవర్సిటీ ఛార్టులను ప్రదర్శించి అవగాహన కల్పించాను.
సష్టిలో అన్ని జంతువుల మధ్య ఏకరూపత ఎంత ఉంటుందో వైవిధ్యం కూడా అంతే ఉంటుంది. ప్రకతిలో ఉండే జీవరాశులలో ఏ ఒక్కటీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అన్ని ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తుంటాయి. అన్నీ సమానమే. వీటిని గమనించిన భారతీయ ఋషులు, తత్త్వవేత్తలు మానవ జీవితం జంతువులకు మొక్కలకు విఘాతం కలిగించకుండా ఉండేలా భారతీయ ధర్మాలను రూపొందించారు. ఆదిలో వాటినలాగే కొనసాగించడం వలన అన్ని జీవులు ప్రకతిలో చక్కగా మనగలిగాయి. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకతి పైననే ఆధారపడతాడు. ప్రకతి లేనిదే మానవ జీవితం లేదు. వైవిధ్యం కూడా సష్టిలోని ఒక లక్షణమేనని స్వామి వివేకానంద పేర్కొన్నారు. వ్యవసాయ పద్ధతులు, జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు అన్ని కూడా మరొక దానికి విఘాతం కలగకుండా సష్టి చక్రానికి లోబడి జరిగేలా పూర్వపు ఋషులు చూశారు.
చెరువులో ఉండే కటకాలను తిని కప్ప బతుకుతుంది. కప్పను పాము తింటుంది. పామును గద్ద తింటుంది. గద్ద చనిపోయాక క్రిములు దాన్ని తిని ఇదే నేలలో కలిపేస్తాయి. ఏ జీవి అయినా, ఏ మొక్క అయినా అన్నీ చివరకు భూమిలో కలవాల్సిందే. మరల ఆ భూమిలో నుంచే మొక్కలు జన్మిస్తాయి.
ఆ మొక్కల్ని మళ్ళీ జంతువులు, మానవులు తింటుంటారు. ఇదొక ఆహారపు గొలుసు. ఈ గొలుసులో ఎక్కడైనా అవరోధం ఏర్పడినా, గొలుసు తెగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏ ఒక్క ప్రాణి అంతరించినా ఆ ప్రభావం మిగతా అన్నింటి మీదా తీవ్రంగా పడుతుంది. ఇలా జరిగినప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక పరిణామాలు ఎదురవుతాయి.
మానవుడు తన స్వార్థం కోసం అడువుల్ని నాశనం చేసి జనావాసాలుగా మార్చుకోవటం వలన వరదలు తుఫానులు మొదలైన ప్రకతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఇలా మనిషి ప్రకతి మీద పెత్తనాలు చేస్తుంటే చివరకు మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇదంతా ప్రకతి వినాశనానికి దారి తీసి యుగాంతానికి కారణం కావచ్చు. సష్టిలో ప్రతిజీవీ ప్రధానమే.
భారతదేశంలో ప్రస్తుతం నలభై ఐదు వేల వక్ష జాతులు, డెబ్బరు ఏడు వేల జంతు జాతులు జీవిస్తున్నాయి. ప్రపంచంలో ఉండే మహాజీవ వైవిధ్య ప్రాంతాలు మొత్తం పన్నెండు ఉన్నాయి. అలాంటి వాటిలో భారతదేశం ఒకటి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా పదివేల జాతుల జీవులు అంతరించిపోతున్నాయి. మరికొన్ని జాతులు అంతరించిపోయే దశగా పరుగులు పెడుతున్నాయి. గత కాలంలో ఉన్న జీవ సంపదలో ప్రస్తుతం పది శాతానికిపైగా ప్రమాదంలో ఉన్నదని తెలుస్తోంది. గత కొన్ని దశాబ్దాల కాలంగా మానవ జనాభా విపరీతంగా పెరిగిపోవడం వలన యాభై శాతానికి పైగా అరణ్యాలు, డెభ్బై శాతానికి పైగా నీటి వనరులు మాయమయ్యాయి.
మానవ జీవనశైలిలో మార్పుల కారణంగా విస్తారంగా మొలిచిన గడ్డిమైదానాలను, పచ్చిక బయళ్ళను నాశనం చేశాము. కొండలు, పర్వతాలను పిండి చేసి నివాస ప్రాంతాలుగా మార్చుకున్నాము. సముద్రాలలో నిర్మాణాలు చేపట్టి అవి చెలియలి కట్ట దాచేలా చేస్తున్నాం. అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి తినేయడంతో అరుదైన జాతులు కనుమరుగవుతున్నాయి. ఈ కారణంగా కొన్ని ఆంక్షలు, నిషేధాలు విధించినా యధేచ్ఛగా చెట్లు నరకడం, వన్యప్రాణుల్ని వేటాడటం జరుగుతూనే ఉన్నది.
ఆదివాసులు, గిరిజన ప్రజలు, కొండజాతి ప్రజలు జీవించే చోట అడపులు, జీవ సంపద మామూలుగానే ఉన్నది. వారు వాటిని పరిరక్షిస్తున్నారు. మన దేశంలోని మేఘూలయ, నాగాలాండ్, మంజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో గిరిజనులు దాదాపు 80 శాతం కన్నా ఎక్కువగా నివసిస్తున్నారు. వారు నివసించిన చోటంతా జీవవైవిధ్యం పదిలంగా, బాగా ఉన్నది. మన దేశంలో దాదాపు 50 మిలియన్ల కంటే ఎక్కువగా ఆదివాసులు నివసిస్తున్నారు.
వ్యవసాయంలో అధిక ప్రాధాన్యత రసాయనిక ఎరువులకూ, కిటకనాశనులకూ పెరగడంతో ఎన్నో చెడు ప్రభావాలకు లోనవుతున్నాయి. మానవ స్వార్థం, మందుల కంపెనీల అత్యాశా మందులను అధికంగా వాడేలా ప్రోత్సహించడంతో మిగతా జీవులకూ, మానవులకూ సమస్యలు ఏర్పడుతున్నాయి. భారతదేశం కూడా అధిక రసాయనాలను ఉత్పత్తి చేయడంలో ముందుకు పరిగెడుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల అపారజీవజాతుల్ని నష్టపోవడమే గాకుండా మన బతుకుల్ని ప్రమాదంలో పడవేసుకున్నాం.
పంటలు సరిగా పండకుండా, కావాల్సిన సమయంలో వానలు కురవకుండా వ్యవసాయం నాశనం కావడానికి మనిషే కారణం ప్రయోగాల పేరుతో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంటల్ని కనిపెడుతూ మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం. రసాయనాలు, బీటీ హైబ్రిడ్ విత్తనాలు అంటూ జన్యు మార్పిడితో రకరకాలు సష్టించి సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన ప్రకతి వ్యవసాయంలో కత్రిమ వాతావరణం లేకుండా పండించిన పంట సహజంగా నిలవ ఉంటుంది. జన్యు మార్పిడి వివాదాల్లో పండించిన పంటలు తిన్న మానవులు కూడా కొద్దిగా తిన్నా లావుగా మారిపోయి బబెసిటీ బారిన పడుతున్నారు. ఆరోగ్యాంగా ఉండాల్సిన పిల్లలు యువత ఉబకాయం బారిన పడి టెన్షన్లతో జీవితం సాగిస్తున్నారు.
రకరకాల రసాయనిక మందుల వలన భూమి, నీరు అన్ని కాలుష్యానికి గురవడం వలన మానవుడికి స్వచ్ఛమైన గాలి, నీరు కరువవుతున్నది. ప్రకతిలో స్వచ్ఛంగా దొరికే నీరు గాలి లభించడం లేదు. ఫలితంగా మానవులు అనేక విలయ తాండవాలకూ, ప్రకతి వైపరిరీత్యాలకు బాధ్యుడవుతున్నాడు. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు.
- డా|| కందేపి రాణీప్రసాద్